Begin typing your search above and press return to search.

జ‌పాన్ లో నాని హంగామా ఇదే తొలిసారా?

దీంతో విదేశాల నుంచి భారీ ఎత్తున అభిమానులు ఏర్ప‌డుతున్నారు.

By:  Tupaki Desk   |   5 Feb 2025 5:49 AM GMT
జ‌పాన్ లో నాని హంగామా ఇదే తొలిసారా?
X

టాలీవుడ్ హీరోలు పాన్ ఇండియాని దాటి పాన్ వ‌ర‌ల్డ్ కే రీచ్ అవుతోన్న సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికే ప్ర‌భాస్, బ‌న్నీ, ఎన్టీఆర్, రామ్ చ‌ర‌ణ్ లాంటి స్టార్ హీరోల‌కు విదేశాల్లోనూ మంచి ఫాలోయింగ్ ఉంది. జ‌పాన్, థాయ్లాండ్, మ‌లేషియా, ర‌ష్యా లాంటి దేశాల్లోనూ ఈ న‌యా హీరోల చిత్రాలు రిలీజ్ అవుతున్నాయి. అక్క‌డ బ్లాక్ బ‌స్ట‌ర్ అందుకుంటున్నారు. దీంతో విదేశాల నుంచి భారీ ఎత్తున అభిమానులు ఏర్ప‌డుతున్నారు. ప్ర‌భాస్, తార‌క్ ల‌కు అయితే డైహార్డ్ ఫ్యాన్సే ఉన్నారు.

విదేశాల నుంచి హైద‌రాబాద్ కి వ‌చ్చి మ‌రీ బ‌ర్త్ డే విషెస్ చెప్పేంత అభిమానం విదేశాల్లోనూ సంపాదించారు. ఈ నేప‌థ్యంలో తాజాగా నేచుర‌ల్ స్టార్ నాని కూడా విదేశీ మార్కెట్ పై దృష్టి పెట్టిన‌ట్లు తెలుస్తోంది. సాధార ణంగా తెలుగు హీరోల సినిమాల‌న్నీ అమెరికాలో రిలీజ్ అవుతుంటాయి. ఇదేం పెద్ద విశేషం కాదు. అమెరికాలో తెలుగు రాష్ట్రాల అభిమానులు ఎక్కువ‌గా ఉంటారు కాబ‌ట్టి అక్క‌డ ప్ర‌తీ తెలుగు సినిమా రిలీజ్ అవుతుంది.

కాబ‌ట్టి అమెరికాలో తెలుగు సినిమా రిలీజ్ అయినా ఇండియాలో రిలీజ్ అవుత‌న్న‌ట్లే ఉంటుంది. అయితే తొలిసారి నాని కూడా జ‌పాన్ వెళ్తున్నాడు. నాని హీరోగా వివేక్ ఆత్రేయ తెర‌కెక్కించిన `స‌రిపోదాం శనివారం` చిత్రాన్ని ప్రేమికుల దినోత్స‌వాన్ని పుర‌స్క‌రించుకుని జ‌పాన్ లో ఫిబ్ర‌వ‌రి 14న రిలీజ్ చేస్తున్నారు. ఇప్ప‌టికే విష‌యాన్ని మేక‌ర్స్ అధికారికంగా ప్ర‌క‌టించారు. అడ్వాన్స్ బుకింగ్ లు కూడా ఓపెన్ అయ్యాయి.

దీంతో ఈ సినిమాని ఎలా రిసీవ్ చేసుకుంటారా? అని నాని స‌హా టీమ్ అంతా ఎంతో ఎగ్జైట్ మెంట్ తో ఎదురు చూస్తోంది. ఇప్ప‌టి వ‌ర‌కూ నాని సినిమాలేవి జ‌పాన్ లో రిలీజ్ కాలేదు. తొలిసారి `సరిపోదా శ‌నివారం` చిత్రాన్నే రిలీజ్ చేస్తున్నారు. దీంతో నాని మ‌రింత ఎగ్జైట్ మెంట్ లో ఉన్నాడు. ఈ సినిమా తెలుగు నాట మంచి విజ‌యం సాధించిన సంగ‌తి తెలిసిందే. ఇందులో ఎస్ .జె సూర్య న‌ట‌న సినిమాకే హైలైట్ గా నిలిచింది. ఈ పాత్ర జ‌పాన్ ఆడియ‌న్స్ కి క‌నెక్ట్ అయితే తిరుగుండ‌దు. నాని పంట పండిన‌ట్లే. ఈ చిత్రాన్ని డివివి ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై దానయ్య నిర్మించిన సంగ‌తి తెలిసిందే.