సరిపోదా శనివారం.. నార్త్ అమెరికా మరో రికార్డ్
ఇప్పటి వరకు నార్త్ అమెరికాలో సరిపోదా శనివారం 2.05 మిలియన్ డాలర్స్ కలెక్షన్స్ ని అందుకుందంట. ఈ విషయాన్ని అధికారికంగా కన్ఫర్మ్ చేశారు.
By: Tupaki Desk | 3 Sep 2024 8:21 AM GMTతెలుగు సినిమాల పట్ల నార్త్ అమెరికాలో ప్రేక్షకులు అంతకంతకు ఆదరణ పెంచుకుంటున్నారు. ఈ విషయం సినిమాల కలెక్షన్స్ లో స్పష్టంగా కనిపిస్తోంది. ఈ ఏడాది రిలీజ్ అయిన కల్కి 2898ఏడీ నార్త్ అమెరికాలో ఏకంగా 18.5+ మిలియన్ డాలర్స్ కి పైగా కలెక్షన్స్ సొంతం చేసుకుంది. టైర్2 హీరోలలో నాని సినిమాలకి నార్త్ అమెరికాలో మంచి బిజినెస్ జరుగుతూ ఉంటుంది.
ఈ నేపథ్యంలోనే తాజాగా రిలీజ్ నాని సరిపోదా శనివారం సినిమా తెలుగు రాష్ట్రాలతో పాటు నార్త్ అమెరికాలో కూడా విశేషంగా ప్రేక్షకాదరణ సొంతం చేసుకొని థియేటర్స్ లో కొనసాగుతోంది. కుటుంబ సమేతంగా చూడదగ్గ విధంగా ఈ చిత్రం ఉండటంతో ప్రేక్షకాదరణ రోజు రోజుకి పెరుగుతోంది. ఇప్పటి వరకు నార్త్ అమెరికాలో సరిపోదా శనివారం 2.05 మిలియన్ డాలర్స్ కలెక్షన్స్ ని అందుకుందంట. ఈ విషయాన్ని అధికారికంగా కన్ఫర్మ్ చేశారు.
నాని కెరియర్ లో దసరా మూవీ నార్త్ అమెరికాలో అత్యధిక కలెక్షన్స్ ని సాధించింది. ఈ మూవీ లాంగ్ రన్ లో 2.76 మిలియన్ డాలర్స్ కలెక్షన్స్ ని నార్త్ అమెరికాలో వసూళ్లు చేసింది. సరిపోదా శనివారం కేవలం ఐదు రోజుల్లోనే 2.05 మిలియన్ డాలర్స్ కలెక్షన్స్ ని సాధించింది. ఇదే స్పీడ్ కొనసాగితే లాంగ్ రన్ లో 4 మిలియన్ డాలర్స్ ని సరిపోదా శనివారం మూవీ నార్త్ అమెరికాలో కలెక్ట్ చేసే ఛాన్స్ ఉందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు.
నాచురల్ స్టార్ నాని కెరియర్ లోనే బిగ్గెస్ట్ హిట్ మూవీగా ఈ చిత్రం నిలవబోతోందని కలెక్షన్స్ జోరు చూస్తుంటే అనిపిస్తోంది. తెలుగు రాష్ట్రాలలో వరదల ప్రభావంతో కొన్ని ప్రాంతాలలో కలెక్షన్స్ తగ్గాయి. అయితే మూవీకి వస్తోన్న టాక్ కారణంగా మెయిన్ సిటీస్ లలో థియేటర్స్ ఫుల్ అవుతున్నాయి. వరల్డ్ వైడ్ గా సరిపోదా శనివారం మూవీ కలెక్షన్స్ 70 కోట్లు క్రాస్ చేసినట్లు తెలుస్తోంది.
ఎస్ జె సూర్య, నాని పెర్ఫార్మెన్స్, వివేక్ ఆత్రేయ ప్రెజెంటేషన్ సినిమాని ప్రేక్షకులకి చేరువ చేశాయి. అలాగే కొత్త పాయింట్ తో కథని చెప్పిన విధానం కూడా అందరిని ఆకట్టుకుంది. అదే సమయంలో నాని సినిమాలలో కనిపించే ఎమోషనల్ డ్రామా కూడా సరిపోదా శనివారం సినిమాలో పుష్కలంగా ఉండటంతోనే అన్ని వర్గాల ప్రేక్షకులు ఆదరిస్తున్నారని సినీ విశ్లేషకులు అంటున్నారు.