Begin typing your search above and press return to search.

పిక్‌టాక్‌ : నాని షేర్‌ చేసిన కీర్తి ఎమోషనల్‌ పిక్‌

నేచురల్‌ స్టార్‌ నాని ఇన్‌స్టాగ్రామ్‌లో కీర్తి సురేష్ పెళ్లి ఫోటోను షేర్ చేశాడు.

By:  Tupaki Desk   |   13 Dec 2024 5:08 AM GMT
పిక్‌టాక్‌ : నాని షేర్‌ చేసిన కీర్తి ఎమోషనల్‌ పిక్‌
X

హీరోయిన్‌ కీర్తి సురేష్ కొత్త జీవితాన్ని మొదలు పెట్టింది. పాన్ ఇండియా హీరోయిన్‌గా మంచి గుర్తింపు దక్కించుకున్న కీర్తి సురేష్ తాజాగా గోవాలో తన ప్రియుడు ఆంటోనీతో ఏడు అడుగులు వేసింది. గోవాలో హిందూ, క్రిస్టియన్‌ సాంప్రదాయాల్లో జరిగిన ఈ పెళ్లి వేడుక ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. కీర్తి సురేష్‌, ఆంటోనీ సుదీర్ఘ కాలంగా ప్రేమించుకుని ఇన్నాళ్లకు ఒక్కటి అయ్యారు. ఈ పెళ్లి వారి జీవితంలో ఎంతో సంతోషాన్ని నింపుతుంది. ఆ విషయం వారి కళ్లలో ఉన్న ఆనందం చూస్తే అర్థం అవుతుంది. ఏ ఫోటోలో అయినా వారి కళ్లతో వెలిగిపోతున్నాయి అనే విషయాన్ని గమనించవచ్చు.

నేచురల్‌ స్టార్‌ నాని ఇన్‌స్టాగ్రామ్‌లో కీర్తి సురేష్ పెళ్లి ఫోటోను షేర్ చేశాడు. కీర్తి సురేష్ ఆనందంతో కన్నీళ్లు పెట్టుకుంటూ ఉండగా ఆంటోనీ ఆమె కళ్లను తూడ్చుతూ ఉన్నాడు. ఎంతో మంది దృష్టిని ఆకర్షిస్తున్న ఈ ఫోటో ప్రస్తుతం నెట్టింట వైరల్‌ అవుతోంది. ఒక అమ్మాయి జీవితంలో ఇంతకంటే మించి ఆనందమైన క్షణాలు ఉండవేమో అనే అభిప్రాయంను కొందరు వ్యక్తం చేస్తూ ఉంటే, మరికొందరు కోరుకున్న వ్యక్తి జీవితంలోకి రావడం అనేది ఏ అమ్మాయికి అయినా, అబ్బాయికి అయినా చాలా సంతోషాన్ని కలిగిస్తుంది. కీర్తి సురేష్ కళ్లలో ఆ ఆనందం కనిపిస్తుంది అంటూ కామెంట్స్ చేశారు.

ఈ ఫోటోతో పాటు నాని ఈ అత్యంత అద్భుతమైన దృశ్యాన్ని నేను చూశాను. కల సాకారం అయినందుకు అభినందనలు అంటూ మూడు లవ్ ఈమోజీలను షేర్ చేశాడు. కీర్తి సురేష్‌తో నానికి సన్నిహిత సంబంధాలు ఉంటాయి. తెలుగులో కీర్తి సురేష్ మొదటి సినిమా నానితో అనే విషయం తెల్సిందే. హీరోయిన్‌గా తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేసిన నాని అంటే ప్రత్యేకమైన అభిమానంను కీర్తి సురేష్ కనబర్చుతూ ఉంటుంది. దసరా సినిమాలోనూ వీరిద్దరూ కలిసి నటించిన విషయం తెల్సిందే. హీరోయిన్‌గా కీర్తి సురేష్‌కి ఎంత గొప్ప పేరు వచ్చినా నేను శైలజ, దసరా సినిమాలు చాలా స్పెషల్‌గా నిలుస్తాయి.

ఇక నాని సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం శైలేష్‌ కొలను దర్శకత్వంలో హిట్‌ ప్రాంచైజీ సినిమాను చేస్తున్నాడు. మరో వైపు శ్రీకాంత్‌ ఓదెల దర్శకత్వంలో ది పారడైజ్‌ అనే సినిమాను చేస్తున్నాడు. ఈ రెండు సినిమాలు బ్యాక్‌ టు బ్యాక్‌ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. హీరోగా సినిమాలు నటించడం మాత్రమే కాకుండా తన బ్యానర్‌లో సినిమాను నిర్మించేందుకు రెడీ అయ్యాడు. అది మెగాస్టార్‌ చిరంజీవి సినిమా కావడం విశేషం. శ్రీకాంత్‌ ఓదెల దర్శకత్వంలో చిరంజీవి హీరోగా రూపొందబోతున్న సినిమాను నాని నిర్మించబోతున్నాడు. ఇప్పటికే ఈ విషయమై అధికారిక ప్రకటన వచ్చింది.