చిరూ- ఓదెల మూవీ అప్డేట్ ఇచ్చిన నాని!
ఇదిలా ఉంటే తాజాగా చిరూ- ఓదెల సినిమాకు సంబంధంచిన ఓ కీలక అప్డేట్ బయటికొచ్చింది.
By: Tupaki Desk | 22 Feb 2025 5:30 AM GMTనేచురల్ స్టార్ నానితో తీసిన దసరా మూవీ ద్వారా మొదటి ప్రయత్నంలోనే డైరెక్టర్ గా మంచి సక్సెస్ అందుకున్నాడు శ్రీకాంత్ ఓదెల. దసరా మూవీ తర్వాత శ్రీకాంత్ కు మంచి డిమాండ్ ఏర్పడింది. శ్రీకాంత్ తర్వాతి సినిమాను ఎవరితో చేస్తాడా అని అందరూ అనుకుంటున్న టైమ్ లో మరోసారి నానితోనే సినిమాను కన్ఫర్మ్ చేసుకుని ది ప్యారడైజ్ అనే సినిమాను తీస్తున్నాడు శ్రీకాంత్.
ప్రస్తుతం నానితో ది ప్యారడైజ్ చేస్తున్న శ్రీకాంత్, మెగాస్టార్ చిరంజీవితో ఓ భారీ సినిమాను అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. గతేడాది డిసెంబర్ లోనే ఈ ప్రాజెక్టును అధికారికంగా ప్రకటించారు. హింసలోనే అతడు తన శాంతిని వెతుక్కున్నాడని ప్రీ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేసి, ఆ సినిమా చాలా వయొలెంట్ గా తెరకెక్కనుందని క్లారిటీ ఇచ్చాడు.
ఆ ప్రీ లుక్ పోస్టర్ చూసిన దగ్గర నుంచి ఈ కాంబినేషన్ లో సినిమా ఎప్పుడెప్పుడు సెట్స్ పైకి వెళ్తుందా అని అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇదిలా ఉంటే తాజాగా చిరూ- ఓదెల సినిమాకు సంబంధంచిన ఓ కీలక అప్డేట్ బయటికొచ్చింది. ఈ మూవీకి నేచురల్ స్టార్ నాని సమర్పకునిగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే.
రీసెంట్ గా ఓ మూవీ ఈవెంట్ కు హాజరైన నాని చిరూ- ఓదెల ప్రాజెక్టు గురించి మాట్లాడాడు. చిరంజీవితో శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహించనున్న మూవీ వచ్చే సంవత్సరంలో ఉంటుందని నాని క్లారిటీ ఇచ్చాడు. ప్రస్తుతం ది ప్యారడైజ్ సినిమాతో బిజీగా ఉన్న శ్రీకాంత్ ఆ సినిమా తర్వాతే చిరూ సినిమాను మొదలుపెట్టనున్నట్టు తెలుస్తోంది.
ఈ లోగా చిరంజీవి కూడా వశిష్ట తో చేస్తున్న విశ్వంభరతో పాటూ అనిల్ రావిపూడి సినిమాను కూడా పూర్తి చేసుకుని ఫ్రీ అయిపోతాడు. చిరూ- శ్రీకాంత్ కాంబోలో రానున్న సినిమాను సుధాకర్ చెరుకూరి భారీ బడ్జెట్ తో నిర్మించనున్నాడు. అయితే ఈ సినిమాను శ్రీకాంత్ ఓ పీరియడ్ యాక్షన్ మూవీ చేయనున్నట్టు తెలుస్తోంది. మెగాస్టార్ గత సినిమాలతో పోలిస్తే ఈ సినిమా మరింత డిఫరెంట్ గా ఉండనుందని నాని చెప్పాడు.