Begin typing your search above and press return to search.

హిట్-3 మిడ్ నుంచే మొద‌ల‌వుతుందా?

ఇటీవ‌లే నేచుర‌ల్ స్టార్ నాని `స‌రిపోదా శనివారం`తో మ‌రో హిట్ ని ఖాతాలో వేసుకున్న సంగ‌తి తెలిసిందే.

By:  Tupaki Desk   |   3 Sep 2024 8:08 AM GMT
హిట్-3 మిడ్ నుంచే మొద‌ల‌వుతుందా?
X

ఇటీవ‌లే నేచుర‌ల్ స్టార్ నాని `స‌రిపోదా శనివారం`తో మ‌రో హిట్ ని ఖాతాలో వేసుకున్న సంగ‌తి తెలిసిందే. అంతకు ముందు అదే ద‌ర్శ‌కుడు వివేక్ ఆత్రేయ `అంటే సుంద‌రానికీ `అనే సినిమాతో ప్లాప్ ఇచ్చినా? తాజా విజ‌యంతో దాన్ని బ్యాలెన్స్ చేసాడు. ఇక్క‌డ ప్లాప్ డైరెక్ట‌ర్ కి నాని ఛాన్స్ ఇచ్చి స‌క్సెస్ కొట్ట‌డం అన్న‌ది హైలైట్ అయిన అంశం. ఇది కేవ‌లం నాని మాత్ర‌మే సాధ్య‌మ‌ని ప్రూవ్ చేసాడు.

ఇదే ఉత్సాహంలో `హిట్-3`ని ప‌ట్టాలెక్కించ‌డానికి రెడీ అవుతున్నారు. చాలా కాలంగా పెండింగ్ ప‌డి పోతున్న చిత్రాన్ని ఎట్ట‌కేల‌కు ఈనెల మిడ్ నుంచే మొద‌లు పెట్టాల‌ని ప్లాన్ చేస్తున్నారుట‌. మొద‌టి షెడ్యూల్ హైద‌రాబాద్ లో ప్రారంభించడానికి స‌న్నాహాలు చేస్తున్న‌ట్లు తెలిసింది. ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నుల కూడా ముగింపు కు రావ‌డంతో ఆల‌స్యం చేయ‌కుండా ప‌ట్టాలెక్కించాల‌ని ద‌ర్శ‌కుడు శైలేష్ కొల‌ను కూడా రెడీ గా ఉన్నారుట‌.

శైలేష్ కొల‌ను గ‌త సినిమా `సైంధ‌వ్` ప్లాప్ అయిన సంగ‌తి తెలిసిందే. దీంతో మ‌రో ఆలోచ‌న లేకుండా `హిట్-3`పైనే దృష్టి పెట్టి ప‌నిచేస్తున్నాడు. క్రైమ్ థ్రిల్ల‌ర్ చిత్రాల ద‌ర్శ‌కుడిగా శైలేష్ కి మంచి పేరున్న సంగ‌తి తెలిసిందే. హిట్ ప్రాంచైజీ అత‌డితోనే వెలుగులోకి వ‌చ్చింది. రెండు భాగాలు మంచి విజ‌యం సాధించ‌డం..వాటిని నాని నిర్మించ‌డంతో? మూడ‌వ భాగంలో తానే హీరో అయిపోయాడు.

`హిట్ -3`తో పాటే నాని, శ్రీకాంత్ ఓదేల చిత్రాన్ని కూడా స‌మాంత‌రంగా ప్రారంభించాల‌నుకుంటున్నారుట‌. `ద‌స‌రా` త‌ర్వాత శ్రీకాంత్ మ‌ళ్లీ నానితోనే రెండ‌వ సినిమా చేస్తున్నాడు. హీరోలంతా బిజీగా ఉండ‌టంతో శ్రీకాంత్ కి మ‌రోసారి నానినే ఛాన్స్ ఇచ్చాడు.