Begin typing your search above and press return to search.

మహేష్ బాబు 12 - నాని 10.. వ్వాటే క్రేజ్

నేచురల్ స్టార్ నాని హీరోగా తెరకెక్కిన సరిపోదా శనివారం సినిమా పాజిటివ్ టాక్ సొంతం చేసుకొని భారీ కలెక్షన్స్ తో దూసుకుపోతోంది.

By:  Tupaki Desk   |   31 Aug 2024 3:54 AM GMT
మహేష్ బాబు 12 - నాని 10.. వ్వాటే క్రేజ్
X

నేచురల్ స్టార్ నాని హీరోగా తెరకెక్కిన సరిపోదా శనివారం సినిమా పాజిటివ్ టాక్ సొంతం చేసుకొని భారీ కలెక్షన్స్ తో దూసుకుపోతోంది. మొదటి రోజు హిట్ టాక్ రావడంతో నెక్స్ట్ బుకింగ్స్ విపరీతంగా పెరిగినట్లు తెలుస్తోంది. కచ్చితంగా నాని కెరియర్ లోనే హైయెస్ట్ గ్రాస్ కలెక్షన్స్ అందుకునే చిత్రంగా సరిపోదా శనివారం మారుతుందని అంచనా వేస్తున్నారు. ఇదిలా ఉంటే సరిపోదా శనివారం సినిమా నార్త్ అమెరికాలో కూడా భారీ కలెక్షన్స్ దిశగా దూసుకుపోతోంది.


ఈ సినిమా రెండో రోజు ఆరంభానికి 1 మిలియన్ డాలర్స్ కలెక్షన్స్ ని నార్త్ అమెరికాలో అందుకుంది. తక్కువ టైంలో 1 మిలియన్ డాలర్స్ కలెక్షన్స్ ని అందుకున్న టైర్ 2 హీరోగా నాచురల్ స్టార్ నాని ఉన్నారు. అంతే కాకుండా నార్త్ అమెరికాలో నానికి అద్భుతమైన ఇమేజ్ ఉంది. టాలీవుడ్ లో అత్యధిక సార్లు నార్త్ అమెరికాలో 1 మిలియన్ డాలర్స్ కలెక్షన్స్ అందుకున్న హీరోల జాబితాలో రెండో స్థానంలో ఉన్నారు. మొదటి స్థానంలో సూపర్ స్టార్ మహేష్ బాబు ఉన్నారు.

మహేష్ 12 సార్లు నార్త్ అమెరికాలో 1 మిలియన్ డాలర్స్ కి పైగా కలెక్షన్స్ అందుకుంటే నాని ఏకంగా 10 సార్లు 1 మిలియన్ డాలర్స్ కి పైగా కలెక్షన్స్ సాధించడం విశేషం. ఏ ఇతర హీరో కూడా ఈ ఫీట్ ని అందుకోలేదు. నాని సరిపోదా శనివారం సినిమా కంటే ముందుగా వచ్చిన హాయ్ నాన్న(1.89M), దసరా(2.76M), అంటే సుందరానికి(1M) సినిమాలు వర్సెస్ నార్త్ అమెరికాలో 1 మిలియన్ డాలర్స్ కి పైగా కలెక్షన్స్ ని అందుకున్నాయి.

అంటే నాని వరుసగా నాలుగు సినిమాలతో ఓవర్సీస్ లో తనకి తిరుగులేదని ప్రూవ్ చేసుకున్నారు. టైర్ 2 హీరోలలో ఇంకెవరు కూడా నాని దరిదాపుల్లో లేరని చెప్పొచ్చు. ఇక సరిపోదా శనివారం సినిమా నాని కెరియర్ లోనే హైయెస్ట్ ఓవర్సీస్ కలెక్షన్స్ ని అందుకునే ఛాన్స్ ఉందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. ఈ మూవీ వరల్డ్ వైడ్ గా మొదటి రోజు 19.40 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ని సాధించింది.

దసరా ఫస్ట్ డే కలెక్షన్స్ రికార్డ్ ని సరిపోదా శనివారం మూవీ అందుకోలేకపోయిన భారీ వసూళ్లు మాత్రం సాధించింది. శని, ఆదివారాలు కలెక్షన్స్ పరంగా స్ట్రాంగ్ హోల్డ్ ఉండే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. అదే జరిగితే కచ్చితంగా మొదటి నాలుగు రోజుల్లోనే 50 కోట్ల వరకు కలెక్షన్స్ ని ఈ చిత్రం అందుకునే ఛాన్స్ ఉంటుందని అంచనా వేస్తున్నారు.