Begin typing your search above and press return to search.

పారడైస్ ఎప్పుడు నాని..?

అప్పటివరకు నాని కేవలం క్లాస్ హీరో అనుకున్న వారికి దసరా సినిమాతో తనలోని మాస్ యాంగిల్ ని కూడా చూపించి షాక్ ఇచ్చాడు నాని.

By:  Tupaki Desk   |   24 Jan 2025 11:30 PM GMT
పారడైస్ ఎప్పుడు నాని..?
X

న్యాచురల్ స్టార్ నాని ప్రస్తుతం హిట్ 3 షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా తర్వాత శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో సినిమా లైన్ లో పెట్టాడు. దసరా తర్వాత రెండో సినిమా కూడా శ్రీకాంత్ కి ఛాన్స్ ఇచ్చాడు నాని. అప్పటివరకు నాని కేవలం క్లాస్ హీరో అనుకున్న వారికి దసరా సినిమాతో తనలోని మాస్ యాంగిల్ ని కూడా చూపించి షాక్ ఇచ్చాడు నాని. తొలి సినిమా అయినా సరే శ్రీకాంత్ ఓదెల డైరెక్షన్ నెక్స్ట్ లెవెల్ అనిపించేశాడు.

ఇక నానితో రెండో ప్రయత్నంగా మరో అద్భుతమైన కథతో వస్తున్నట్టు తెలుస్తుంది. ఈ సినిమాకు పారడైస్ అనే టైటిల్ కూడా ఫిక్స్ చేశారు. సినిమా టైటిల్ అఫీషియల్ రిలీజ్ చేయకముందే లీక్ అయ్యింది. శ్రీకాంత్ ఓదెల నాని మరోసారి తమ మార్క్ సినిమాతో రాబోతున్నారు. పారడైస్ విషయంలో నాని కూడా నో కాంప్రమైజ్ అనేస్తున్నాడట.

శ్రీకాంత్ ఓదెల కు ఈ సినిమా కోసం మరింత ఫ్రీడం ఇస్తున్నాడట నాని. ఐతే స్క్రిప్ట్ దశ నుంచి పారడైస్ ని అద్భుతంగా ఉండేలా ప్లాన్ చేస్తున్నారట. ప్రస్తుతం సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటుంది. సినిమా అఫీషియల్ గా అనౌన్స్ చేసినా రెగ్యులర్ షూట్ ఎప్పుడన్నది ఇంకా వెల్లడించలేదు. ఐతే నాని హిట్ 3 పూర్తి కాగానే పారడైస్ కోసం బల్క్ డేట్స్ ఇచ్చేలా షెడ్యూల్ ప్లాన్ చేసుకుంటున్నాడు.

నాని శ్రీకాంత్ మరోసారి ఇద్దరు కలిసి మ్యాజిక్ రిపీట్ చేయనున్నారు. ఈ ఇయర్ సెకండ్ హాఫ్ లో సినిమా సెట్స్ మీదకు వెళ్లేలా చూస్తున్నారు. ప్రస్తుతం నాని చేస్తున్న హిట్ 3 పూర్తవ్వడం ఆలస్యం పారడైస్ పనుల్లో ఉంటాడని తెలుస్తుంది. నాని ఈసారి పెద్ద టార్గెట్ నే పెట్టుకున్నట్టు తెలుస్తుంది. శ్రీకాంత్ ఈ సినిమాతో కూడా అనుకున్న విధంగా అదరగొడితే మాత్రం స్టార్ డైరెక్టర్స్ లిస్ట్ లో చేరినట్టే లెక్క.

నాని సినిమాల ప్లానింగ్ ఫ్యాన్స్ కి సూపర్ కిక్ ఇస్తుంది. ప్రతి సినిమా దాని కథ కథనాలే కాదు రిలీజ్ ప్లేస్ మెంట్ లు కూడా పర్ఫెక్ట్ ప్లానింగ్ తో చేస్తున్నాడు. అందుకే నాని ఇప్పుడు సక్సెస్ ఫుల్ కెరీర్ కొనసాగిస్తున్నాడు. హిట్ 3 క్రైం థ్రిల్లర్ కాగా శ్రీకాంత్ తో చేస్తున్న పారడైస్ సినిమా మాత్రం మరో బిగ్ ప్రాజెక్ట్ కాబోతుందని తెలుస్తుంది.