గ్యాంగ్ స్టర్ గా నేచురల్ స్టార్..బాడీలో భారీ మార్పులా!
లార్జెర్ దెన్ లైఫ్ స్టోరీనే సిద్దం చేసినట్లు లీకులందాయి. ఈ నేపథ్యంలో తాజాగా ఇదొక గ్యాంగ్ స్టర్ డ్రామా స్టోరీ అని తెలిసింది.
By: Tupaki Desk | 3 Feb 2025 6:30 AM GMTనేచురల్ స్టార్ నాని- యంగ్ డైరెక్టర్ శ్రీకాంతో ఓదెల మరోసారి చేతులు కలిపిన సంగతి తెలిసిందే. బ్లాక్ బస్టర్ `దసరా` తర్వాత ఇద్దరి కాంబినేషన్ లో రాబోతోన్న మరో చిత్రం కావడంతో అంచనాలు భారీగా ఉన్నాయి. ఈసారి నేచురల్ స్టార్ ని ఎలాంటి పాత్రలో చూపించబోతున్నాడు? ఎలాంటి కంటెంట్ తో రాబోతున్నాడు? అన్న ఎగ్జైట్ మెంట్ అభిమానుల్లో పెరిగిపోతుంది. ఇంత వరకూ స్టోరీకి సంబంధించి ఎలాంటి లీక్ బయటకు రాలేదు.
లార్జెర్ దెన్ లైఫ్ స్టోరీనే సిద్దం చేసినట్లు లీకులందాయి. ఈ నేపథ్యంలో తాజాగా ఇదొక గ్యాంగ్ స్టర్ డ్రామా స్టోరీ అని తెలిసింది. ఇందులో నాని గ్యాంగ్ స్టర్ పాత్రలో కనిపించనున్నాడు. నాని లుక్ పూర్తి మాసివ్ గా ఉంటుందిట. దీనిలో భాగంగా నాని శరీరంలో భారీ మార్పులు తీసుకొస్తున్నాడుట. సిక్స్ ప్యాక్ లుక్ లో కనిపించనున్నాడని సమాచారం. ఈ సిక్స్ ప్యాక్ పూర్తి నేచురల్ గా ఉండబోతుందిట.
అంటే జిమ్ కి వెళ్లి కసరత్తులు చేస్తే వచ్చే సిక్స్ ప్యాక్ లుక్ లో కాకుండా? బాల్యం నుంచి రాటుదేలిన వ్యక్తి బాడీ షేప్ ఎలా ఉంటుందో? అలాంటి లుక్ లో నాని కనిపించనున్నాడుట. అంటే నేచురల్ గా సిక్స్ ప్యాక్ ఫామ్ అయితే ఎలా ఉంటుందో? అలాంటి లుక్ లో కనిపిస్తాడని సమాచారం. అందుకోసం నాని భారీగా వెయిట్ తగ్గుతున్నాడుట. ఇప్పటికే డైట్ ప్లాన్ వర్కౌట్ మొదలు పెట్టినట్లు తెలిసింది.
కేవలం ఒక పూట మాత్రమే శరీరానికి అవసరమైన మితమైన పుడ్ తీసుకుంటున్నాడుట. నేచురల్ సిక్స్ ప్యాక్ కి డైట్ కీలకం. జిమ్ లో కూడా అంతే కష్టపడాలి. ప్రస్తుతం ఈ ప్రణాళికతోనే నాని లుక్ మార్చే పనిలో ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం శ్రీకాంత్ ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నాడు. దీనిలో భాగంగా నటీనటులు, సాంకేతిక నిపుణులను ఎంపిక చేస్తున్నారు. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ మొదలవుతుందని సమాచారం.