Begin typing your search above and press return to search.

హిట్ 3: అసలు పని మొదలెట్టాడు

శైలేష్ కొలను దర్శకత్వంలో హిట్ ఫ్రాంచైజ్ లో పార్ట్ 3 మూవీ షూటింగ్ మొదలుపెట్టారు.

By:  Tupaki Desk   |   13 Sep 2024 12:13 PM GMT
హిట్ 3: అసలు పని మొదలెట్టాడు
X

నేచురల్ స్టార్ నాని దసరా, హాయ్ నాన్న, సరిపోదా శనివారం సినిమాలతో హ్యాట్రిక్ సక్సెస్ లు అందుకొని మంచి జోరు మీద ఉన్నాడు. ఈ సినిమాలు నాని మార్కెట్ రేంజ్ ని అమాంతం పెంచేసాయి. బ్యాక్ టూ బ్యాక్ సక్సెస్ లు అందుకున్న కూడా నాని గ్యాప్ తీసుకోకుండా తన కొత్త సినిమాని స్టార్ట్ చేశాడు. శైలేష్ కొలను దర్శకత్వంలో హిట్ ఫ్రాంచైజ్ లో పార్ట్ 3 మూవీ షూటింగ్ మొదలుపెట్టారు.

రీసెంట్ గా హైదరాబాద్ లో ఈ సినిమా ప్రారంభమైనట్లు మేకర్స్ ప్రకటించారు. షూటింగ్ మొదలైన రెండో రోజు నాని కూడా సెట్ లో జాయిన్ అయ్యారని చిత్ర యూనిట్ కన్ఫర్మ్ చేసింది. భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని వాల్ పాస్టర్ సినిమా, యునానిమస్ ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. మూవీకి 80 కోట్ల వరకు ఖర్చు చేయబోతున్నారని టాక్ వినిపిస్తోంది. అంటే నాని కెరియర్ లోనే హైయెస్ట్ బడ్జెట్ తో హిట్ 3 మూవీ తెరకెక్కుతోంది.

హిట్ ఫ్రాంచైజ్ లో వచ్చిన కేస్ 1 స్టోరీలో విశ్వక్ సేన్ కనిపించాడు. కేస్ 2లో అడివి శేష్ పోలీస్ ఆఫీసర్ గా నటించాడు. హిట్ 2 సినిమా క్లైమాక్స్ లోనే అర్జున్ సర్కార్ క్యారెక్టర్ లో శైలేష్ కొలను నానిని పరిచయం చేశాడు. మోస్ట్ వైలెంట్ పోలీస్ ఆఫీసర్ గా అర్జున్ సర్కార్ క్యారెక్టర్ ఉండబోతోందని అప్పుడే స్పష్టం చేశారు. రీసెంట్ గా హిట్ 3 మూవీ నుంచి గ్లింప్స్ రిలీజ్ చేశారు. అందులో హంటర్స్ కమాండ్ ఆఫ్ హిట్: 3rd కేస్ గా కంటెంట్ ని ప్రెజెంట్ చేశారు.

టెర్రరిస్ట్ లనే గడగడలాడించిన అర్జున్ సర్కార్ ఇన్వెస్టిగేషన్ స్టైల్ ఎలా ఉంటుందో ఈ చిత్రంలో శైలేష్ కొలను చూపించబోతున్నారు. నేచురల్ స్టార్ నాని ఈ చిత్రంలో డిఫరెంట్ మేకోవర్ లో కనిపిస్తున్నాడు. చాలా స్టైలిష్ గా పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా అర్జున్ సర్కార్ క్యారెక్టర్ ఉండబోతోందని అర్ధమవుతోంది. ఈ సినిమాకి మిక్కీ జె మియర్ మ్యూజిక్ అందించబోతున్నారంట.

ఇన్వెస్టిగేషన్ క్రైమ్ థ్రిల్లర్ జోనర్ లోనే ఈ సినిమా ఉండబోతోందని తెలుస్తోంది. నాని కెరియర్ లో మొదటి సారిగా పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నాడు. మరి అతనికి ఈ సినిమా ఎలాంటి సక్సెస్ ఇస్తుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. 2025 మార్చి లేదా ఏప్రిల్ లో హిట్ 3 మూవీ థియేటర్స్ లోకి వచ్చే అవకాశం ఉందంట.