Begin typing your search above and press return to search.

చిరంజీవి కోసం యు'నాని'మస్!

గత కొన్ని రోజులుగా చక్కర్లు కొడుతున్న వార్తలను నిజం చేస్తూ.. మంగళవారం సాయంత్రం ఈ క్రేజీ ప్రాజెక్ట్ ను అఫిషియల్ గా అనౌన్స్ చేశారు.

By:  Tupaki Desk   |   4 Dec 2024 4:49 AM GMT
చిరంజీవి కోసం యునానిమస్!
X

మెగాస్టార్ చిరంజీవి, 'దసరా' ఫేమ్ శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్ లో ఓ సినిమాకి ప్రకటన వచ్చేసింది. గత కొన్ని రోజులుగా చక్కర్లు కొడుతున్న వార్తలను నిజం చేస్తూ.. మంగళవారం సాయంత్రం ఈ క్రేజీ ప్రాజెక్ట్ ను అఫిషియల్ గా అనౌన్స్ చేశారు. ఈ మేరకు #ChiranjeeviOdela, #ChiruOdelaCinema అనే హ్యాష్ ట్యాగ్స్ తో ప్రీలుక్ పోస్టర్ ను కూడా రిలీజ్ చేశారు. ఇక్కడ మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే, ఈ మెగా మూవీని హీరో నాని స్వయంగా సమర్పిస్తున్నారు. దీని కోసం కొత్త బ్యానర్ ను స్థాపించారు.

నేచురల్ స్టార్ నాని ఇదివరకే 'వాల్ పోస్టర్ సినిమా' అనే బ్యానర్ పెట్టి నిర్మాతగా మారిన సంగతి తెలిసిందే. తాను ప్రెజెంటర్ గా వ్యవహరిస్తూ ప్రశాంతి త్రిపురనేని నిర్మాణంలో సినిమాలు చేస్తూ వస్తున్నారు. అ!, హిట్, హిట్-2 లాంటి చిత్రాలు ఈ బ్యానర్ లోనే వచ్చాయి. ప్రస్తుతం నాని నటిస్తున్న 'హిట్ 3' మూవీ కూడా ఇదే ప్రొడక్షన్ లో రూపొందుతోంది. అయితే ఇప్పుడు చిరంజీవి - శ్రీకాంత్ ఓదెల సినిమా కోసం 'యునానిమస్ ప్రొడక్షన్స్' అనే మరో నిర్మాణ సంస్థను స్థాపించారు.

నాని తన పేరు వచ్చేలా యు'నాని'మస్ (uNANImous Productions) ప్రొడక్షన్ హౌస్ ను స్టార్ట్ చేయడం గమనార్హం. ఈ బ్యానర్ లో తొలి ప్రయత్నంగా చిరంజీవి - ఓదెల చిత్రానికి సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు. ఎస్‌.ఎల్‌.వి సినిమాస్‌ పతాకంపై సుధాకర్‌ చెరుకూరి ఈ సినిమాని భారీ బడ్జెట్ తో నిర్మిస్తారు. ఒకదానికి మరొకటి అనుబంధం అన్నట్లు టాలీవుడ్ లో చాలామంది నిర్మాతలకు రెండేసి బ్యానర్లు ఉన్నాయి. ఇప్పుడు నాని పేరు మీదుగా రెండు నిర్మాణ సంస్థలు వచ్చాయి. నాని ఇకపై 'వాల్‌ పోస్టర్ సినిమా'లో న్యూ టాలెంట్ ను ఎంకరేజ్ చేస్తూ, 'యునానిమస్ ప్రొడక్షన్స్' లో పెద్ద సినిమాలను సమర్పిస్తారేమో చూడాలి.

ఏదేమైనా నాని, శ్రీకాంత్ ఓదెల లాంటి ఇద్దరు ఫ్యాన్ బాయ్స్.. మెగాస్టార్ తో చేతులు కలపడం అందరి దృష్టిని ఆకర్షించింది. ఆల్రెడీ సోషల్ మీడియాలో #FanboyThandavam, #MegastarVaibhavam అనే హ్యష్ ట్యాగ్స్ క్రియేట్ చేయబడ్డాయి. ''నేను చిరంజీవి స్ఫూర్తితో పెరిగాను. ఆయన సినిమా టికెట్ల కోసం గంటల తరబడి లైన్లలో నిల్చున్నాను. నేను నా సైకిల్ పోగొట్టుకున్నాను. నేను ఆయన విజయాలను సెలబ్రేట్ చేసుకున్నాను. ఇప్పుడు నేను ఆయన్ని ప్రెజెంట్ చేస్తున్నాను. మేము మెగాస్టార్ మ్యాడ్ నెస్ ని చూపించడానికి వేచి చూస్తున్నాం" అని నాని పేర్కొన్నారు.

చిరంజీవి - శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్ లో మోస్ట్ వైలెంట్ మూవీ రానుందని మేకర్స్ తెలిపారు. రెడ్ కలర్ బ్యాగ్రౌండ్ తో సెట్ చేసిన ప్రీ లుక్ పోస్టర్ లో నెత్తురోడుతున్న చిరు చేతిని చూపించారు. "అతడు హింసలో తన శాంతిని వెతుక్కుంటున్నాడు'' అనే క్యాప్షన్ కూడా జోడించారు. నాని ప్రస్తుతం శ్రీకాంత్‌ ఓదెల దర్శకత్వంలోనే 'ది ప్యారడైజ్‌' అనే సినిమా చేస్తున్నారు. ఇది పూర్తయిన తర్వాత వచ్చే ఏడాది #ChiruOdelaCinema సెట్స్‌పైకి వెళ్లే అవకాశం ఉంది.