80 భారీ సెట్స్ తో 'డెవిల్' కి వింటేజ్ లుక్
పీరియాడిక్ మూవీ కనుక భారీ ఎత్తున సెట్టింగ్ ను ఉపయోగిస్తున్నారు. పైగా బ్రిటీష్ కాలం నాటి మూవీ కనుక ప్రతి విషయం లో కూడా సెట్ అత్యంత కీలక పాత్ర పోషిస్తున్నాయి
By: Tupaki Desk | 4 Sep 2023 11:13 AM GMTనందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా రూపొందుతున్న తాజా చిత్రం 'డెవిల్'. 1940 బ్యాక్ డ్రాప్ తో భారీ పీరియాడిక్ మూవీగా ఈ సినిమాను ప్రముఖ నిర్మాత అభిషేక్ నామా రూపొందిస్తున్నారు. పీరియాడిక్ మూవీ కనుక భారీ ఎత్తున సెట్టింగ్ ను ఉపయోగిస్తున్నారు. పైగా బ్రిటీష్ కాలం నాటి మూవీ కనుక ప్రతి విషయం లో కూడా సెట్ అత్యంత కీలక పాత్ర పోషిస్తున్నాయి.
సినిమా కథకు మరియు కథనం కు అవసరం అయిన సెట్టింగ్స్ ను ఇప్పటికే నిర్మించారు. ఈ సినిమా కోసం దాదాపుగా 80 భారీ సెట్స్ ను ఆర్ట్ డైరెక్టర్ గాంధీ రూపొందించారు. సినిమా ను చూస్తున్న ప్రేక్షకులను బ్రిటిష్ కాలం నాటికి తీసుకు వెళ్లే ఉద్దేశ్యంతో ప్రతి ఒక్కటి కూడా అద్భుతంగా తీర్చిదిద్దినట్లుగా చిత్ర యూనిట్ సభ్యులు నమ్మకంగా చెబుతున్నారు.
బ్రిటిష్ పరిపాలన కాలంలో మన దేశంలో ఉన్న మౌలిక వసతులు ఇతర భవనాలను సెట్స్ రూపంలో చూపించడం ఛాలెంజింగ్ గా అనిపించిందని ఆర్ట్ డైరెక్టర్ గాంధీ అన్నారు. ఈ సెట్స్ నిర్మాణం కోసం తమిళనాడు, కర్ణాటక, కేరళ, రాజస్థాన్ నుండి కూడా సామాగ్రిని తెప్పించినట్లుగా గాంధీ పేర్కొన్నారు.
డెవిల్ సినిమా బ్రిటీష్ సీక్రెట్ ఏజెంట్ అనే ట్యాగ్ లైన్ తో రూపొందుతోంది. బ్రిటిష్ కాలం నాటి ప్రతి ఒక్క డిటైల్ ను ప్రేక్షకులకు కళ్లకు కట్టినట్లుగా చూపించు ఉద్దేశ్యంతో 80 సెట్స్ ను భారీగా ఖర్చు చేసి మరీ రూపొందించినట్లు దర్శకుడు పేర్కొన్నారు. అభిషేక్ నామా సపోర్ట్ తో తాము ఈ భారీ సెట్స్ నిర్మాణం చేసినట్లు దర్శకుడు తెలియజేశారు.
ఈ సినిమా కోసం 1940 మద్రాస్ ప్రాంతంలోని ఆంధ్రా క్లబ్, 36 అడుగుల ఎత్తైన లైట్ హౌస్ సెట్, అప్పటి కాలంకు చెందిన కార్గో షిప్, బ్రిటీష్ కాలం నాటి 500 పుస్తకాలను ఇంకా వింటేజ్ కార్లు, సైకిల్స్ ను కూడా రూపొందించారు. ఈ మొత్తం సెట్స్ తో సినిమాకు ఒక సూపర్ వింటేజ్ లుక్ రావడం ఖాయం అన్నట్లుగా నందమూరి అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.