Begin typing your search above and press return to search.

ఈ సినిమాకు ఆయనే హీరో..!

వరుస హిట్లు కొడుతూ హీరోగా నెక్స్ట్ లెవెల్ క్రేజ్ దక్కించుకుంటున్న నాని తన సినిమాలో తను పడాల్సిన కష్టం అంతా పడి సక్సెస్ క్రెడిట్ మాత్రం వేరొకరికి ఇస్తున్నాడు.

By:  Tupaki Desk   |   6 Sep 2024 7:45 AM GMT
ఈ సినిమాకు ఆయనే హీరో..!
X

వరుస హిట్లు కొడుతూ హీరోగా నెక్స్ట్ లెవెల్ క్రేజ్ దక్కించుకుంటున్న నాని తన సినిమాలో తను పడాల్సిన కష్టం అంతా పడి సక్సెస్ క్రెడిట్ మాత్రం వేరొకరికి ఇస్తున్నాడు. సాధారణంగా అయితే ఒక సినిమా సూపర్ హిట్ అయితే ఆ క్రెడిట్ అంతా తన ఖాతాలో వేసుకుని అంతా నేనే చేశానని చెప్పుకుంటారు. కానీ నాని అలా కాదు సినిమా సక్సెస్ లో తన పాత్ర కన్నా మిగతా వారి రోల్ ఎక్కువని అంటాడు. లేటెస్ట్ గా సరిపోదా శనివారం సినిమాలో మెయిన్ హీరో నేను కాదు ఎస్ జే సూర్య అని చెప్పారు. ఆయన ఆ పాత్ర చేశారు కాబట్టే సినిమాకు ఇంత క్రేజ్ వచ్చిందని అన్నారు.

సెట్ లో ఎస్ జే సూర్య గారి నటన చూసి ఎంజాయ్ చేశా.. థియేటర్ లో మీరు ఆయన పాత్ర చూసి ఎలా ఐతే ఎంజాయ్ చేశారో అలా సెట్ లో ఉన్నప్పుడు ఆయన చేస్తున్న యాక్టింగ్ చూసి చాలా ఎంజాయ్ చేశానని అన్నారు నాని. అంతేకాదు ఒక సినిమా కోసం హీరో కష్టపడతాడు. ప్రమోషన్స్ చేస్తాడు కానీ ఆయన ఈ సినిమా కోసం చాలా ప్రమోషన్స్ లో పాల్గొన్నారు. సినిమాను ఆయన ఓన్ చేసుకున్న విధానం సూపర్ అని అన్నారు.

అందుకే సరిపోదా శనివారం సినిమాలో మెయిన్ హీరో ఆయనే అంటూ చెప్పుకొచ్చారు నాని. నాని మాట్లాడుతున్న టైం లో ఎస్ జే సూర్య వచ్చి హంగ్ ఇచ్చారు. దయ సూర్య హగ్ కాస్త కొత్తగా ఉంది కదా అని ఆడియన్స్ ను ఉద్దేశించి అన్నారు నాని. ఎస్ జే సూర్య ఇప్పుడే కాదు మహేష్ స్పైడర్ లోనే తన విలనిజం చూపించారు. ఐతే ఆయనకు ఇన్నాళ్లకు సరిపోదా శనివారం లాంటి సినిమా పడింది.

దయ పాత్రలో ఎస్ జే సూర్య యాక్టింగ్ నిజంగానే నాని చెప్పినట్టుగా ఆడియన్స్ అందరిని సర్ ప్రైజ్ చేసింది. నాని హీరోయిజం కి ఈక్వల్ గా ఎస్ జే సూర్య విలనిజం అలరించింది. అందుకే సినిమాలో ఈ కాంబో క్రేజీగా అనిపించింది. ఎస్ జే సూర్య కూడా ఈ సినిమాలో నటించినందుకు సంతోషంగా ఉందని తెలుగు ప్రేక్షకుల ప్రేమని పొందడం లక్కీగా ఫీల్ అవుతున్నానని అన్నారు. సరిపోదా శనివార సక్సెస్ తో కచ్చితంగా ఎస్జే సూర్యకు తెలుగులో మంచి మంచి పాత్రలు వస్తాయని చెప్పొచ్చు.