Begin typing your search above and press return to search.

సైమా 2024 అవార్డుల్లో నాని మూవీస్ హవా

అంచనాలకు తగ్గట్లే శనివారం ప్రారంభమైన సైమా 2024 అవార్డు ఫంక్షన్ దుబాయ్ లో ఆడంబరంగా సాగింది.

By:  Tupaki Desk   |   15 Sep 2024 4:03 AM GMT
సైమా 2024 అవార్డుల్లో నాని మూవీస్ హవా
X

అంచనాలకు తగ్గట్లే శనివారం ప్రారంభమైన సైమా 2024 అవార్డు ఫంక్షన్ దుబాయ్ లో ఆడంబరంగా సాగింది. రెండు రోజుల పాటు సాగే ఈ ఫంక్షన్ లో తొలిరోజు (శనివారం) తెలుగు.. కన్నడ చిత్ర పరిశ్రమలకు సంబంధించిన అవార్డుల ప్రధానోత్సవం సాగింది. సైమా 2024 అవార్డుల ప్రకటన సారాంశం మొత్తాన్ని చూస్తే.. హీరో నాని సినిమాల హవా కొట్టొచ్చినట్లుగా కనిపిస్తుంది. నాని నటించిన దసరా.. హాయ్ నాన్న సినిమాలకు అవార్డుల పంట పండింది.

2023లో హీరో నాని నటించిన రెండు సినిమాలు విడుదలయ్యాయి. అందులో ఒకటి దసరా.. రెండోది హాయ్ నాన్న. రెండు సినిమాల జానర్ మాత్రమే కాదు.. స్క్రీన్ ప్రజెన్స్ లోనూ తేడా కొట్టొచ్చినట్లుగా కనిపిస్తుంది అయితే.. ఈ రెండు భిన్నమైన సినిమాలకు సైమా అవార్డుల భారీగా దక్కాయి. అవార్డుల ప్రకటనలో దసరా మూవీ అధిక్యం కొట్టొచ్చినట్లుగా కనిపించింది.

దసరా మూవీ వరకు వచ్చేసరికి.. ఉత్తమ నటుడు.. ఉత్తమ నటి మాత్రమే కాదు ఉత్తమ దర్శకుడి అవార్డును సొంతం చేసుకున్నారు. ఇక.. నాని నటించిన మరో క్లాసిక్ మూవీ హాయ్ నాన్న సినిమాకు ఏకంగా నాలుగు అవార్డులు వచ్చాయి. అంతేకాదు.. విజయ దేవరకొండ సోదరుడు ఆనంద్ దేవరకొండ నటించిన సంచలన విజయాన్ని సాధించిన బేబీ మూవీకి సైతం నాలుగు అవార్డులు దక్కాయి. సన్సేషన్ఆఫ్ ది ఇయర్ స్పెషల్ అవార్డును యానిమల్ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా అందుకున్నారు.