Begin typing your search above and press return to search.

'నాయుడు గారి తాలూకా' ఎవరై ఉంటారు..?

సినిమా షూటింగ్‌ ప్రారంభం అయ్యేది ఎప్పుడు అనేది ఇంకా క్లారిటీ రాలేదు.

By:  Tupaki Desk   |   18 Oct 2024 8:30 AM GMT
నాయుడు గారి తాలూకా ఎవరై ఉంటారు..?
X

నాని ఇటీవల సరిపోదా శనివారం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఆ సినిమాకు మంచి స్పందన దక్కింది. సరిపోదా శనివారం తర్వాత దసరా దర్శకుడు శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో నాని సినిమా చేయాల్సి ఉంది. కానీ కొన్ని కారణాల వల్ల హిట్‌ 3 ని మొదలు పెట్టాడు. ఇటీవలే హిట్‌ 3 షెడ్యూల్‌ పూర్తి అయింది. ఇటీవలే దసరా దర్శకుడు శ్రీకాంత్‌ ఓదెల దర్శకత్వంలో నాని సినిమా అధికారిక ప్రకటన వచ్చింది. సినిమా షూటింగ్‌ ప్రారంభం అయ్యేది ఎప్పుడు అనేది ఇంకా క్లారిటీ రాలేదు. కానీ టైటిల్‌ విషయంలో సోషల్‌ మీడియాతో పాటు మెయిన్‌ స్ట్రీమ్‌ మీడియాలో ప్రధానంగా చర్చ జరుగుతూ, ఒక టైటిల్‌ తెగ ప్రచారం జరుగుతోంది.

దసరా సినిమాతో నానికి భారీ విజయాన్ని అందించిన శ్రీకాంత్‌ ఓదెల ఈసారి అంతకు మించి అంటూ ఓ భారీ సినిమాను నానితో రూపొందించబోతున్నాడు. అందుకు సంబంధించిన ఏర్పాట్లు దాదాపుగా పూర్తి అయ్యాయి. ఏ క్షణంలో అయినా షూట్ మొదలయ్యే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. షూటింగ్‌ కి సంబంధించిన అప్‌డేట్‌ ఇప్పటి వరకు రాలేదు. కానీ టైటిల్‌ విషయమై జరుగుతున్న చర్చ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ సినిమాకు 'నాయుడు గారి తాలూకా' అనే టైటిల్ ను అనుకుంటున్నారు. ఈ టైటిల్‌ కథకు బాగా సెట్‌ అవుతుందని భావిస్తున్నారట. అందుకే నాని సైతం ఈ టైటిల్‌ కి గ్రీన్ సిగ్నల్‌ ఇచ్చారని తెలుస్తోంది.

ఇంతకు సినిమాలో నాయుడు ఎవరు, ఆయన తాలూకా హీరో అయి ఉంటాడా.. హీరోయిన్ అయ్యి ఉంటుందా అనేది చూడాలి. శ్రీకాంత్‌ ఓదెల గత చిత్రం దసరా లో హీరోయిన్‌ పాత్రకు చాలా ప్రాముఖ్యత ఉంది. కనుకు ఈ సినిమాలో సైతం హీరోయిన్‌ పాత్రకు ప్రాముఖ్యత ఎక్కువ ఉండే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటి వరకు హీరోయిన్‌ విషయంలో నిర్ణయం జరగలేదు. కీర్తి సురేష్ ను తీసుకోవాలని భావించినా కొన్ని కారణాల వల్ల ఆమె నటించడం లేదని తెలుస్తోంది. అది ఎందుకు అనేది తెలియాల్సి ఉంది. నాని తో గతంలో నటించిన హీరోయిన్‌ ను ఈ సినిమాలో నటింపజేయకుండా కొత్త హీరోయిన్‌ ను ప్రయత్నించే అవకాశాలు ఉన్నాయి.

ఈ సినిమాకు తమిళ స్టార్‌ సంగీత దర్శకుడు అనిరుద్‌ రవిచందర్‌ సంగీతాన్ని అందిస్తున్నాడు. నాని ని దసరా సినిమాలో చాలా మాస్ గా చూపించిన శ్రీకాంత్‌ ఓదెల ఈ సినిమాలో ఎలా చూపిస్తాడా అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటి వరకు సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన తప్ప మరే విషయాలు రాలేదు. కానీ సోషల్‌ మీడియాలో మాత్రం అనేక పుకార్లు షికార్లు చేస్తూనే ఉన్నాయి. నెట్టింట జరుగుతున్న ప్రచారంకు తెర దించుతూ దర్శకుడు శ్రీకాంత్‌ ఓదెల అన్ని ప్రశ్నలకు సమాధానాలు చెబితే బాగుంటుంది. టైటిల్‌ విషయంలో అతి త్వరలోనే స్పష్టత వచ్చే అవకాశాలు ఉన్నాయని సమాచారం అందుతోంది.