Begin typing your search above and press return to search.

అఖండ - మోక్షజ్ఞ - హిందుత్వం.. సూపర్‌ కాంబో

నందమూరి ఫ్యాన్స్ అఖండ 2 కోసం ఎంత ఆసక్తిగా ఎదురు చూస్తున్నారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు

By:  Tupaki Desk   |   9 July 2024 5:25 AM GMT
అఖండ - మోక్షజ్ఞ - హిందుత్వం.. సూపర్‌ కాంబో
X

నందమూరి ఫ్యాన్స్ అఖండ 2 కోసం ఎంత ఆసక్తిగా ఎదురు చూస్తున్నారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇదే సమయంలో వారు బాలకృష్ణ తనయుడు నందమూరి మోక్షజ్ఞ ఎంట్రీ కోసం కూడా చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ రెండు ఎదురు చూపులకు ఒకే సారి తెర పడబోతుంది అంటూ నందమూరి కాంపౌండ్‌ నుంచి సమాచారం అందుతోంది.

విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం బాలయ్య హీరోగా బోయపాటి దర్శకత్వంలో రూపొందబోతున్న అఖండ 2 లో కీలకమైన పాత్రను మోక్షజ్ఞతో చేయించబోతున్నారు. సెకండ్‌ హాఫ్‌ లో వచ్చే ఆ పాత్ర సినిమా కి హైప్ తెచ్చి పెడుతుందని అంటున్నారు. బాలయ్య కి బోయపాటి అంటే గురి ఎక్కువ.. అందుకే మోక్షజ్ఞ ఎంట్రీ కి అఖండ 2 తో ఓకే చెప్పాడని తెలుస్తోంది.

అఖండ 2 లో హిందుత్వం ను చూపించడంతో పాటు, సనాతన ధర్మ ను కాపాడుకోవాల్సిన అవసరం గురించి కూడా వివరించబోతున్నారు అనే వార్తలు వస్తున్నాయి. మొత్తానికి బాలయ్య - బోయపాటి కాంబో హిట్‌ కాంబోగా ఇప్పటికే హ్యాట్రిక్ సొంతం చేసుకోగా, హిందుత్వం మరియు మోక్షజ్ఞ ల వల్ల అఖండ 2 అద్భుతంగా నిలుస్తుందని ఫ్యాన్స్ నమ్మకం వ్యక్తం చేస్తున్నారు.

ఇప్పటికే బోయపాటి రాసుకున్న పాత్ర కోసం మోక్షజ్ఞ లుక్ టెస్ట్‌ పూర్తి అయ్యింది. మోక్షజ్ఞ బాడీ లాంగ్వేజ్ కి తగ్గట్లుగా షూటింగ్‌ సమయంలో పాత్ర కి సంబంధించిన మార్పులు చేర్పులు చేసుకుంటూ వెళ్లాలని భావిస్తున్నారు. విదేశాల్లో యాక్టింగ్‌ మరియు డైరెక్షన్‌ పై సుదీర్ఘ కాలం పాటు ట్రైనింగ్‌ తీసుకున్న మోక్షజ్ఞ హీరో గా కూడా ముందు ముందు ఎంట్రీ ఇవ్వబోతున్నాడు.

అఖండ 2 వంటి హిందుత్వ సినిమా మరియు హిట్ కాంబోలో నటించడం ద్వారా మోక్షజ్ఞ మొదటి ప్రాజెక్ట్‌ సేఫ్‌ ప్రాజెక్ట్‌ అవుతుంది అనేది ఇండస్ట్రీ వర్గాల అభిప్రాయం. బాలయ్య కూడా అదే అభిప్రాయంతో ఉన్నాడు. కనుక అఖండ 2 సినిమా లో మోక్షజ్ఞ ను నటింపజేస్తున్నారు అనే సమాచారం అందుతోంది.