తండేల్ సక్సెస్.. నాని క్రేజీ ట్వీట్..!
తండేల్ సినిమా సూపర్ హిట్ టాక్ తెచ్చుకుందని తెలుసుకున్న నాని ఆ చిత్ర యూనిట్ ని గ్రీట్ చేస్తూ మెసేజ్ పెట్టాడు.
By: Tupaki Desk | 9 Feb 2025 3:16 PM GMTఒక సినిమా సక్సెస్ అయితే సోషల్ మీడియాలో తన మెసేజ్ తో చిత్ర యూనిట్ ని విష్ చేస్తుంటాడు న్యాచురల్ స్టార్ నాని. లేటెస్ట్ గా నాగ చైతన్య హీరోగా తెరకెక్కిన తండేల్ సినిమా గురించి కూడా నాని ట్వీట్ చేశాడు. హ్యూజ్ సక్సెస్ అందుకున్న తండేల్ టీం కు కంగ్రాట్స్. నా షూటింగ్ పూర్తి చేసుకుని సినిమా చూడాలని అనుకుంటున్నా.. సినిమా గురించి మంచి విషయాలను వింటున్నా.. నాగ చైతన్య, చిన్ని గారు సాయి పల్లవి కోసం సంతోషంగా ఉంది. వాసు, అల్లు అరవింద్, చందు మొండేటి సినిమా టీం అందరికీ చీర్స్ అంటూ మెసేజ్ పెట్టాడు నాని.
నాని పెట్టిన మెసేజ్ కి అక్కినేని ఫ్యాన్స్ నుంచి ప్రశంసలు దక్కుతున్నాయి. ఒక సినిమా నిజమైన సక్సెస్ అంటే ఆడియన్స్ నుంచి సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంటే వారితో సమానంగా సినిమా గురించి మాట్లాడి ఆ సక్సెస్ జోష్ ని మరింత పెంచుతాడు నాని. తండేల్ సినిమా సూపర్ హిట్ టాక్ తెచ్చుకుందని తెలుసుకున్న నాని ఆ చిత్ర యూనిట్ ని గ్రీట్ చేస్తూ మెసేజ్ పెట్టాడు. మంచి సినిమాకు తన సపోర్ట్ ఇంకా తన ప్రమోషన్ ఎప్పుడూ ఉంటుందని నాని మరోసారి ప్రూవ్ చేశాడు.
నాగ చైతన్య, చందు మొండేటి కాంబోలో వచ్చిన తండేల్ సినిమా సెట్స్ మీద ఉన్నప్పటి నుంచి మంచి హైప్ తీసుకొచ్చింది. నిజ జీవిత సంఘటనల ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాలో నాగ చైతన్య, సాయి పల్లవిల జోడీ మెయిన్ హైలెట్ అయ్యింది. అంతేకాదు సినిమాకు దేవి ఇచ్చిన మ్యూజిక్ ఐతే నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు. తెర మీద చైతు, సాయి పల్లవి ఎలా కష్టపడ్డారో సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ తో అంత కాంట్రిబ్యూషన్ ఇచ్చాడు.
గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ లో బన్నీ వాసు ఈ సినిమా నిర్మించగా అల్లు అరవింద్ పర్యవేక్షణ చేశారు. తండేల్ సక్సెస్ తో అక్కినేని ఫ్యాన్స్ లో ఉత్సాహం రెట్టింపు అయ్యింది. శుక్రవారం రిలీజైన తండేల్ సినిమా గురించి ట్విట్టర్ లో సూపర్ ట్రెండ్ నడుస్తుంది. సో నాగ చైతన్య కెరీర్ లోనే బెస్ట్ నెంబర్స్ ని కలెక్షన్స్ గా చూడబోతున్నామని తెలుస్తుంది.