Begin typing your search above and press return to search.

కమ్ముల - నాని.. ప్లాన్ ఏమిటంటే..

ఇదిలా ఉండగా, నాని – శేఖర్ కమ్ముల కాంబినేషన్ లో ఓ ప్రాజెక్ట్ ప్లాన్ చేస్తున్న సంగతి సినీవర్గాలకు తెలిసిందే.

By:  Tupaki Desk   |   24 March 2025 1:34 PM IST
కమ్ముల - నాని.. ప్లాన్ ఏమిటంటే..
X

నేచురల్ స్టార్ నాని ఇటీవల చాలా బిజీగా కనిపించాడు. ది.ప్యారడైజ్ ప్రీ ప్రొడక్షన్ పనులు కోర్ట్ సినిమా రిలీజ్ అలాగే మెగాస్టార్ న్యూ ప్రాజెక్టు స్టార్ట్ అవ్వడం వంటి పనుల్లో తీరిక లేకుండా కనిపించాడు. అలాగే 'హిట్ 3' షూటింగ్‌ను పూర్తిచేసిన నాని, మే 1న విడుదలకు సిద్ధమవుతున్న ఈ సినిమాపై త్వరలో ప్రమోషన్లు ప్రారంభించబోతున్నాడు. అందుకే ప్రస్తుతం స్వల్ప విరామంలో ఉన్నాడు.

ఇదిలా ఉండగా, నాని – శేఖర్ కమ్ముల కాంబినేషన్ లో ఓ ప్రాజెక్ట్ ప్లాన్ చేస్తున్న సంగతి సినీవర్గాలకు తెలిసిందే. గత కొంతకాలంగా ఈ కాంబోపై వార్తలు వస్తున్నప్పటికీ, ప్రాజెక్ట్ మొదలయ్యే విషయంలో మాత్రం క్లారిటీ లేదు. ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాకు ఇంకా టైమ్ పట్టేలా కనిపిస్తోంది. ఇప్పటికే శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ధనుష్, నాగార్జున కలిసి నటిస్తున్న 'కుబేర' సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది.

జూన్‌లో ఈ సినిమాను విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమా పూర్తైన తరువాతే శేఖర్ కమ్ముల నాని సినిమా స్క్రిప్ట్ పనులు స్పీడ్ పట్టనున్నాయి. చాలా రోజుల క్రితమే నాని, శేఖర్ చెప్పిన ఓ సెన్సిబుల్ కథకు ఓకే చెప్పినప్పటికీ, స్క్రిప్ట్ ఫైన్‌ట్యూనింగ్‌కు ఇంకా టైమ్ కావలసి ఉంటుంది. ఈ నేపథ్యంలో, నాని శేఖర్ కమ్ముల సినిమా 2026కి పోస్ట్‌పోన్ అయినట్లు తెలుస్తోంది.

మరోవైపు నానికి ఇప్పటికే 2026కి సంబంధించి రెండు ప్రాజెక్టులు లైన్లో ఉన్నాయి. దీంతో శేఖర్ కమ్ముల ప్రాజెక్ట్ కోసం ఒకేసారి ఎక్కువ డేట్స్ ఇవ్వడం కష్టమని, ప్రతినెలా పదిరోజుల చొప్పున డేట్స్ కేటాయించనున్నట్లు తెలుస్తోంది. అంటే ఈ సినిమా షూటింగ్ కు టైమ్ పట్టే అవకాశం ఉంది. అయినా, ఈ కాంబోపై ప్రేక్షకుల్లో ఉన్న క్రేజ్ దృష్టిలో పెట్టుకొని, ఎలాంటి పద్ధతిలోనైనా సినిమా పూర్తి చేయాలని ప్లాన్ చేస్తున్నారు.

ఇక ఈ సినిమాను ఆసియన్ సునీల్ నిర్మించబోతున్నాడు. 'లవ్ స్టోరీ', 'ఫిదా' తరహాలో శేఖర్ కమ్ముల తన స్టైల్ లో తీసే సెన్సిబుల్ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా రూపొందనుంది. అందుకే నిర్మాణంలో ఖర్చుకు వెనుకాడకుండా మంచి రిచ్ ప్రొడక్షన్ వాల్యూస్‌తో సినిమా తెరకెక్కించాలనే ఉద్దేశంతో ఉన్నారని సమాచారం. నిజానికి ఈ కాంబినేషన్ చాలా రోజులుగా ఎదురుచూస్తున్నది.

ఓ వైపు నాని నేచురల్ పర్ఫామెన్స్‌కు ముద్ర వేసిన నటుడైతే, మరోవైపు శేఖర్ కమ్ముల తనదైన కథానాయక స్టైల్ లో నెమ్మదిగా కథల్ని చెప్పే దర్శకుడు. ఇద్దరి కలయికలో ఏదైనా స్పెషల్ కథ వస్తుందన్న నమ్మకం అభిమానుల్లో ఉంది. ఇదిలా ఉండగా, నాని ప్రస్తుతం 'ద ప్యారడైజ్' సినిమా షూటింగ్‌ను ప్రారంభించబోతున్నాడు. 'దసరా' డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా, ఎమోషనల్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతోంది. దాని తర్వాత నాని - సుజీత్ కాంబినేషన్‌లో మరో ప్రాజెక్ట్ ఉండబోతోంది.