అల్లరి నరేష్ 'బచ్చల మల్లి' ఇప్పటికే బ్లాక్ బస్టర్: నాని
అయితే బచ్చల మల్లి ట్రైలర్ ను నేడు నేచురల్ స్టార్ నాని రిలీజ్ చేశారు. ఆ తర్వాత మాట్లాడుతూ సినిమా ఇప్పటికే బ్లాక్ బస్టర్ హిట్ అయిపోయిందని వ్యాఖ్యానించారు.
By: Tupaki Desk | 14 Dec 2024 3:06 PM GMTనాంది మూవీతో తనలోని మాస్ యాంగిల్ ను పరిచయం చేసిన టాలీవుడ్ స్టార్ యాక్టర్ అల్లరి నరేష్.. ఇప్పుడు బచ్చల మల్లి సినిమాలో ఊర మాస్ లుక్ తో అలరించనున్నారు. సుబ్బు మంగాదేవి దర్శకత్వం వహిస్తున్న ఆ సినిమాలో అమృతా అయ్యర్ హీరోయిన్ గా నటిస్తున్నారు. రాజేష్ దండా ప్రొడ్యూస్ చేస్తున్నారు.
1990 బ్యాక్ డ్రాప్ తో సాగే బచ్చల మల్లి మూవీ.. క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 20వ తేదీన రిలీజ్ కానుంది. ఇప్పటికే అన్ని పనులు పూర్తి కాగా.. మేకర్స్ ప్రమోషన్స్ తో ఓ రేంజ్ లో సందడి చేస్తున్నారు. ఇప్పటికే టీజర్, గ్లింప్స్, పాటలతో సినిమాపై ఆడియన్స్ తో పాటు అభిమానుల్లో మంచి బజ్ క్రియేట్ చేశారు.. చేస్తున్నారు కూడా..
తాజాగా ట్రైలర్ తో సినిమాపై మరిన్ని అంచనాలు పెంచారు. మాస్, రా అండ్ రగ్డ్ లుక్ తో నరేష్ వేరే లెవెల్ లో అలరించనున్నట్లు ట్రైలర్ ద్వారా క్లారిటీ ఇచ్చారు. అయితే బచ్చల మల్లి ట్రైలర్ ను నేడు నేచురల్ స్టార్ నాని రిలీజ్ చేశారు. ఆ తర్వాత మాట్లాడుతూ సినిమా ఇప్పటికే బ్లాక్ బస్టర్ హిట్ అయిపోయిందని వ్యాఖ్యానించారు.
డైరెక్టర్ సుబ్బు మంగాదేవి తన మజ్నూ మూవీకి సహాయ దర్శకుడిగా పనిచేశారని, అప్పటి నుంచి ఆయన తెలుసని తెలిపారు. మంచి డైరెక్టర్ గా మారాలని తాను ప్రోత్సహించినట్లు చెప్పారు. ఇప్పుడు ఆయన సక్సెస్ ఫుల్ డైరెక్టర్ గా మారినందుకు సంతోషంగా ఉందని పేర్కొన్నారు. ట్రైలర్ విషయంలో ప్రశంసిస్తున్నట్లు తెలిపారు.
స్టోరీకి తగ్గట్టు ట్రైలర్ ను కట్ చేశారని కొనియాడారు. తాను నరేష్ తో కలిసి సినిమా చేస్తే అది పంచతంత్రం మూవీ లాగా ఉండాలని అనుకుంటున్నట్లు తెలిపారు. అదే సమయంలో నాని తనకు ఎప్పుడూ మంచి స్నేహితుడిగా ఉన్నందుకు ధన్యవాదాలు తెలిపారు అల్లరి నరేష్. సుబ్బు తన కోసం రెండున్నరేళ్లు వెయిట్ చేశారని చెప్పారు.
బచ్చల మల్లి చిత్రాన్ని నిర్మించడంలో నిర్మాత రాజేష్ దండాకు ఉన్న నిబద్ధతను అల్లరి నరేష్ ప్రశంసించారు. సినిమాలో టెక్నికల్ స్టాండర్డ్స్ రిచ్ గా ఉంటాయని, అనుకున్నదానికంటే ముందుగానే మూవీని పూర్తి చేశామని చెప్పారు. బచ్చల మల్లి కచ్చితంగా బ్లాక్ బస్టర్ అవుతుందనే నమ్మకం తనకు ఉందని తెలిపారు. మరి బచ్చల మల్లి సినిమా.. అల్లరి నరేష్ కు ఎలాంటి విజయాన్ని అందిస్తుందో వేచి చూడాలి.