Begin typing your search above and press return to search.

బాలయ్య లెక్క పెరిగింది

నందమూరి నటసింహం బాలకృష్ణ కెరియర్ లో ఈ మధ్యకాలంలో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ అంటే ‘అఖండ’ అని ఫ్యాన్స్ వెంటనే చెబుతారు.

By:  Tupaki Desk   |   24 Sep 2024 11:30 PM GMT
బాలయ్య లెక్క పెరిగింది
X

నందమూరి నటసింహం బాలకృష్ణ కెరియర్ లో ఈ మధ్యకాలంలో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ అంటే ‘అఖండ’ అని ఫ్యాన్స్ వెంటనే చెబుతారు. ఈ సినిమాలో బాలకృష్ణ చేసిన డ్యూయల్ రోల్ ఫార్ములా నెవ్వర్ బిఫోర్ అనేలా క్లిక్కయ్యింది. ఇక అందులో అఘోర పాత్ర గురించి ఎంత చెప్పినా తక్కువే. బోయపాటి మేకింగ్ విధానం బాలయ్య యాక్షన్ డోస్ పర్ఫెక్ట్ గా సెత్తవ్వడంతో వారి కెరీర్ లోనే అత్యధిక కలెక్షన్స్ అందుకున్న చిత్రంగా ‘అఖండ’ నిలిచింది.

దీని తర్వాత బాలకృష్ణ ‘వీరసింహారెడ్డి’, ‘భగవంత్ కేసరి’ చిత్రాలతో రెండు హిట్స్ అందుకున్నారు. ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో మాస్ యాక్షన్ జోనర్ లోనే బాలయ్య మూవీ చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. ఇదిలా ఉంటే బాలకృష్ణ త్వరలో బోయపాటి శ్రీను దర్శకత్వంలో ‘అఖండ 2’ మూవీ మొదలు పెట్టబోతున్నారు. ఈ సినిమా ప్రీప్రొడక్షన్ స్టేజ్ లో ఉంది. 150 కోట్ల బడ్జెట్ తో పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా ‘అఖండ 2’ చిత్రాన్ని బోయపాటి తెరకెక్కించనున్నారు.

ఇదిలా ఉంటే ఈ సినిమా కోసం బాలకృష్ణ ఏకంగా 30 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటున్నారని టాక్ వినిపిస్తోంది. ‘భగవంత్ కేసరి’ సినిమాకి 18 కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్న బాలయ్య ‘NBK109’ కోసం 20 కోట్ల వరకు అందుకుంటున్నారంట. అయితే ‘అఖండ 2’ మూవీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ కావడంతో పాటు ఎక్కువ రోజులు కాల్ షీట్స్ కేటాయించాల్సి ఉంటుందని టాక్. ఈ నేపథ్యం 30 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకోబోతున్నారు అని టాక్ వినిపిస్తోంది.

ప్రస్తుతం టాలీవుడ్ లో అత్యధిక రెమ్యునరేషన్ అందుకుంటున్న స్టార్స్ లో బాలకృష్ణ టాప్ 10లోకి వచ్చాడు. ఇది వరకు 25 కోట్ల రెమ్యునరేషన్ తో బాలయ్య కంటే ముందు వరుసలో నాని, రవితేజ ఉండేవారు. అయితే రవితేజ వరుస ఫ్లాప్ ల కారణంగా రెమ్యునరేషన్ తగ్గినట్లు టాక్ వినిపిస్తోంది. ఇదే సమయంలో వరుస సక్సెస్ లతో జోరుమీదున్న బాలయ్య రెమ్యునరేషన్ భారీగా పెరిగింది.

‘అఖండ 2’ మూవీ సూపర్ హిట్ అయితే బాలయ్య రెమ్యునరేషన్ మరింత పెరిగే ఛాన్స్ ఉందని సినీ విశ్లేషకులు అంటున్నారు. ఈ ఏడాదిలోనే ‘అఖండ 2’ మూవీ షూటింగ్ మొదలు కానున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఇందులో కూడా బాలయ్య చేసిన రెండు క్యారెక్టర్స్ ఉంటాయంట. అలాగే హిందుత్వ అంశాలు కూడా మూవీలో పుష్కలంగా ఉండబోతున్నాయని ప్రచారం నడుస్తోంది. మరి బోయపాటి ఎలాంటి స్టోరీ లైన్ ను హైలెట్ చేస్తారో చూడాలి.