Begin typing your search above and press return to search.

నాని.. ఇదిగాని క్లిక్కయితే..

సినిమా పరిశ్రమలో కొత్త ట్రెండ్ అనుకునే ప్రయోగాలు ఎప్పుడూ కొత్త మార్గాన్ని సృష్టిస్తాయి. ముఖ్యంగా కంటెంట్ బేస్డ్ సినిమాలకు సరైన ప్రమోషన్ లేకపోతే అవి అర్ధాంతరంగా మాయమవుతాయి.

By:  Tupaki Desk   |   11 March 2025 1:16 PM IST
నాని.. ఇదిగాని క్లిక్కయితే..
X

సినిమా పరిశ్రమలో కొత్త ట్రెండ్ అనుకునే ప్రయోగాలు ఎప్పుడూ కొత్త మార్గాన్ని సృష్టిస్తాయి. ముఖ్యంగా కంటెంట్ బేస్డ్ సినిమాలకు సరైన ప్రమోషన్ లేకపోతే అవి అర్ధాంతరంగా మాయమవుతాయి. కానీ నేచురల్ స్టార్ నాని ఇప్పుడు తీసుకుంటున్న ఓ కొత్త దారి పరిశ్రమలో మార్పుకు బాటలు వేయొచ్చనే భావన కలుగుతోంది. నిర్మాతగా ఇప్పటికే 'అ!', 'హిట్' సిరీస్‌లను ప్రేక్షకులకు అందించిన నాని, ఇప్పుడు మరొక కొత్త కథాంశంతో వచ్చిన ‘కోర్ట్’ సినిమాను మరో రేంజ్‌లో ప్రమోట్ చేస్తున్నాడు.

ఇప్పటివరకు హీరోలు తమ నటన మీద ఉన్న నమ్మకంతో సినిమాలను ప్రమోట్ చేసిన సందర్భాలు చాలానే ఉన్నాయి. కానీ, ఓ నిర్మాతగా నిలబడి తన సినిమా కంటెంట్ మీద పూర్తి నమ్మకంతో ముందుగా ప్రీమియర్స్ ప్లాన్ చేయడం అంత సులభం కాదు. అది కూడా రిలీజ్ డేట్ కంటే రెండు రోజుల ముందు ప్రీమియర్స్ అంటే కాస్త రిస్క్ తో కూడుకున్న పని.

ముఖ్యంగా ‘కోర్ట్’లాంటి సినిమాలు, స్టార్ క్యాస్టింగ్ లేకుండా కేవలం కథ పరంగా ప్రేక్షకులను ఆకట్టుకునే కథనాన్ని కలిగి ఉంటే, వాటిని కమర్షియల్‌గా నిలబెట్టడం మాములు విషయం కాదు. అయితే, నాని మాత్రం ఈ సినిమాపై అత్యంత విశ్వాసంతో ముందుకు సాగుతున్నాడు. ఇలాంటి వినూత్న ప్రయత్నాలు చిన్న సినిమాలకు ఎంతో ఇన్స్పిరేషన్ ఇస్తాయి. ఇటీవల కాలంలో ప్రేక్షకుల అభిరుచులు మారిపోయాయి. కంటెంట్ ఉన్న సినిమాలు చిన్నవైనా, పెద్దవైనా ప్రేక్షకులు ఆదరించేందుకు సిద్ధంగా ఉంటున్నారు.

కానీ, సమస్య ఏమిటంటే, వాటిని ప్రేక్షకుల ముందు ఎలా తీసుకెళ్తారు అన్నదే ప్రధాన ప్రశ్న. నాని ఇప్పుడు చేస్తున్న ప్రయత్నం, భవిష్యత్తులో మరిన్ని చిన్న సినిమాలకు వేదిక అవుతుందనే నమ్మకం కలుగుతోంది. సినిమా విడుదలకి ముందే జనాలకు టాక్ తెచ్చేందుకు నాని చేస్తున్న ప్రయత్నం కొంత మంది కొత్త దర్శకులకు కూడా మార్గదర్శకంగా మారొచ్చు. చిన్న సినిమాలు పెద్ద బడ్జెట్ ప్రొమోషన్లతో పోటీ పడలేవు.

కానీ మంచి కథ, ప్రేక్షకుల ముందుకు సరైన తరహాలో తీసుకెళ్లగలిగితే విజయాన్ని సాధించగలవు. నాని ‘కోర్ట్’ కోసం చూపిస్తున్న కాన్ఫిడెన్స్ చూస్తుంటే, ఈ సినిమా సక్సెస్ అయితే ఫ్యూచర్‌లో మరిన్ని డిఫరెంట్ సినిమాలకు మార్గం సుగమం అవుతుందనే భావన కలుగుతోంది. ఇప్పటివరకు ట్రైలర్‌ను చూస్తే ఆడియన్స్ పెద్దగా ఆశ్చర్యపోయేలా ఏమీ కనిపించలేదు. కానీ అసలు కథ మాత్రం థ్రిల్లింగ్‌గా ఉంటుందని, ఆడియన్స్‌కు కూడా కనెక్ట్ అయ్యేలా ఉంటుందని నాని నమ్మకం. ఇదే నిజమైతే, ‘కోర్ట్’ సినిమా ద్వారా నాని సినిమా బిజినెస్‌కి కొత్త ఫార్మాట్ తీసుకురావచ్చు. థియేట్రికల్ రన్ కోసం మాత్రమే కాకుండా, కంటెంట్ సినిమా కూడా మంచి వసూళ్లు రాబట్టగలదని నిరూపించే అవకాశం ఉంది.

ఈ ప్రయోగం కేవలం నాని నిర్మాతగా చేసిన మరో సినిమా అనే దానికంటే, భవిష్యత్తులో కొత్త తరం సినిమాలకి మార్గదర్శకంగా మారే అవకాశం ఉంది. ప్రేక్షకుల అభిరుచులకు తగ్గ కథలు ఎప్పుడూ నిలిచేలా ఉంటాయి. అందుకే, ‘కోర్ట్’ విజయం సాధిస్తే, చిన్న సినిమాల ట్రెండ్ మళ్లీ రాబోయే రోజుల్లో మరింత బలపడొచ్చు. ఇక నాని పిలిచిన ప్రీమియర్లు ఈ ప్రయోగానికి ఎంతవరకు మద్దతునిస్తాయో, సినిమా ఎంతవరకు విజయాన్ని అందుకుంటుందో చూడాలి.