Begin typing your search above and press return to search.

నార్త్ అమెరికాలో నాని మరో బిగ్ రికార్డ్

నేచురల్ స్టార్ నాని ‘సరిపోదా శనివారం’ సినిమా ఇప్పటికే వరల్డ్ వైడ్ గా 100 కోట్లకి పైగా కలెక్షన్స్ సాధించింది.

By:  Tupaki Desk   |   24 Sep 2024 11:22 AM GMT
నార్త్ అమెరికాలో నాని మరో బిగ్ రికార్డ్
X

నేచురల్ స్టార్ నాని ‘సరిపోదా శనివారం’ సినిమా ఇప్పటికే వరల్డ్ వైడ్ గా 100 కోట్లకి పైగా కలెక్షన్స్ సాధించింది. నాని ఖాతాలో సెకండ్ హైయెస్ట్ కలెక్షన్స్ చిత్రంగా ఈ మూవీ నిలిచింది. నార్త్ అమెరికాలో కూడా ‘సరిపోదా శనివారం’ మూవీ మంచి వసూళ్లని అందుకుంది. ఇప్పటి వరకు నార్త్ అమెరికాలో ‘సరిపోదా శనివారం’ మూవీ 2.5 మిలియన్ డాలర్స్ కలెక్షన్స్ ని కొల్లగొట్టిందని మేకర్స్ అధికారికంగా కన్ఫర్మ్ చేశారు.


నాని ‘దసరా’ మూవీ నార్త్ అమెరికా లో 2.7 మిలియన్ డాలర్స్ వసూళ్లతో టాప్ లో ఉంది. ఈ సినిమా కలెక్షన్స్ ని ‘సరిపోదా శనివారం’ మూవీ బ్రేక్ చేయలేకపోయిన సెకండ్ హైయెస్ట్ కలెక్షన్స్ చిత్రంగా నిలిచింది. ‘దసరా’, ‘హాయ్ నాన్న’, ‘సరిపోదా శనివారం’ సినిమాలతో హ్యాట్రిక్ హిట్స్ నాని ఖాతాలో చేరాయి. ఈ సినిమాలన్నీ కూడా నాని మార్కెట్ ని కూడా పెంచడం విశేషం.

టైర్ 2 హీరోలలో ఇప్పుడు నానికి 100 కోట్ల వరకు మార్కెట్ క్రియేట్ అయ్యిందనే మాట వినిపిస్తోంది. ప్రస్తుతం నాని శైలేష్ కొలను దర్శకత్వంలో ‘హిట్ 3’ మూవీ చేస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ దశలో ఉంది. ఏకంగా 80 కోట్ల బడ్జెట్ తో ‘హిట్ 3’ మూవీ తెరకెక్కుతోంది. ఈ సినిమాని నాని తన సొంతం ప్రొడక్షన్ లో నిర్మిస్తున్నారు. ‘అంటే సుందరానికి’ సినిమాతో వివేక్ ఆత్రేయ నానికి ఆశించిన స్థాయిలో సక్సెస్ ఇవ్వలేకపోయారు. ఆ లోటుని ‘సరిపోదా శనివారం’ సినిమాతో భర్తీ చేశారు.

డిఫరెంట్ కాన్సెప్ట్ తో యాక్షన్ డ్రామాగా ఈ మూవీ తెరకెక్కింది. మూవీలో నానితో పాటు ఎస్ జె సూర్య పెర్ఫార్మెన్స్ కి విమర్శకుల ప్రశంసలు లభించాయి. ఇంతకాలం కోలీవుడ్ లోనే స్టార్ యాక్టర్ గా దూసుకుపోయిన ఎస్ జె సూర్య కి ‘సరిపోదా శనివారం’ చిత్రంతో తెలుగులో కూడా గ్రాండ్ వెల్ కమ్ లభించింది. ప్రస్తుతం ఎస్ జె సూర్య తెలుగులో ‘గేమ్ చేంజర్’ మూవీ చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది.

ఈ మూవీ రిలీజ్ తర్వాత సూర్య తెలుగులో కూడా వరుస సినిమాలు చేసే అవకాశం ఉందనే మాట వినిపిస్తోంది. ‘స్పైడర్’ సినిమాతో సూర్య విలన్ గా కెరియర్ టర్న్ తీసుకున్నారు. అయితే ఆ సినిమా కోలీవుడ్ లో అతనికి వరుస అవకాశాలు తెచ్చిపెట్టింది. మరల ఇన్నేళ్ల తర్వాత ‘సరిపోదా శనివారం’ మూవీతో బ్రేక్ వచ్చింది.