స్టాండింగ్ ఓవేషన్స్ చేసేలా కోర్ట్ : నాని
సాధారణంగా ఒక సినిమా సక్సెస్ అయితే మనం గెలిచినట్టు అనిపిస్తుందని కానీ కోర్ట్ సినిమా సక్సెస్ అయితే ఆడియన్స్ గెలిచినట్టు అవుతుందని అన్నారు నాని.
By: Tupaki Desk | 21 Feb 2025 2:00 PM GMTన్యాచురల్ స్టార్ నాని హీరోగానే కాదు నిర్మాతగా కూడా తన అభిరుచిని చూపిస్తున్నాడు. నాని నిర్మాతగా ఇప్పటికే 3, 4 సినిమాల దాకా వచ్చాయి ఐతే నాని నిర్మాతగా వస్తున్న లేటెస్ట్ సినిమా కోర్ట్. ఈ సినిమాను రామ్ జగదీష్ డైరెక్ట్ చేయగా ప్రియదర్శి, హర్ష్ రోషన్, శ్రీదేవి ప్రధాన పాత్రలుగా నటించారు. సినిమాను నాని సమర్పిస్తుండగా దీప్తి గంటా, ప్రశాంతి నిర్మిస్తున్నారు.
రీసెంట్ గా కోర్ట్ సినిమా నుంచి ఒక సాంగ్ రిలీజ్ కాగా అది సూపర్ హిట్ అయ్యింది. ఇక కోర్ట్ సినిమా గురించి మరిన్ని డీటైల్స్ అందించేందుకు మీడియా ముందుకు వచ్చారు నాని అండ్ టీం. సినిమాలో ముఖ్యంగా పోస్కో చట్టం గురిచి చర్చించామని. సినిమాలో మెయిన్ లీడ్ ఎవరన్నది కాదు సినిమా కథ ఏంటన్నది ప్రధానమని అన్నారు. ఈ సినిమా కథ కోసం పోస్కో యాక్ట్ మీద దర్శకుడు రామ్ జగదీష్ చాలా రీసర్చ్ చేశాడని చెప్పారు నాని.
అంతేకాదు సినిమాకు సంబందించిన మరికొన్ని డీటైల్స్ ట్రైలర్ లో తెలుస్తాయని. ఇక సినిమా తప్పకుండా బ్లాక్ బస్టర్ సాధించే అర్హత ఉందని.. ఈ సినిమాకు ఆడియన్స్ స్టాండింగ్ ఓవేషన్ చేస్తారని. సాధారణంగా ఒక సినిమా సక్సెస్ అయితే మనం గెలిచినట్టు అనిపిస్తుందని కానీ కోర్ట్ సినిమా సక్సెస్ అయితే ఆడియన్స్ గెలిచినట్టు అవుతుందని అన్నారు నాని.
తను నటించే సినిమాల కథ విషయంలోనే చాలా కేర్ తీసుకునే నాని ఇక నిర్మించిన సినిమా విషయంలో ఎలాంటి జాగ్రత్త వహిస్తాడన్నది తెలిసిందే. కోర్ట్ సినిమా ముఖ్యంగా పోస్కో చట్టం గురించి చెప్పబోతున్నారని తెలుస్తుంది. ఐతే నాని ఈ సినిమా మీద ఎంత నమ్మకం ఉంటే సినిమా కచ్చితంగా బ్లాక్ బస్టర్ డిసర్వ్ చేస్తుందని అన్నాడో అర్థం చేసుకోవచ్చు. అదీగాక ప్రియదర్శి చేసిన ఇలాంటి కొత్త ప్రయత్నాలు అన్నీ కూడా మంచి సక్సెస్ సాధించాయి. మరి ఈ కోర్ట్ కూడా వాటి సరసన నిలుస్తుందా లేదా అన్నది చూడాలి. నాని నిర్మించిన కోర్ట్ సినిమా మార్చి 14న ప్రేక్షకుల ముందుకు వస్తుంది. నాని కాన్ ఫిడెంట్స్ చూస్తుంటే ఒక మంచి సినిమా తీశామన్నది కనిపిస్తుంది. మరి ఈ కోర్ట్ ని ఆడియన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారు అన్నది సినిమా వస్తేనే తెలుస్తుంది.