Begin typing your search above and press return to search.

సరిపోదా శనివారం.. ఇది అతని కోసమే..

ఇది నీ కోసమే వివేక్..అంటూ లవ్ ఎమోజీని జత చేశాడు. దీన్ని బట్టి దర్శకుడికి నాని ఎంత ఇంపార్టెన్స్ ఇస్తాడో అర్థం చేసుకోవచ్చు.

By:  Tupaki Desk   |   29 Aug 2024 8:29 AM GMT
సరిపోదా శనివారం.. ఇది అతని కోసమే..
X

టాలీవుడ్‌ నేచురల్ స్టార్‌ నాని, తన ప్రతి సినిమాను ఎంతో డెడికేషన్‌తో ఫినిష్ చేస్తాడని అందరికీ తెలిసిందే. ఏ సినిమా చేసినా, దానికి సంబంధించి ప్రతి చిన్న విషయంలో జాగ్రత్తలు తీసుకుంటూ దర్శకుడిగా ఫుల్ సపోర్ట్ ఇస్తాడు. సరిపోదా శనివారం కోసం కూడా నాని ఈ విధంగానే వ్యవహరించాడు. ఈ సినిమా దర్శకుడు వివేక్ ఆత్రేయ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ లో కూడా నిద్ర లేకుండా హార్డ్ వర్క్ చేశాడట. ఇక నాని అతనికి ఫుల్ సపోర్ట్ చేశాడు.

ఇక గతంలో సహాయ దర్శకుడిగా పనిచేసిన అనుభవం కూడా ఉండటంతో, సెట్‌లో ప్రతి దాన్ని బాగా అర్థం చేసుకొని, సహకరించడం, తగిన సలహాలు ఇవ్వడం అతనికి అలవాటు. ఇక సరిపోదా శనివారం సినిమా ప్రమోషన్స్‌లో నాని ఎంత బిజీగా ఉన్నాడో, ఆ ప్రమోషన్స్‌ను ఎలా హ్యాండిల్ చేస్తున్నాడో అన్నది అందరికీ తెలుసు. అయితే ఈ సినిమాకు దర్శకుడు వివేక్ ఆత్రేయ ప్రమోషన్ లో పూర్తి స్థాయిలో కనిపించలేదు.

వాస్తవానికి, వివేక్ ఆత్రేయ పోస్ట్ ప్రొడక్షన్ పనులతో నిద్రపోకుండా పని చేశాడట. ఫైనల్ మిక్సింగ్, క్యూబ్ చెకింగ్, యూఎస్ ప్రింట్స్ కోసం కొన్ని స్పెషల్ కాపీలు సిద్ధం చేయడం వంటి పనుల్లో అతను బిజీగా గడపాల్సి వచ్చింది. దీంతో వివేక్ తగినంత విశ్రాంతి తీసుకోకపోవడంతో అస్వస్థతకు గురయ్యాడు. అతను అలసిపోయి సోఫాలో పడుకున్న ఫొటోను నాని పోస్ట్ చేశాడు.

ఇది నీ కోసమే వివేక్..అంటూ లవ్ ఎమోజీని జత చేశాడు. దీన్ని బట్టి దర్శకుడికి నాని ఎంత ఇంపార్టెన్స్ ఇస్తాడో అర్థం చేసుకోవచ్చు. దర్శకుడు అలసిన సమయంలో నాని వ్యవహరించిన తీరు నిజంగా గ్రేట్. తన అనుభవం మరియు నైపుణ్యంతో దర్శకుడి బాధ్యతలు తీసుకొని, రెండు రోజులు డైరెక్టర్ కుర్చీలో కూర్చుని పూర్తి ఎడిటింగ్ పనులను పర్యవేక్షించాడు. చిన్న చిన్న కరెక్షన్స్ చెక్ చేసి, ఫైనల్ కాపీని సిద్ధం చేయించాడు. ఈ రెండు రోజులు నాని కేవలం రెండు గంటలే విశ్రాంతి తీసుకొని ఫైనల్ ప్రింట్ సిద్ధం చేయించడట.

నాని ఈ విధంగా సినిమా కోసం ఎంత కష్టపడ్డాడో చూస్తే, అతని సినిమా విజయం కోసం ఎంత శ్రమించాడో స్పష్టమవుతోంది. అలాగే, ప్రమోషన్స్‌కు సంబంధించి కూడా నాని బెంగళూరులో భాగస్వామ్యం కావడం, అన్ని చోట్ల సినిమా పై అంచనాలు పెంచడంలో అతని పాత్ర ఎంతో ముఖ్యమైంది. ఫ్యాన్స్ కూడా సరిపోదా శనివారం సినిమా నానికి మంచి సక్సెస్ అందిస్తుందని ఆశిస్తున్నారు. ఇప్పటికే సినిమాపై వచ్చిన పాజిటివ్ బజ్, నాని చేసిన కృషి దృష్ట్యా, ఈ సినిమా అతని కెరీర్‌లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్ కలెక్షన్స్ రాబడుతుందని అంటున్నారు.