హిట్ థర్డ్ కేస్ నుంచి వైల్డెస్ట్ పోస్టర్..!
హిట్ ఫస్ట్ కేస్ విశ్వక్ సేన్, సెకండ్ కేస్ అడివి శేష్ నటించగా హిట్ థర్డ్ కేస్ కోసం నాని రంగంలోకి దిగాడు.
By: Tupaki Desk | 20 Feb 2025 1:03 PM GMTన్యాచురల్ స్టార్ నాని సరిపోదా శనివారం తర్వాత చేస్తున్న సినిమా హిట్ ది థర్డ్ కేస్. హిట్ ఫ్రాంచైజీలో భాగంగా శైలేష్ కొలను డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో నాని పోలీస్ ఆఫీసర్ గా నటిస్తున్నాడు. క్రైం థ్రిల్లర్ జోనర్ లకు హిట్ అనే టైటిల్ తో నాని, ప్రశాంతి నిర్మాతలుగా మారి చేస్తున్న సినిమాలు ఆడియన్స్ లో మంచి క్యూరియాసిటీ ఏర్పడేలా చేశాయి. హిట్ ఫస్ట్ కేస్ విశ్వక్ సేన్, సెకండ్ కేస్ అడివి శేష్ నటించగా హిట్ థర్డ్ కేస్ కోసం నాని రంగంలోకి దిగాడు.

హిట్ 2లోనే నాని కేమియో రోల్ చేసి ముందే హింట్ ఇచ్చాడు. హిట్ 3 ని శైలేష్ కొలను నెక్స్ట్ లెవెల్ లో తెరకెక్కిస్తున్నట్టు తెలుస్తుంది. ఇక లేటెస్ట్ గా ఈ సినిమా నుంచి టీజర్ అప్డేట్ వచ్చింది. హిట్ థర్డ్ కేస్ టీజర్ ని ఈ నెల 24న రిలీజ్ చేస్తున్నారు. టీజర్ డేట్ అనౌన్స్ చేస్తూ మేకర్స్ ఒక పోస్టర్ రిలీజ్ చేశారు. ఆ పోస్టర్ లో గొడ్డలితో నాని విధ్వంసం సృష్టించినట్టు ఉన్నాడు. రక్తపాతం గా మారిన ఆ ఫీల్డ్ అంతా నెక్స్ట్ లెవెల్ లో ఉంది.
నాని హిట్ 3 ఇన్నాళ్లు చాలా సైలెంట్ గా ఉన్నారు. సినిమా ఓ పక్క షూటింగ్ జరుపుకుంటున్నా అప్డేట్స్ ఏమి బయటకు రాలేదు. ఐతే లేటెస్ట్ గా వచ్చిన పోస్టర్ చూస్తే మాత్రం అదుర్స్ అనిపించింది. ఈ సినిమాలో నాని సరసన శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటిస్తుంది. నాని తో పాటు ఈ సినిమాలో అర్జున్ సర్కార్ కూడా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నట్టు తెలుస్తుంది. ఈ సినిమాను మే 1న రిలీజ్ లాక్ చేశారు మేకర్స్.
దసరా ముందు వరకు నాని కేవలం క్లాస్ సినిమాలే చేస్తాడని అనుకున్నారు కానీ ఎప్పుడైతే దసరా వచ్చి సూపర్ హిట్ అయ్యిందో అప్పుడు నాని మాస్ స్టామినా ఏంటన్నది అర్థమైంది. దసరా తర్వాత నాని మరోసారి శ్రీకాంత్ ఓదెలతో ప్యారడైజ్ చేస్తున్నాడు. ఆ సినిమా కూడా ఊర మాస్ కథతో వస్తుందని టాక్. ప్రస్తుతం నాని హిట్ 3 మోడ్ లో ఉన్నాడు. త్వరగా ఈ సినిమా పూర్తి చేసి రిలీజ్ తర్వాత ప్యారడైజ్ పనుల్లో బిజీ అవనున్నాడు.