Begin typing your search above and press return to search.

వైజాగ్ సెంట్ర‌ల్ జైల్లో హిట్-3!

జైలు అధికారుల అనుమ‌తి తీసుకుని షూటింగ్ నిర్వ‌హించిన‌ట్లు తెలుస్తోంది.

By:  Tupaki Desk   |   30 Sep 2024 1:30 PM GMT
వైజాగ్ సెంట్ర‌ల్ జైల్లో హిట్-3!
X

నేచుర‌ల్ స్టార్ నాని `హిట్ 3`ని సైలెంట్ గా ప‌ట్టాలెక్కించేసాడా? ఎలాంటి స‌మాచారం ఇవ్వ‌కుండా సెట్స్ కు వెళ్లిపోయాడా? అంటే అవుననే తెలుస్తోంది. ప్ర‌స్తుతం ఈ సినిమా షూటింగ్ విశాఖ‌ప‌ట్ట‌ణంలో అడ‌వి వరంలో ఉన్న‌ సెంట్ర‌ల్ జైల్లో షూటింగ్ జ‌రుగుతోంది. ఆదివారం షూటింగ్ అంతా జైల్లోనే జ‌రిగింది. కొన్నీ కీల‌క స‌న్నివేశాల‌ను ఖైదీల మ‌ధ్య చిత్రీక‌రించిన‌ట్లు తెలుస్తోంది. ఇందులో నాని స‌హా కీల‌క న‌టులంతా పాల్గొన్నారు.

జైలు అధికారుల అనుమ‌తి తీసుకుని షూటింగ్ నిర్వ‌హించిన‌ట్లు తెలుస్తోంది. అలాగే జైలు ప‌రిస‌రాల్లో కూడా మ‌రికొన్ని స‌న్నివేశాలు చిత్రీక‌రించారు. కొన్ని రోజుల పాటు నిర‌వ‌ధికంగా ఇక్క‌డే షూటింగ్ జ‌రుగుతుంద‌ని స‌మాచారం. అనంత‌రం మ‌ళ్లీ హైద‌రాబాద్ కి షిప్ట్ అవుతార‌ని తెలుస్తోంది. మొత్తానికి హిట్ 3కి సంబంధించి ఎలాంటి స‌మాచారం లేకుండానే ద‌ర్శ‌కుడు శైలేష్ కొల‌ను ప‌ట్టాలెక్కించాడు.

అత‌డి గ‌త సినిమా `సైంధ‌వ్` ప్లాప్ అయిన సంగ‌తి తెలిసిందే. భారీ అంచ‌నాల మ‌ధ్య వ‌చ్చిన మెడిక‌ల్ క్రైమ్ థ్రిలర్ వాటిని అందుకోవ‌డంలో విఫ‌ల‌మైంది. దీంతో హిట్ 3 తో హిట్ కొట్టాల‌ని క‌సి మీద ఉన్నాడు. హిట్ సినిమాతో క్రైమ్ థ్రిల్ల‌ర్ చిత్రాల మేకింగ్ లో శేలేష్ కొల‌ను తానో బ్రాండ్ అని ప్రూవ్ చేసిన సంగ‌తి తెలిసిందే. హిట్ నుంచి రిలీజ్ అయిన రెండు భాగాలు మంచి విజ‌యం సాధించాయి.

ఇవి చూసే విక్ట‌రీ వెంక‌టేష్ `సైంధ‌వ్` కి అవ‌కాశం ఇచ్చారు. కానీ స‌రైన ఫ‌లితాలు రాలేదు. అటు నాని మాత్రం పుల్ స్వింగ్ లో ఉన్నాడు. బ్యాక్ టూ బ్యాక్ స‌క్సెస్ లు అందుకుంటున్నాడు. ఇటీవ‌లే `స‌రిపోదా శ‌నివారం`తో మ‌రో విజ‌యం ఖాతాలో వేసుకున్న సంగ‌తి తెలిసిందే.