అయ్యప్ప మాలలో అబుదాబి అందాల మధ్య!
అబుదాబిలో ఐఫా వేడుకలు నిన్నటి రోజున ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 28 Sep 2024 7:54 AM GMTఅబుదాబిలో ఐఫా వేడుకలు నిన్నటి రోజున ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే. అందాల తారా తారణంతో అబుదాబి వెలిగిపోయింది. భారతీయ చిత్రపరిశ్రమ నటులంతా హాజరయ్యారు. ఏ ఒక్కరూ ఈ వేడుకను మిస్ అవ్వలేదు. ముఖ్యంగా బాలీవుడ్ నుంచి దాదాపు అంతా హాజరయ్యారు. ఐఫా అంటే వాళ్లకు ఎంతో ప్రత్యేకం. పెద్ద పెద్ద స్టార్లే ఆ ఈవెంట్ ని హోస్ట్ చేస్తుంటారు.
ఈ సారి ఆ బాద్యతలు షారుక్ ఖాన్ తీసుకుని ముందుకెళ్లారు. ఇక టాలీవుడ్ నుంచి చిరంజీవి, వెంకటేష్ సహా చాలా మంది హాజరయ్యారు. అలాగే నేచురల్ స్టార్ నాని కూడా ఈవేడుకకు హాజరయ్యారు. అయితే ఆయన అయ్యప్ప మాలలో ఉన్నాడు. అయ్యప్ప మాలలో ఉన్న ఫోటోలు నెట్టింట వైరల్ అవుతు న్నాయి. నలుపు రంగు షర్ట్..పంచె ..టవల్ ధరించి కనిపిస్తున్నాడు. ఫోటో సెషన్ లో భాగంగా ఫోజులిచ్చాడు.
ఒక ఫోటోలో అయ్యప్ప మాలలో ఉన్ననానితో పాటు మృణాల్ ఠాకూర్ కూడా ఓ ఫోటో షేర్ చేసుకుంది. అయితే ఈవెంట్ లో నాని సంథింగ్ స్పెషల్ గా హైలట్ అయ్యాడు. అందుకు అయ్యప్ప మాల కారణం అనొచ్చు. అందరూ రకరకాల దుస్తులు...ఖరీదైన బట్టలు వేసుకుని వచ్చారు. వాటి విలువ లక్షల్లో ఉంటుంది. ఎంపిక చేసుకున్న యాక్సరసీస్ ప్రతీది వేలు..లక్షలతో ముడిపడినవే.
కానీ నాని మాత్రం స్వామీజీ అవతారంలో స్పెషల్ గా కనిపిస్తున్నాడు. అబుదాబీ అందాల్లో నాని స్వామి మాల కొందర్ని ఆశ్చర్య పరిచి ఉండొచ్చు. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.