Begin typing your search above and press return to search.

బాబి పిలిచేదెప్పుడు? బాల‌య్య వెయిటింగ్ అక్క‌డ‌!

దీంతో కెమెరా ముందు యాక్ష‌న్ కి బాగా గ్యాప్ వ‌చ్చిన‌ట్లు అయింది. దీంతో బాబి మ‌ళ్లీ ఎప్పుడు పిలుస్తాడా? అని ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు.

By:  Tupaki Desk   |   25 May 2024 5:30 PM GMT
బాబి పిలిచేదెప్పుడు? బాల‌య్య వెయిటింగ్ అక్క‌డ‌!
X

న‌ట‌సింహ బాల‌కృష్ణ‌...బాబి పిలుపు కోసం ఎదురు చూస్తున్నారా? ఎప్పుడెప్పుడు పిలుస్తాడా? అని ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారా? అంటే అవున‌నే తెలుస్తోంది. ఏపి ఎన్నిక‌ల కాల‌ర‌ణంగా బాల‌య్య కొన్నాళ్ల గా సినిమాల‌కు దూర‌మైన సంగ‌తి తెలిసిందే. ఎన్న‌డు లేనంత‌గా ఈసారి బాల‌య్య ఎల‌క్ష‌న్ క్యాంపెయిన్ లో పాల్గొనాల్సి వ‌చ్చింది. దీంతో కెమెరా ముందు యాక్ష‌న్ కి బాగా గ్యాప్ వ‌చ్చిన‌ట్లు అయింది. దీంతో బాబి మ‌ళ్లీ ఎప్పుడు పిలుస్తాడా? అని ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు.

ఈ విష‌యాన్ని బాల‌య్య స్వ‌యంగా ఓ వేడుక‌లో రివీల్ చేసారు. `ఎలక్షన్ క్యాంపెయిన్ తర్వాత షూటింగ్‌లో పాల్గొనాలని.. యమా ఉత్సాహంతో వచ్చా. కానీ నా సినిమా షూటింగ్ ఇంక మొదలు కాలేదు. దాదాపు 45 రోజులుగా కెమెరాను చూడలేదు. ఇన్ని రోజులు మిస్ అయిన ఆ సందడి అంతా ఈరోజు సత్యభామ ఈ‌వెంట్‌లో చూస్తున్నాను` అన్నారు. ప్ర‌స్తుతం బాబి ద‌ర్శ‌క‌త్వంలో బాల‌య్య 109వ సినిమా తెర‌కెక్కుతోన్న సంగ‌తి తెలిసిందే.

ఇప్ప‌టికే కొద్ది భాగం షూటింగ్ కూడా పూర్త‌యింది. బాల‌య్య ఎన్నిక‌ల ప్ర‌చారంలో పాల్గొన్న స‌మ‌యంలో ఆయ‌నలేని స‌న్నివేశాలు చిత్రీక‌రించారు. ఇత‌ర కీల‌క న‌టుల‌పై షూటింగ్ నిర్వ‌హించారు. దీంతో దాదాపు ఆ పోర్ష‌న్ పూర్త‌యింది. దీంతో బాల‌య్య పై స‌న్నివేశాలే పెండింగ్ లో ఉన్నాయి. ఇటీవ‌ల ఎన్నిక‌ల పూర్త‌యిన నేప‌థ్యంలో ఫ‌లితాల‌తో సంబంధం లేకుండా బాల‌య్య తిరిగి హాజ‌ర‌వుతార‌ని అంతా భావించారు.

కానీ బాల‌య్య రెడీగా ఉన్నా బాబి సిద్దంగా లేన‌ట్లు క‌నిపిస్తుంది. అందుకే బాల‌య్య నేను రెడీ గా ఉన్నాను..నువ్వు కూడా రెడీ అవ్వు అనే సంకేతాలు పంపిన‌ట్లు అయింది. మ‌రి ఇప్ప‌టికైనా బాబి సిద్ద‌మ‌వుతాడా? లేదా ? అన్న‌ది చూడాలి. న‌ట‌సింహం `అఖండ` .. `వీరసింహా రెడ్డి` ..`భగవంత్ కేసరి` సినిమాలతో మంచి ఊపు మీద ఉన్నాడు. వ‌రుస‌గా మూడు సినిమాల విజ‌యంతో హ్యాట్రిక్ న‌మెదు చేసారు. దీంతో డ‌బుల్ హ్యాట్రిక్ కోసం ట్రై చేస్తున్నారు. 109 తో కూడా హిట్ కొట్టాల‌ని క‌సి మీద ఉన్నారు.