Begin typing your search above and press return to search.

టైర్-1... నాని అలా అనేశాడేంటి?

అయితే ఈ విషయంపై నాని తాజాగా స్పందించారు. సరిపోదా శనివారం హిట్ అయిన సందర్భంగా మేకర్స్ శనివారం ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు.

By:  Tupaki Desk   |   31 Aug 2024 4:54 PM GMT
టైర్-1... నాని అలా అనేశాడేంటి?
X

టైర్ -1.. టైర్ -2.. టైర్ -3.. సినీ ఇండస్ట్రీలో ఈ పేర్లు ఎక్కువగా వినిపిస్తుంటాయి. వీటి కోసం అందరికీ తెలిసిందే. అయితే టాలీవుడ్ నేచురల్ స్టార్ నాని.. సరిపోదా శనివారం మూవీతో టైర్-1 హీరోగా మారనున్నారని గత కొద్ది రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. దర్శకుడు వివేక్ ఆత్రేయ తెరకెక్కించిన ఆ సినిమా.. పాజిటివ్ టాక్ దక్కించుకుని ఓ రేంజ్ లో దూసుకుపోతోంది. బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబడుతోంది. దీంతో నాని టైర్-1 హీరో అయిపోయాడని అంతా అంటున్నారు.

అయితే ఈ విషయంపై నాని తాజాగా స్పందించారు. సరిపోదా శనివారం హిట్ అయిన సందర్భంగా మేకర్స్ శనివారం ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఆ సమయంలో మీరు టైర్ 2 నుంచి టైర్ 1 లోకి వ‌చ్చేశారంటున్నారు.. మీ రెస్పాన్స్ ఏంటనే అడగ్గా?.. నాని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. టైర్ 1, టైర్ 2లు అంటూ పేర్లు పెట్ట‌కండి స‌ర్.. ఎవరు మొదలుపెట్టారో.. ఎందుకు ప్రారంభించారో తెలియదు కానీ.. మీకు దండం పెడతాను ఆ గోల నుంచి నన్ను వదిలేయండని వ్యాఖ్యానించారు.

అసలు తనకు సంబంధం లేని వాటి గురించి ప్ర‌శ్నలు అడిగితే స‌మాధానాలు ఎలా చెప్ప‌గ‌లుగుతానని నాని అన్నారు. ఎవరో క్రియేట్ చేశారు.. అదే ముందుకు వెళ్తుంది.. నాకేం సంబంధం లేదు.. ఈ గోల నుంచి నన్ను వదిలేయండని కోరారు. తనకు నచ్చిన కథ, నచ్చిన సినిమాలు చేసుకుంటూ వెళ్లాలని ఉందని తెలిపారు. సినీ ప్రియులను అలరించాలని మాత్రమే ఉందని చెప్పారు. తనకంటూ ప్రత్యేక టార్గెట్ లేదని స్పష్టం చేశారు. అయితే దర్శకుడు వివేక్ ఆత్రేయ కూడా స్పందించారు.

తాను నానితో రెండు సినిమాలు చేశాను కనుక.. ఆయన ఫ్యాన్స్ గురించి తనకు ఒక అంచనా ఉందని వివేక్ తెలిపారు. సాధారణంగా ఫ్యాన్స్ వార్స్ జరుగుతుంటాయి.. కానీ నానికి ఇంకా ఎక్కువ ఫ్యాన్స్ వార్స్ జరుగుతుంటాయని చెప్పారు. ఆయన సినిమాల్లో ఒక్కో మూవీకి ఒక్కో రకం ఫ్యాన్స్ ఉంటారని అన్నారు. వివిధ రకాల అభిమానులను నాని సొంతం చేసుకున్నారని చెప్పారు. ఒక్కో వర్గం ఫ్యాన్స్ ను ఆయన టచ్ చేసుకుంటూ వెళ్తున్నారని దర్శకుడు పేర్కొన్నారు.

కాబట్టి నానిని ఇలా టైర్ 1, టైర్ 2 అంటూ అనవసరంగా రెస్ట్రిక్ట్ చేయవద్దని కోరారు వివేక్ ఆత్రేయ. ఒకదానికే పరిమితం చేయకుండా వదిలేయడం మంచిదని చెప్పారు. అదే ఇండస్ట్రీకి, ఫ్యాన్స్ కు బెస్ట్ ఛాయిస్ అని తెలిపారు. అప్పుడే నాని మరెంతో గొప్ప స్థాయికి కచ్చితంగా వెళ్తారని అన్నారు. మన సినిమాలను కూడా గొప్ప స్థాయికి తీసుకెళ్తారని చెప్పారు. మొత్తానికి టైర్-1, టైర్-2 విషయంపై నానితోపాటు వివేక్ ఆత్రేయ చేసిన కామెంట్స్ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారాయి.