Begin typing your search above and press return to search.

లెక్క సరిచేసేందుకు రిస్క్ చేస్తున్న నాని..!

ప్రస్తుతం టాలీవుడ్ లో తన రేంజ్ కి తగిన హిట్లు కొడుతూ వరుస సక్సెస్ లతో టాలీవుడ్ కు తన కాంట్రిబ్యూషన్ ఇస్తూ సత్తా చాటుతున్నాడు న్యాచురల్ స్టార్ నాని.

By:  Tupaki Desk   |   15 Oct 2024 7:35 AM GMT
లెక్క సరిచేసేందుకు రిస్క్ చేస్తున్న నాని..!
X

ప్రస్తుతం టాలీవుడ్ లో తన రేంజ్ కి తగిన హిట్లు కొడుతూ వరుస సక్సెస్ లతో టాలీవుడ్ కు తన కాంట్రిబ్యూషన్ ఇస్తూ సత్తా చాటుతున్నాడు న్యాచురల్ స్టార్ నాని. లాస్ట్ ఇయర్ దసరా, హాయ్ నాన్న రెండు సినిమాలతో హిట్లు కొట్టిన నాని ఈ ఇయర్ సరిపోదా శనివారం సినిమాతో మరో సూపర్ హిట్ అందుకున్నాడు. నాని వివేక్ ఆత్రేయ ఇదివరకు అంటే సుందరానికీ సినిమా చేయగా ఆ సినిమా తో మిస్సైన సక్సెస్ మజాని ఈ సినిమాతో రుచి చూశారు. ఐతే సరిపోదా శనివారం ఇలా పూర్తైందో లేదో అలా హిట్ 3 సినిమాను సెట్స్ మీదకు తీసుకెళ్లాడు నాని.

హిట్ 3 ని నెక్స్ట్ సమ్మర్ కి ఎలాగైనా రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు. ఐతే హిట్ 3 తో పాటుగా శ్రీకాంత్ ఓదెల డైరెక్షన్ లో సినిమాను కూడా 2025 ఎండింగ్ కల్లా రిలీజ్ ప్లానింగ్ లో ఉన్నట్టు తెలుస్తుంది. ఈమధ్యనే నాని శ్రీకాంత్ రెండో కాంబో సినిమా పూజా కార్యక్రమాలు జరిగాయి. ఈ సినిమా కూడా సంథింగ్ స్పెషల్ గా దసరాని మించి ఉండేలా ప్లాన్ చేస్తున్నారని తెలుస్తుంది.

ఐతే లాస్ట్ ఇయర్ రెండు సినిమాలు వదిలిన నాని ఆ రెండిటితో సక్సెస్ అందుకున్నాడు. ఈ ఇయర్ కేవలం సరిపోదా శనివారం ఒక్కటే రిలీజ్ చేశాడు. కానీ నెక్స్ట్ ఇయర్ మాత్రం రెండు సినిమాలు రిలీజ్ చేయాలని చూస్తున్నాడు. నాని నుంచి నెక్స్ట్ ఇయర్ హిట్ 3, దసరా కాంబో 2 రాబోతున్నాయి. ఈ రెండు సినిమాలతో కూడా మళ్లీ తన హిట్ టార్గెట్ ని ఫిక్స్ చేసుకున్నాడు నాని.

సినిమాను అనుకున్న టైం కు పూర్తి చేయాలంటే అందుకు తగిన విధంగా పర్ఫెక్ట్ ప్లాన్ ఉండాలి. ఏమాత్రం తేడా వచ్చినా ఆ ఎఫెక్ట్ సినిమా రిజల్ట్ మీద పడుతుంది. కానీ నాని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో రెండు సినిమాలు వచ్చేలా చూడాలని అనుకుంటున్నాడు. హిట్ 3 కి ఎలాగు ఎక్కువ టైం పట్టే ఛాన్స్ లేదు కానీ నాని దసరా 2 సినిమాకు మాత్రం అనుకున్న దాని కన్నా ఎక్కువ టైం పట్టే ఛాన్స్ ఉంది. మరి నాని ఈ రిస్క్ ని ఎలా హ్యాండిల్ చేస్తాడన్నది చూడాలి.