Begin typing your search above and press return to search.

నాని పారడైస్.. ఆ రోల్ ఎవరు..?

సరిపోదా శనివార తర్వాత నాని శైలేష్ కొలనుతో కలిసి హిట్ 3 చేస్తున్నాడని తెలిసిందే.

By:  Tupaki Desk   |   26 Dec 2024 5:16 AM GMT
నాని పారడైస్.. ఆ రోల్ ఎవరు..?
X

టాలీవుడ్ లో వరుస సూపర్ హిట్లతో దూసుకెళ్తున్న నాని ఈ ఇయర్ సరిపోదా శనివారం అంటూ ఫ్యాన్స్ కి సరిపడేంత మాస్ స్టఫ్ ఇచ్చి ఖుషి చేశాడు. సరిపోదా శనివార తర్వాత నాని శైలేష్ కొలనుతో కలిసి హిట్ 3 చేస్తున్నాడని తెలిసిందే. ఈ సినిమాతో పాటు దసరా కాంబోలో మరో సినిమా కూడా లైన్ లో ఉంది. శ్రీకాంత్ ఓదెలతో నాని రెండో సినిమా కూడా చేస్తున్నాడు. ఆ సినిమాకు పారడైస్ అనే టైటిల్ కూడా ఫిక్స్ చేశారు. టైటిల్ అఫీషియల్ గా రాకముందే బయట లీక్ అయ్యింది.

ఐతే నాని దసరా సినిమాలో నానితో ఈక్వల్ రోల్ లో దీక్షిత్ శెట్టి నటించాడు. ఫస్ట్ హాఫ్ వరకు అతను నానికి సరిసమానమైన రోల్ ఇచ్చాడు శ్రీకాంత్. ఐతే సెకండ్ హాఫ్ మొత్తం నాని తన భుజాన వేసుకుని చేశాడు. నాని పారడైస్ సినిమాలో కూడా నానితో పాటు మరో పాత్ర అది కూడా సినిమాలో ఇంపార్టెంట్ రోల్ ఉంటుందని తెలుస్తుంది. ఆ పాత్ర నానికి ఈక్వల్ రేంజ్ లో ప్లాన్ చేస్తున్నాడట శ్రీకాంత్ ఓదెల. ఐతే ఆ రోల్ చేసేది ఎవరంటూ చర్చ మొదలైంది.

నాని సినిమాలో కథాబలం బాగుంటుంది. అందుకే సినిమాలో కథ కూడా ఒక హైలెట్ పాయింట్ అవుతుంది. ఆ కథలో నాని పాత్రతో పాటు మరో రోల్ కూడా కథను మోస్తుంది. అందుకే నాని సినిమాల్లో నానితో పాటు మరొకరికి కూడా పేరు వస్తుంది. దసరాలో దీక్షిత్, హాయ్ నాన్నాలో మృణాల్ ఇలా కథని నానితో పాటు మోస్తూ సినిమా సక్సెస్ కు కారణమవుతారు. ఐతే నాని పారడైస్ లో ఆ రోల్ ఏంటి.. దాన్ని ఎవరు చేస్తున్నారు అన్న దాని మీద డిస్కషన్ జరుగుతుంది.

నాని ఇమేజ్ కి ఈక్వల్ ఇమేజ్ ఉన్న స్టార్ నటిస్తారని కొందరు అంటుంటే ఇతర భాషల నటుడిని ఆ పాత్ర కోసం తీసుకుంటే పాన్ ఇండియా లెవెల్ లో సినిమాకు క్రేజ్ ఉంటుందని యూనిట్ భావిస్తుందట. మొత్తానికి నాని నెక్స్ట్ సినిమా కూడా ఊహలకు అందనంత రేంజ్ లో ఉండబోతుంది అని అర్థమవుతుంది. నాని శ్రీకాంత్ ఈ కలయిక లో వస్తున్న రెండో సినిమా కూడా నెక్స్ట్ లెవెల్ లో ఉండబోతుందని అర్ధమవుతుంది. మరి నాని ఈ సినిమా ఎలాంటి పాత్రలో కనిపిస్తాడు. అసలు సినిమా కథ ఏంటన్నది తెలియాల్సి ఉంది.