కోర్ట్.. ప్లాన్ కు తగ్గట్లే వెళుతున్న నాని!
సాధారణంగా సినిమా విడుదలకు ఒక రోజు ముందు ప్రీమియర్ షోలు ఉంటాయి. కానీ ఇప్పుడు రిలీజ్‌కు రెండు రోజుల ముందే వీటిని ప్లాన్ చేయడం కొత్తగా మారింది.
By: Tupaki Desk | 12 March 2025 4:04 PM ISTతెలుగు సినిమా పరిశ్రమలో ప్రమోషన్ అనేది ఇప్పుడు అనేక రకాల మార్పులకు గురవుతోంది. పాత తరహా ప్రమోషన్ మెథడ్స్‌ను కాస్త పక్కనపెట్టి, కొత్త తరహా స్ట్రాటజీలను టెస్ట్ చేయడం చూస్తూనే ఉన్నాం. కానీ నేచురల్ స్టార్ నాని ఇప్పుడు తీసుకుంటున్న స్టెప్ మాత్రం మరింత రిస్క్‌తో కూడుకున్నదే. ‘కోర్ట్’ సినిమా కోసం అన్‌ప్రెసిడెంటెడ్‌గా అడ్వాన్స్ ప్రీమియర్ షోలు ప్లాన్ చేయడం ఇండస్ట్రీని ఆశ్చర్యపరిచేలా చేసింది.
సాధారణంగా సినిమా విడుదలకు ఒక రోజు ముందు ప్రీమియర్ షోలు ఉంటాయి. కానీ ఇప్పుడు రిలీజ్‌కు రెండు రోజుల ముందే వీటిని ప్లాన్ చేయడం కొత్తగా మారింది. ఇందుకు ప్రధాన కారణం నాని సినిమాపై పెట్టుకున్న నమ్మకం. ‘కోర్ట్’ చిత్రాన్ని ఆయన స్వయంగా సమర్పిస్తున్నాడు. దీప్తి గంటా, ప్రశాంతి త్రిపినేని నిర్మాణంలో రామ్ జగదీష్ దర్శకత్వం వహించిన ఈ సినిమా, కంటెంట్ పరంగా చాలా కొత్తగా ఉంటుందని ఇప్పటికే టీజర్, ట్రైలర్ ద్వారా అర్థమైంది.
కానీ ఇప్పుడు నాని తీసుకున్న ఈ డెసిషన్ మరింత ఇంట్రెస్టింగ్‌గా మారింది. ఆయన ప్రేక్షకులకు ఓపెన్ ఛాలెంజ్ విసిరినట్లే ఉంది. ‘ఈ సినిమా థియేటర్లో చూసిన మీకు నచ్చకపోతే, నా హిట్ 3 చూడకండి.. అంటూ చెప్పడం అంత తేలికైన విషయం కాదు. ఇలాంటి ప్రయోగాలు చాలా అరుదుగా జరుగుతాయి. సినిమా ఫలితం ఎలా ఉన్నా, ఓ నిర్మాత లేదా సమర్పకుడు ఇంతగా ముందుకు వచ్చి, సినిమా మీద అంతటి నమ్మకాన్ని వ్యక్తపరచడం విశేషం.
ఇది కేవలం మాటల్లో మాత్రమే కాదు, ఈ సినిమా కోసం తెలుగు రాష్ట్రాల్లో అడ్వాన్స్ ప్రీమియర్ షోలు ప్లాన్ చేయడం నిజంగా రిస్క్‌తో కూడుకున్న విషయం. ఒకవేళ సినిమాకు మంచి టాక్ వస్తే, ఇది బిగ్ బూస్ట్ అవుతుంది. కానీ నెగటివ్ టాక్ వస్తే, రిలీజ్‌కి ముందే డ్యామేజ్ అయ్యే ప్రమాదం ఉంది. ఇప్పటికే హైదరాబాదులో మొదటి ప్రీమియర్ షోల కోసం బుకింగ్స్ మొదలయ్యాయి. ప్రేక్షకుల స్పందన అద్భుతంగా ఉందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. సినిమా మార్చి 14న రిలీక్ అవుతుండగా రెండు రోజుల ముందే సౌండ్ స్టార్ట్ చేయడం విశేషం.
ఏపీ, తెలంగాణలోని మరిన్ని ప్రధాన నగరాల్లో ప్రీమియర్ షోలు ప్లాన్ చేయడం, ప్రేక్షకుల అభిప్రాయాన్ని ముందే పరీక్షించుకోవడానికి ఇది ఒక మంచి మార్గంగా కూడా కనిపిస్తోంది. చిన్న సినిమాలకు బడా బడ్జెట్ ప్రమోషన్ లభించదు. కానీ ఈ తరహా టెక్నిక్స్‌ను ఉపయోగించి ప్రేక్షకులను థియేటర్లకు రప్పించగలమని నాని నిరూపించేందుకు ప్రయత్నిస్తున్నట్లు స్పష్టంగా తెలుస్తోంది.
ఈ ప్రయోగం విజయవంతమైతే, భవిష్యత్తులో మరిన్ని సినిమాలకు ఇదే మార్గాన్ని అనుసరించవచ్చు. కంటెంట్ మీద నమ్మకముంటే, ముందుగానే ప్రేక్షకులకు ప్రదర్శించి టాక్ బిల్డ్ చేయడం వల్ల మంచి వసూళ్లు వస్తాయనే కాన్ఫిడెన్స్ ఇండస్ట్రీలో పెరుగుతుంది. సినిమా ఎంత బాగా ఉండాలి అనే టెన్షన్ ఉండదనే కాదు, ప్రేక్షకులను ముందుగానే ఆకర్షించడానికి కొత్త తరహా ప్రయత్నాలకూ ఇది తలుపులు తెరుస్తుంది. మొత్తానికి, నాని చేసిన ఈ ప్రయోగం ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూడాలి.