బాపు-రమణ పాత్రల్లో నాని-శర్వానంద్!
నేచురల్ స్టార్ నాని - యంగ్ హీరో శర్వానంద్ లు ఆ రెండు పాత్రలు పోషిస్తే? అద్భుతంగా ఉంటుందన్నారు. ఐడియా బాగుంది. బాపు-రమణ ల కథను సాయి మాధవర్ అద్భుతంగా స్క్రిప్ట్ రూపంలోకి తీసుకు రాగలరు.
By: Tupaki Desk | 28 Dec 2024 6:06 AM GMTమహానటి బయోపిక్ తర్వాత టాలీవుడ్ లో జీవిత కథలంటే? ప్రత్యేకమైన ఇమేజ్ క్రియేట్ అయింది. తెగించి బయోపిక్ లు చేయరుగానీ చేస్తే అద్భుతమే అవుతుందని నాగ్ అశ్విన్ మహానటితో నిరూపించాడు. ఇదే స్పూర్తితో ఎన్టీఆర్ బయోపిక్ ని క్రిష్ తెరపైకి తెచ్చారు. రెండు భాగాలుగా ఎన్టీఆర్ కథని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. కానీ అనుకున్న స్థాయిలో ఆయన కథ ఎక్కలేదు. ఆ తర్వాత దర్శకరత్న దాసరి నారయణరావు బయోపిక్ కూడా తెరకి తెచ్చే ప్రయత్నాలు జరిగాయి కానీ...అది కార్యరూపం దాల్చలేదు.
టాలీవుడ్ లో బయోపిక్ లు అన్నది అరుదుగా కనిపించే అంశమే. కమర్శియల్ చిత్రాలకు ఇచ్చిన ప్రాధాన్యత నిర్మాతలు బయోపిక్ లకు ఇవ్వడం లేదు. ఈనేపథ్యంలో తాజాగా ఇద్దరు లెజెండ్ లు బాపు-రమణల బయోపిక్ తెరపైకి వస్తోంది. ఇద్దరి బయోపిక్ తెరకెక్కిస్తే అద్బుతంగా ఉంటుందని రచయిత సాయి మాధవ్ బుర్రా ఓ ఇంటర్వ్యూలో అభిప్రాయపడ్డారు. బాపు -రమణల పాత్రలు ఏ నటులు పోషిస్తే బాగుంటుందో కూడా చెప్పారు.
నేచురల్ స్టార్ నాని - యంగ్ హీరో శర్వానంద్ లు ఆ రెండు పాత్రలు పోషిస్తే? అద్భుతంగా ఉంటుందన్నారు. ఐడియా బాగుంది. బాపు-రమణ ల కథను సాయి మాధవర్ అద్భుతంగా స్క్రిప్ట్ రూపంలోకి తీసుకు రాగలరు. పాత తరం నటీనటుల పట్ల సాయి మాధవ్ కి మంచి అవగాహన ఉంది. అప్పటి చిత్రాల తీరును గొప్పగా విశ్లేషించగలరు. అదే పరిజ్ఞానంతో సాయి మాధవ్, బాపు -రమణ కథతో దర్శకుడిగా మారే అవకాశం లేకపోలేదు.
ఇప్పటికే ఎంతో మంది స్టార్ హీరోల సినిమాలకు రైటర్ గా పని చేసారు. అద్భుతమైన సంభాషణలతో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును, ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్నారు. అలాంటి రైటర్ డైరెక్టర్ గా టర్నింగ్ తీసుకుంటే? ఎలా ఉంటుందో చెప్పాల్సిన పనిలేదు. ఇక నానికి బాపుతో ప్రత్యేకమైన అనుబంధం ఉంది. ఆయన వద్ద శిష్యరికం చేసారు. బాపు దర్శకత్వం వహించిన సినిమాకు నాని అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసిన సంగతి తెలిసిందే.