Begin typing your search above and press return to search.

నాని 'లం** కొడుకు' కథ.. అలజడి మొదలైంది!

నేచురల్ స్టార్ నాని ఎప్పుడూ కొత్తదనం కోసం ప్రయత్నిస్తాడు. ఆయన కెరీర్‌లో చూసిన ప్రతి పాత్ర ఒక ప్రత్యేకతను కలిగి ఉంటుంది.

By:  Tupaki Desk   |   4 March 2025 11:21 AM IST
నాని లం** కొడుకు కథ.. అలజడి మొదలైంది!
X

నేచురల్ స్టార్ నాని ఎప్పుడూ కొత్తదనం కోసం ప్రయత్నిస్తాడు. ఆయన కెరీర్‌లో చూసిన ప్రతి పాత్ర ఒక ప్రత్యేకతను కలిగి ఉంటుంది. అయితే, ఈసారి ‘ది ప్యారడైజ్’ అనే సినిమాతో ప్రేక్షకుల అంచనాలను పూర్తిగా మార్చేశాడు. దర్శకుడు శ్రీకాంత్ ఓదెలతో మరోసారి జతకట్టిన నాని, తన కెరీర్‌లో ఇప్పటివరకు చేయని విధంగా ఓ విభిన్నమైన పాత్రలో కనిపించబోతున్నాడు. రీసెంట్‌గా విడుదలైన ‘Raw స్టేట్మెంట్’ టీజర్‌తో ఇది క్లియర్ అయింది. చెప్పాలంటే ఇండస్ట్రీలో అలజడి మొదలైందని చెప్పవచ్చు. ఏదో ఒక విధంగా సినిమా గురించి అందరూ మాట్లాడుకునేలా చేయడంలో మేకర్స్ సక్సెస్ అయ్యారు.

‘ది ప్యారడైజ్’ టీజర్‌ను చూస్తే ఇది కేవలం మాస్ సినిమా కాదని, విభిన్నమైన కథాంశంతో వస్తున్న ప్రాజెక్ట్ అని అర్థమవుతోంది. నాని లుక్ ఒక్కటే చాలు ఈ సినిమా గురించి ఆసక్తిని పెంచడానికి. రెండు జడలు, మెడలో గొలుసులు, ఊహించని టాటూలతో నాని పూర్తి విభిన్నంగా కనిపిస్తున్నాడు. పైగా, నాని పాత్రను సమాజంలోని నిరాదరణకు గురైన వర్గాలతో పోలుస్తూ డైరెక్టర్ తీసుకెళ్లిన కథా రీత్యా అర్థం చేసుకుంటే చాలా డీప్‌గా ఉంటుందని పిస్తోంది.

'లం** కొడుకు' కథ.. అనే ఒకే ఒక్క డైలాగ్ తో ఇండస్ట్రీలో అలజడి క్రియేట్ చేశాడు. ఇలాంటి డైలాగ్ వాడారు అంటే మామూలు విషయం కాదు. కథలో ఎంతో బరువైన ఏమోషన్ ఉందనే సంకేతం ఇచ్చారు. ఇదివరకే ‘దసరా’లో శ్రీకాంత్ ఓదెల తీసుకున్న కథ, కథనం బాగా ఆకట్టుకున్నాయి. ఇక ‘ది ప్యారడైజ్’ మాత్రం మరింత విభిన్నంగా ఉంటుందని స్పష్టమవుతోంది.

టీజర్‌లో కాకుల తీరును హ్యూమన్ ఎమోషన్స్‌కు అనుసంధానించిన విధానం చాలా న్యూ ఫీల్ ఇచ్చింది. ఇది కథకు మరింత బలం చేకూరుస్తుందనే భావన కలుగుతోంది. Raw స్టైల్ టీజర్ విడుదలైన కొన్ని గంటల్లోనే ట్రెండింగ్‌లోకి వచ్చేసింది. తెలుగు మాత్రమే కాకుండా, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లోనూ ఈ టీజర్‌కి మాస్ రెస్పాన్స్ వచ్చింది. నాని ట్రాన్స్‌ఫర్మేషన్, శ్రీకాంత్ ఓదెల దర్శకత్వ శైలి, టీజర్‌లోని ఇంటెన్స్ విజువల్స్ అన్నీ కలిసి సినిమాపై భారీ అంచనాలు ఏర్పడేలా చేశాయి.

‘ది ప్యారడైజ్’ టీజర్ చూస్తే టెక్నికల్‌గా కూడా ఇది ఒక కొత్త విజువల్ ఎక్స్‌పీరియన్స్ ఇవ్వబోతున్నట్టు అనిపిస్తోంది. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, సినిమాటోగ్రఫీ, ఆర్ట్ డిజైన్ అన్నీ కూడా ఓ నెక్స్ట్ లెవెల్ సినిమాను సూచిస్తున్నాయి. నాని కూడా తన నటనలో ఒక స్టెప్ ముందుకు వెళ్లడం గ్యారెంటీ. టీజర్‌తో సినిమా గురించి హైప్ ఇంకా పెరిగిపోయింది. ఇది కేవలం ఒక ప్రారంభమేనని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. సినిమా థియేటర్లలోకి వచ్చేంత వరకు ‘ది ప్యారడైజ్’ గురించి ఆసక్తి ఇంకా పెరుగుతూనే ఉంటుంది. ఇప్పుడు వరకు వచ్చిన రెస్పాన్స్ చూస్తుంటే, నాని కెరీర్‌లోనే అత్యంత డిఫరెంట్ సినిమా ఇదేననే టాక్ బలంగా వినిపిస్తోంది.