Begin typing your search above and press return to search.

నంద‌మూరి వార‌సులంతా సీక్వెల్స్-ప్రీక్వెల్!

నంద‌మూరి వార‌సులుంతా సీక్వెల్స్..ప్రీకెల్ అంటూ బిజీగా ఉన్నారా? బాల‌య్య నుంచి ఆయ‌న వార‌సుడు వ‌ర‌కూ అంతే అదే ప‌నిలో ఉన్నారా? అంటే స‌న్నివేశం అలాగే క‌నిపిస్తుంది.

By:  Tupaki Desk   |   21 Feb 2025 7:30 AM GMT
నంద‌మూరి వార‌సులంతా సీక్వెల్స్-ప్రీక్వెల్!
X

నంద‌మూరి వార‌సులుంతా సీక్వెల్స్..ప్రీకెల్ అంటూ బిజీగా ఉన్నారా? బాల‌య్య నుంచి ఆయ‌న వార‌సుడు వ‌ర‌కూ అంతే అదే ప‌నిలో ఉన్నారా? అంటే స‌న్నివేశం అలాగే క‌నిపిస్తుంది. ప్ర‌స్తుతం బాల‌కృష్ణ హీరోగా బోయ‌పాటి శ్రీను ద‌ర్శ‌క‌త్వంలో `అఖండ‌-2` శివ తాండవం తెర‌కెక్కుతోంది. ఇది `అఖండ` చిత్రానికి సీక్వెల్. భారీ అంచ‌నాల మ‌ధ్య తెరకెక్కుతోన్న బాలయ్య తొలి పాన్ ఇండియా చిత్రమిది.

ఈ సినిమాతో బాల‌య్య పాన్ ఇండియా స్టార్ అవ్వ‌డం ఖాయ‌మంటున్నారంతా. ఇక నంద‌మూరి క‌ల్యాణ్ రామ్ వ‌రుస‌గా 20, 21, 22 చిత్రాల్ని ప్ర‌క‌టించాడు. అందులో 21 వ చిత్రం ప్ర‌దీప్ చిలుకూరి ద‌ర్శ‌క‌త్వంలో చేస్తున్నాడు. నెంబ‌ర్ 20, 22 అనౌన్స్ మెంట్ అయ్యాయి. అందులో ఒక‌టి` బింబిసార` ప్రీక్వెల్. వశిష్ట తెర‌కెక్కించిన `బింబిసార` ఎలాంటి విజ‌యం సాధించిందో తెలిసిందే. కొంత గ్యాప్ త‌ర్వాత క‌ల్యాణ్ రామ్ కి మ‌రో భారీ హిట్ ఇచ్చిన చిత్ర‌మిది.

దీంతో ఇప్పుడీ సినిమా ప్రీక్వెల్ ప్లాన్ చేసారు. వశిష్ట `విశ్వంభ‌ర` నుంచి రిలీజ్ అవ్వ‌గానే ప్రీక్వెల్ ప‌నుల్లోనే నిమ‌గ్న‌మ‌వుతారు. ఈ నేప‌థ్యంలో క‌ల్యాణ్ రామ్ రెగ్య‌లర్ గా వ‌శిష్ట‌కు ట‌చ్ లో ఉంటి ఎప్ప‌టిక‌ప్పుడు అప్ డేట్స్ తెలుసుకుంటున్నారు. అలాగే యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ కూడా సీక్వెల్ లోనే న‌టిస్తున్నాడు. బాలీవుడ్ లో `వార్ 2`లో న‌టిస్తోన్న సంగ‌తి తెలిసిందే. ఇందులో హృతిక్ రోష‌న్ తో క‌లిసి తెర‌ను పంచుకుంటున్నాడు.

`వార్` చిత్రానికి సీక్వెల్ గా రూపొందుతున్న చిత్ర‌మిది. బాలీవుడ్ లో తార‌క్ డెబ్యూ చిత్ర‌మిదే. ఇక బాల‌య్య త‌న‌యుడు మోక్ష‌జ్ఞ కూడా సీక్వెల్ తోనే టాలీవుడ్ ఎంట్రీకి రెడీ అవుతున్న‌ట్లు తెలుస్తోంది. బాల‌య్య న‌టించిన `ఆదిత్య 369` చిత్రానికి సీక్వెల్ గా `ఆదిత్య 999`ని ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. ఈ సినిమాకి స్వ‌యంగా బాల‌య్య క‌థ రాసారు. ఆయ‌నే ద‌ర్శ‌క‌త్వం కూడా వ‌హిస్తార‌ని స‌మాచారం. ఇదే సినిమాతో మోక్ష‌జ్ఞ‌ని లాంచ్ చేయాల‌ని బాల‌య్య ప‌ట్టు మీద ఉన్నారు. బాల‌య్య ప్రీ అయిన అనంత‌రం ప్రాజెక్ట్ ప‌ట్టాలెక్కుతుందని తెలుస్తుంది.