Begin typing your search above and press return to search.

నాని సక్సెస్ సీక్రెట్ అదేనా?

అసిస్టెంట్ డైరెక్టర్ గా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి.. ఇప్పుడు స్టార్ హీరోగా నాని సత్తా చాటుతున్న విషయం తెలిసిందే.

By:  Tupaki Desk   |   16 Sep 2024 4:30 PM GMT
నాని సక్సెస్ సీక్రెట్ అదేనా?
X

అసిస్టెంట్ డైరెక్టర్ గా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి.. ఇప్పుడు స్టార్ హీరోగా నాని సత్తా చాటుతున్న విషయం తెలిసిందే. అష్టా చమ్మా మూవీతో హీరోగా మారిన ఆయన.. పక్కింటి కుర్రాడిలా తన యాక్టింగ్ తో నేచురల్ స్టార్ ట్యాగ్ అందుకున్నారు. సూపర్ హిట్ సినిమాలు చేస్తూ మూవీ లవర్స్ ను అలరిస్తున్నారు. క్రేజీ ప్రాజెక్టులు లైన్ లో పెడుతూ అదరగొడుతున్నారు. టాలీవుడ్ లో అడుగుపెట్టి 16 ఏళ్లు పూర్తి చేసుకున్న నాని.. రీసెంట్ గా సరిపోదా శనివారం మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు.

గత ఏడాది దసరా, హాయ్ నాన్న సినిమాలతో మంచి హిట్లు అందుకున్న నాని.. ఇప్పుడు సరిపోదా శనివారంతో హ్యాట్రిక్ కొట్టేశారు. వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహించిన ఆ సినిమాలో సూర్యగా తన యాక్టింగ్ తో వేరే లెవెల్ లో మెప్పించారు. తాజాగా సరిపోదా శనివారం మూవీతో మరోసారి రూ.100 కోట్ల క్లబ్ లోకి చేరారు. దీంతో నాని అండ్ టీమ్ కు పలువురు సెలబ్రిటీలతో పాటు అభిమానులు శుభాకాంక్షలు చెబుతున్నారు.

గత ఏడాది శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహించిన దసరా మూవీ రూ.100 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. ఇప్పుడు సరిపోదా శనివారం కూడా అంతే రీతిలో కలెక్షన్లు సాధిస్తోంది. దీంతో అతి తక్కువ గ్యాప్ లో రెండు సార్లు రూ.100 కోట్ల మైలురాయిని అందుకున్నారు నాని. టైర్-1 హీరోలు కాకుండా.. తక్కువ గ్యాప్ లో 2 సార్లు ఆ మార్క్ అందుకున్న తొలి హీరోగా నిలిచారు. దీంతో నాని కోసమే అంతా మాట్లాడుకుంటున్నారు. నాని సక్సెస్ సీక్రెట్ గురించి డిస్కస్ చేసుకుంటున్నారు.

అయితే కొంతకాలంగా నాని.. కథల విషయంలో ఆచి తూచి వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. గతంలో ఫ్లాపులు ఇచ్చినా.. డెబ్యూ డైరెక్టర్ అయినా.. వాటిని అస్సలు పట్టించుకోవడం లేదు. స్టోరీ డెప్త్ ను పక్కా అండ్ క్లియర్ గా పరిశీలిస్తున్నారు. అందుకు ఉదాహరణ సరిపోదా శనివారం మూవీనే. ఇప్పటికే వివేక్ ఆత్రేయతో చేసిన అంటే సుందరానికి ఫ్లాప్ అయినా ఆయనకు మళ్లీ ఛాన్స్ ఇచ్చారు. మంచి హిట్ అందుకున్నారు.

ఇక శైలేష్ కొలను చివరి మూవీ సైంధవ్ ఫ్లాప్ అయినా.. ఇప్పుడు హిట్ -3కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. హాయ్ నాన్న శౌర్యువ్, దసరా శ్రీకాంత్ కొత్త వాళ్లైనా.. కథ నచ్చి వాళ్లను నమ్మారు. అలా తన ప్రాజెక్టుల విషయంలో ఒకటికి రెండు సార్లు ఆలోచించే నిర్ణయం తీసుకుంటున్నారు. నాని వి, టక్ జగదీష్ వంటి సినిమాలతో నేర్చుకున్న లెసన్స్ ను ఫాలో అవుతున్నారు. అదే సమయంలో ఓవర్సీస్ లో తన ఫ్యాన్ బేస్ తో పాటు మార్కెట్ ను బాగా పెంచుకుంటున్నారు. మొత్తానికి కెరీర్ లో ఓ రేంజ్ లో దూసుకుపోతున్న నాని.. ఫ్యూచర్ లో ఎలాంటి సంచలనాలు సృష్టిస్తారో వేచి చూడాలి.