డాన్ తో నేచురల్ స్టార్ డిసైడ్ అయిపోయాడా?
నేచురల్ స్టార్ నాని పుల్ స్వింగ్ లో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం శైలేష్ కొలను దర్శకత్వంలో 'హిట్ -3'లో నటిస్తున్నాడు. ఈ సినిమాని తన సొంత నిర్మాణ సంస్థలో తానే నిర్మిస్తున్నాడు.
By: Tupaki Desk | 21 Feb 2025 8:30 AM GMTనేచురల్ స్టార్ నాని పుల్ స్వింగ్ లో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం శైలేష్ కొలను దర్శకత్వంలో 'హిట్ -3'లో నటిస్తున్నాడు. ఈ సినిమాని తన సొంత నిర్మాణ సంస్థలో తానే నిర్మిస్తున్నాడు. ఇప్పటికే చిత్రీకరణ ముగింపు దశలో ఉంది. అతి త్వరలోనే `హిట్ 3` షూట్ నుంచి రిలీవ్ అవుతాడు. అటుపై `దసరా` ఫేం శ్రీకాంత్ ఓదెల చిత్రాన్ని పట్టాలెక్కిస్తున్నాడు. `ప్యారడైజ్` టైటిల్ తో ఈ చిత్రం రూపొందనుంది.
ఇప్పటికే అన్ని పనులు పూర్తి చేసుకుని శ్రీకాంత్ నాని కోసం ఎదురు చూస్తున్నాడు. ఈ సినిమా పూర్తయిన తర్వాత యంగ్ డైరెక్టర్ సుజిత్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తాడు. ఇది వచ్చే ఏడాది ఉండే అవకాశం ఉంది. అయితే నాని కొత్త సినిమాల కమిట్ మెంట్ జోరు ఏమాత్రం తగ్గలేదు. తాజాగా కోలీవుడ్ డైరెక్టర్ తో ఓ సినిమాకి లాక్ అయినట్లు తెలుస్తోంది. శివకార్తికేయన్‌తో `డాన్` చిత్రాన్ని తెరకెక్కించిన సిబి చక్రవర్తితో నాని ఓ సినిమాకి ఒప్పందం చేసుకున్నట్లు సమాచారం.
వాస్తవానికి ఇద్దరి మధ్య కొన్ని నెలలుగా చర్చలు జరుగుతున్నాయి. అయితే ఇప్పుడా చర్చలు ఓ కొలిక్కి రావడంతో ప్రాజెక్ట్ లాక్ అయినట్లు సమాచారం. ఈ చిత్రాన్ని నిర్మించడానికి మైత్రీ మూవీ మేకర్స్ ముందుకొస్తుందని తెలుస్తోంది. ఇది భారీ బడ్జెట్ చిత్రమంటున్నారు. తెలుగుతో పాటు తమిళ్ లోనూ తెరకెక్కించాలని ప్లాన్ చేస్తున్నారుట. దీనికి సంబంధించి నిర్మాణ సంస్థ నుంచి త్వరలోనే అధికారిక ప్రకటన వస్తుందంటున్నారు.
దీంతో వచ్చే రెండేళ్ల పాటు కూడా నాని బిజీగానే ఉంటాడని తెలుస్తోంది. వీళ్లు కాకుండా నానికి మరికొంత మంది యువ దర్శకులు కూడా స్టోరీలు వినిపించి క్యూలో ఉన్నారు. అయితే వాళ్లకు నాని డేట్లు కేటాయిం చలేదు. స్టోరీలు వినడం వరకే పరిమితం చేసారు. అవి ఇంకా ఫైనల్ అవ్వాల్సి ఉంది. స్టోరీలు నచ్చితే ఫైనల్ చేయడానికి ఏడాదికి పైగా సమయం తీసుకునే ఛాన్స్ ఉంది.