Begin typing your search above and press return to search.

ఇందుకే నాని వెంట పడేది..

అష్టాచెమ్మా సినిమాతో హీరోగా టాలీవుడ్ లోకి అడుగుపెట్టిన నాని పూర్తిస్థాయిలో కమర్షియల్ స్టార్ అనిపించుకోవడానికి చాలా టైం తీసుకున్నాడు.

By:  Tupaki Desk   |   12 Sep 2024 4:13 AM GMT
ఇందుకే నాని వెంట పడేది..
X

అష్టాచెమ్మా సినిమాతో హీరోగా టాలీవుడ్ లోకి అడుగుపెట్టిన నాని పూర్తిస్థాయిలో కమర్షియల్ స్టార్ అనిపించుకోవడానికి చాలా టైం తీసుకున్నాడు. 2015లో ఎవడే సుబ్రహ్మణ్యం, భలే భలే మగాడివోయ్ సినిమాలతో వరుసగా రెండు సక్సెస్ లు అందుకున్న నాని హీరోగా తనదైన మార్కెట్ క్రియేట్ చేసుకున్నాడు. అప్పటి నుంచి సినిమా సినిమాకి తన ఇమేజ్ ని నాని పెంచుకుంటూ వస్తున్నాడు. అలాగే మార్కెట్ వేల్యూ కూడా పెరుగుతోంది.

రిపిటీటివ్ గా బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకుంటూ వస్తోన్న నాని నిర్మాతలకి కూడా భరోసా ఇస్తున్నాడు. దసరా సినిమాకి ముందు నానికి సక్సెస్ రేట్ బాగానే ఉన్న కూడా భారీ బడ్జెట్ తో మూవీస్ చేయడానికి నిర్మాతలు వెనకడుగు వేసేవారు. సినిమా బడ్జెట్ ఎక్కువ పెడితే ఎక్కడ రిస్క్ లో పడతామో అని భయపడేవారు. అయితే దసరా మూవీ నాని కెరియర్ లోనే హైయెస్ట్ కలెక్షన్స్ ని అందుకుంది. ఈ మూవీ ఏకంగా 117 కోట్ల బాక్సాఫీస్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుంది.

నిర్మాతకి భారీగా లాభాలు తెచ్చిపెట్టింది. తరువాత హాయ్ నాన్న మూవీ కూడా 75 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ని అందుకుంది. కమర్షియల్ సక్సెస్ గా నిలిచింది. ఇప్పుడు సరిపోదా శనివారం సినిమాతో మరో కమర్షియల్ హిట్ ని నాని సొంతం చేసుకున్నాడు. ఈ మూవీ 100 కోట్ల కలెక్షన్స్ దిశగా దూసుకెళ్తోంది. నాని కెరియర్ లోనే సెకండ్ హైయెస్ట్ కలెక్షన్స్ చిత్రంగా సరిపోదా శనివారం నిలిచింది. ఈ మూడు సక్సెస్ ల తర్వాత నాని మార్కెట్ మీద నిర్మాతలకి కూడా నమ్మకం పెరిగింది.

కంటెంట్ బట్టి 100 కోట్లకి పైగా బడ్జెట్ పెట్టిన రికవరీ అవుతుందనే భరోసాని ఈ సినిమాలు ఇచ్చాయి. ప్రస్తుతం నాని సొంత బ్యానర్ లో హిట్ 3 మూవీ శైలేష్ కొలను దర్శకత్వంలో చేస్తున్నారు. ఈ మూవీ కోసం నాని ఏకంగా 70 కోట్లు ఖర్చు పెడుతున్నాడంట. దీని తర్వాత శ్రీకాంత్ ఓదేల దర్శకత్వంలోనే సుధాకర్ చెరుకూరి నిర్మాణంలో మరో సినిమా నాని చేస్తున్నాడు. ఈ సినిమాని 100 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించబోతున్నారంట.

ఆ తరువాత సుజిత్ దర్శకత్వంలో నాని మూవీ చేయనున్నాడు. ఈ సినిమాకి 150 కోట్ల వరకు బడ్జెట్ అయ్యే అవకాశం ఉందంట. అప్పటికి నాని మార్కెట్ కూడా పాన్ ఇండియా లెవల్ కి పెరుగుతుందని నిర్మాతలు భావిస్తున్నారు. హిట్ 3, శ్రీకాంత్ ఓదేల మూవీస్ సక్సెస్ అయితే 150 కోట్ల బడ్జెట్ కూడా నానిపైన రిస్క్ కాకపోవచ్చని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు.