Begin typing your search above and press return to search.

‘శనివారం’లో కిచ్చా సుదీప్-సమంత

‘సరిపోదా శనివారం’లో హీరోకు ఎవరి మీదైనా కోపం వస్తే ఆరు రోజులు అణుచుకుని శనివారం మాత్రమే దాన్ని తీర్చుకుంటాడు.

By:  Tupaki Desk   |   29 Aug 2024 5:54 PM GMT
‘శనివారం’లో కిచ్చా సుదీప్-సమంత
X

సరిపోదా శనివారం సినిమా ప్రమోషన్లలో భాగంగా ‘ఈగ’ సీక్వెల్ ప్రస్తావన రావడం.. ఒకవేళ పార్ట్-2 తీసినా తన అవసరం లేదని రాజమౌళి చెప్పినట్లు నాని ఆసక్తికర వ్యాఖ్యలు చేయడం తెలిసిందే. ఐతే ‘ఈగ’ సినిమా ప్రస్తావన యథాలాపంగా వచ్చినా.. దాని గురించి నాని ప్రత్యేకంగా మాట్లాడ్డం వ్యూహాత్మకమే అని ఈ రోజు ‘సరిపోదా శనివారం’ సినిమా చూసిన వాళ్లకు అర్థమైంది.

ఈ చిత్రంలో రెండు మూడు సీన్లలో ‘ఈగ’ సినిమాలోని పాత్రల ప్రస్తావన ఉంది. ఐతే అదేమీ ఉద్దేశపూర్వకకంగా ఇరికించినట్లు అనిపించదు. ఓ సన్నివేశంలో ‘ఈగ’ సినిమా రెఫరెన్స్ కీలకంగా అనిపిస్తుంది. హీరోయిన్ హీరోకు తన ప్రేమ తెలియజేయడానికి ‘ఈగ’ సినిమానే రెఫరెన్సుగా తీసుకోవడం విశేషం. ‘సరిపోదా శనివారం’లో హీరోకు ఎవరి మీదైనా కోపం వస్తే ఆరు రోజులు అణుచుకుని శనివారం మాత్రమే దాన్ని తీర్చుకుంటాడు.

ఐతే ఆరు రోజులు కామ్‌గా ఉండే వ్యక్తి మాత్రమే కథానాయికకు పరిచయం అవుతాడు. శనివారం విరుచుకుపడే వ్యక్తి ఆమెకు కనిపించడు. బేసిగ్గా వయొలెన్స్ అంటే ఇష్టపడని కథానాయిక శనివారం చెలరేగే వ్యక్తిని విలన్ అనుకుంటుంది. ఆ వ్యక్తి గురించి మాట్లాడుతూ.. ‘ఈగ’ సినిమా ప్రస్తావన తీసుకొచ్చి, అందులో తాను సమంత అయితే..శనివారమోడు కిచ్చా సుదీప్ అంటుంది.

మరి నేను అని నాని అడిగితే, నువ్వు ‘నాని’ అని చెబుతుంది. అలా పరోక్షంగా తన ప్రేమను హీరోయిన్ హీరోకు చెబుతుంది. దీంతో మురిసిపోయిన హీరో తన తండ్రితో ‘నాని’ అని పిలిపించుకుంటాడు. సినిమా చివర్లో హీరోయిన్ని సమంత అని కూడా పిలుస్తాడు. ఈ సన్నివేశాలకు థియేటర్లలో ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్సే వస్తోంది. ఇక ఓవరాల్‌గా సినిమాకు కూడా డీసెంట్ టాకే రావడంతో మంచి ఓపెనింగ్స్‌తో ‘సరిపోదా శనివారం’ దూసుకెళ్లేలా కనిపిస్తోంది.