Begin typing your search above and press return to search.

నాని నెక్స్ట్ ప్లాన్.. వైలెంట్ గానే..

నేచురల్ స్టార్ నాని 'సరిపోదా శనివారం' సినిమాతో మరో సక్సెస్ ని తన ఖాతాలో వేసుకున్నారు.

By:  Tupaki Desk   |   4 Sep 2024 7:30 AM GMT
నాని నెక్స్ట్ ప్లాన్.. వైలెంట్ గానే..
X

నేచురల్ స్టార్ నాని 'సరిపోదా శనివారం' సినిమాతో మరో సక్సెస్ ని తన ఖాతాలో వేసుకున్నారు. ఈ మూవీ ఇప్పటికే బ్రేక్ ఈవెన్ టార్గెట్ ని అధికమించినట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు 70 కోట్లకి పైగా గ్రాస్ కలెక్షన్స్ ని వరల్డ్ వైడ్ గా అందుకుందంట. ఐదో రోజైన సోమవారం వీకెండ్ తో పోల్చుకుంటే కలెక్షన్స్ తగ్గాయి. అయితే ఈ వీక్ డేస్ లో నిలకడగా కలెక్షన్స్ అందుకోగలిగితే 100 కోట్ల మార్క్ ని క్రాస్ చేస్తుందని ట్రేడ్ పండితులు అంటున్నారు.

నిజానికి వీకెండ్ లో ఈ సినిమా కలెక్షన్స్ జోరు చూస్తే కచ్చితంగా దసరా మూవీ కలెక్షన్స్ రికార్డ్ ని చాలా ఈజీగా బ్రేక్ చేస్తుందని అంచనా వేశారు. అయితే తెలుగు రాష్ట్రాలలో తుఫాన్, వరదల ప్రభావం సరిపోదా శనివారం కలెక్షన్స్ పైన గణనీయంగా పడినట్లు తెలుస్తోంది. ఈ ఇంపాక్ట్ ఓవరాల్ గ్రాస్ లో కనిపిస్తోంది. ఇదిలా ఉంటే సరిపోదా శనివారం సినిమా తర్వాత నాని ఏ సినిమా చేస్తాడనే ప్రశ్న చాలా రోజుల నుంచి వినిపిస్తోంది.

శ్రీకాంత్ ఓదేల దర్శకత్వంలో ఒక సినిమాకి నాని గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. అలాగే హిట్ ఫ్రాంచైజ్ లో పార్ట్ 3 ప్రీప్రొడక్షన్ వర్క్ కూడా మొదలైంది. శైలేష్ కొలను హిట్ 3 కథ పైన వర్క్ చేస్తున్నారు. ఈ రెండింటిలో నాని ఏ సినిమాని ముందు స్టార్ట్ చేస్తాడో చూడాలనే ఆసక్తి అందరిలో నెలకొంది. అయితే సరిపోదా శనివారం మూవీ ప్రమోషన్స్ లోనే శ్రీకాంత్ ఓదేల ప్రాజెక్ట్ 2025లో మొదలవుతుందని నాని క్లారిటీ ఇచ్చారు.

దీనిబట్టి నాని వెంటనే హిట్ ఫ్రాంచైజ్ లో పార్ట్ 3ని సెట్స్ పైకి తీసుకొని వెళ్ళబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. త్వరలో దీనిపై అధికారిక ప్రకటన రావొచ్చని భావిస్తున్నారు. ఈ హిట్ 3లో నాని పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించబోతున్నారు. ఇందులో చాలా వైలెంట్ సీక్వెన్స్ ఉండబోతున్నాయంట. ఇప్పటికే నాని ఆ విషయాన్ని సరిపోదా శనివారం మూవీ సక్సెస్ మీట్ లో చెప్పుకొచ్చారు. నా నెక్స్ట్ సినిమాకు చిన్న పిల్లలు దూరంగా ఉండాల్సిందేనని చెప్పడంతో సినిమాలో ఊచకోత పక్కా అని అర్ధమవుతుంది

హిట్ 3 సినిమాని వీలైనంత వేగంగా కంప్లీట్ చేసి 2025 మార్చి లేదా ఏప్రిల్ నెలలో ప్రేక్షకుల ముందుకి తీసుకొచ్చే ప్లాన్ లో నాని ఉన్నారంట. హిట్ ఫ్రాంచైజ్ లో అత్యధిక బడ్జెట్ తో పార్ట్ 3 తెరకెక్కబోతున్నట్లు తెలుస్తోంది. త్వరలో ఈ సినిమాకి సంబందించిన అఫీషియల్ ఎనౌన్స్ మెంట్ వచ్చే ఛాన్స్ ఉందని భావిస్తున్నారు. నాని కెరియర్ లో ఫస్ట్ టైం పోలీస్ ఆఫీసర్ గా ఈ చిత్రంలో కనిపించబోతున్నాడు. అందుకే నాని ఫ్యాన్స్ ఈ సినిమాపై ప్రత్యేక ఆసక్తి చూపిస్తున్నారు.