Begin typing your search above and press return to search.

గేమ్ చేంజర్ మీద నాని సినిమా ఎఫెక్ట్..!

ఐతే ఎస్ జే సూర్య నెక్స్ట్ శంకర్ రాం చరణ్ కాంబోలో వస్తున్న గేమ్ చేంజర్ లో కూడా నటిస్తున్నాడు. సరిపోదా శనివారం లో అతనే విలన్ గా నటించాడు.

By:  Tupaki Desk   |   1 Sep 2024 4:15 AM GMT
గేమ్ చేంజర్ మీద నాని సినిమా ఎఫెక్ట్..!
X

న్యాచురల్ స్టార్ నాని వివేక్ ఆత్రేయ కాంబోలో వచ్చిన సరిపోదా శనివారం నాని ఫ్యాన్స్ తో పాటు సినీ లవర్స్ కి సరిపడినంత ఎంటర్టైన్మెంట్ అందిస్తుంది. ఇద్దరు కూడా అంతకుముందు అంటే సుందరానికీ సినిమా చేయగా అది కాస్త కమర్షియల్ గా పెద్దగా వర్క్ అవుట్ కాలేదు. ఐతే ఆ సినిమా తర్వాత మళ్లీ వివేక్ మీద నమ్మకంతో నాని రెండో అవకాశం ఇచ్చాడు. సరిపోదా శనివారం తో నాని మరో సూపర్ హిట్ తన ఖాతాలో వేసుకున్నాడు. సరిపోదా శనివారం సినిమాలో ఎస్ జే సూర్య విలనిజం ఆడియన్స్ ని మెప్పించింది.

కోలీవుడ్ లో వరుస సినిమాలు చేస్తున్న ఎస్ జే సూర్య ఈ సినిమాలో తను చేసిన పాత్ర మాత్రం సంథింగ్ స్పెషల్ అనిపించేలా ఉంది. ఎస్ జే సూర్య కు ఈ సినిమాతో విపరీతమైన ఫాలోయింగ్ ఏర్పడింది. అంతేకాదు నెక్స్ట్ అతను నటించే సినిమాల విషయంలో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఐతే ఎస్ జే సూర్య నెక్స్ట్ శంకర్ రాం చరణ్ కాంబోలో వస్తున్న గేమ్ చేంజర్ లో కూడా నటిస్తున్నాడు. సరిపోదా శనివారం లో అతనే విలన్ గా నటించాడు.

గేమ్ చేంజర్ లో కూడా అతనిది ప్రతి నాయకుడు రోల్ అనే అంటున్నారు. అదే జరిగితే సరిపోదా శనివారం ఎఫెక్ట్ కచ్చితంగా గేమ్ చేంజర్ మీద ఉంటుంది. సూర్య లోని నటుడిని పర్ఫెక్ట్ గా వాడుకున్న వివేక్ ఆత్రేయ అతని కెపాసిటీ ఏంటన్నది చూపించారు. ఐతే శంకర్ కూడా ఇదే తరహాలో ఎస్ జే సూర్య పాత్రని డిజైన్ చేశారా లేదా అన్నది చూడాలి. నాని సరిపోదా శనివార ఎఫెక్ట్ రాం చరణ్ గేమ్ చేంజర్ మీద ఉంటుంది.

దిల్ రాజు నిర్మిస్తున్న గేమ్ చేంజర్ సినిమా లో కియరా అద్వాని హీరోయిన్ గా నటిస్తుంది. థమన్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమా ఈ ఇయర్ క్రిస్ మస్ కానుకగా వస్తుందని టాక్. ఇండియన్ 2 తో మరో ఫ్లాప్ ఖాతాలో వేసుకున్న శంకర్ గేమ్ చేంజర్ తో భారీ టార్గెట్ ని పెట్టుకున్నారు. ఆచార్య తర్వాత చరణ్ చేస్తున్న ఈ గేమ్ చేంజర్ ఆశించిన స్థాయిలో అంచనాలను అందుకుంటుందా లేదా అన్నది చూడాలి.