ప్యారడైజ్ నాని.. డబుల్ బొమ్మ చూపిస్తాడా..?
న్యాచురల్ స్టార్ నాని శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్ లో వస్తున్న రెండో ప్రాజెక్ట్ ప్యారడైజ్ సినిమా ఫస్ట్ గ్లింప్స్ తోనే అదుర్స్ అనిపించేశారు.
By: Tupaki Desk | 19 March 2025 5:00 AM ISTన్యాచురల్ స్టార్ నాని శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్ లో వస్తున్న రెండో ప్రాజెక్ట్ ప్యారడైజ్ సినిమా ఫస్ట్ గ్లింప్స్ తోనే అదుర్స్ అనిపించేశారు. దసరా తోనే శ్రీకాంత్ ఓదెల డైరెక్షన్ టాలెంట్ ఏంటో ప్రూవ్ కాగా ఇక ఇదే కాంబోలో సెకండ్ సినిమా అనగానే ఫ్యాన్స్ లో అంచనాలు భారీగా ఉన్నాయి. ఇక వాటికి ఎమాత్రం తగ్గకుండా ప్యారడైజ్ ని ప్లాన్ చేస్తున్నాడు నాని. ఈ సినిమా గ్లింప్స్ చూసి నాని మేకోవర్ కి సర్ ప్రైజ్ అయ్యారు. అంతేకాదు జడలతో నాని మాస్ విధ్వంసం నెక్స్ట్ లెవెల్ ఉండేలా ఉందని ఫిక్స్ అయ్యారు.
నాని శ్రీకాంత్ ఓదెల కాంబోలో వస్తున్న ప్యారడైజ్ సినిమాలో నాని పాత్ర గురించి ఇంకా క్లారిటీ రాలేదు. సినిమాఒకప్పటి సికింద్రాబాద్ నేపథ్యంతో తెరకెక్కుతుందని టాక్ వినిపిస్తుంది. ఐతే ఈ సినిమాలో నాని డబుల్ యాక్షన్ చేయబోతున్నాడని లేటెస్ట్ టాక్. అంటే నాని ఒక్కడు కాదు ఇద్దరుగా కనిపిస్తారట. సినిమాలో ఒక నాని వీరోచితంగా ఉంటే మరొక నాని చాలా సున్నిత మనసు కలవాడిగా కనిపిస్తాడట.
నాని డ్యుయల్ రోల్ చేయబోతున్న ఈ సినిమా కచ్చితంగా కెరీర్ లో ప్రత్యేకంగా ఉండబోతుందని అంటున్నారు. నాని ప్యారడైజ్ సినిమా కోసం ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుంటున్నాడు. ప్రస్తుతం హిట్ 3 ని రిలీజ్ చేసే పనుల్లో బిజీగా ఉన్న నాని నెక్స్ట్ ఫోకస్ అంతా కూడా ప్యారడైజ్ మీద పెడుతున్నాడు. తప్పకుండా నాని నుంచి ఫ్యాన్స్ ఆశిస్తున్న అన్ని అంశాలు ప్యారడైజ్ లో ఉంటాయని తెలుస్తుంది.
ఇక ఈ సినిమాలో మిగతా కాస్టింగ్ గురించి త్వరలో క్లారిటీ రానుంది. నాని శ్రీకాంత్ ఓదెల దసరాతో ఎలాగైతే సర్ ప్రైజ్ చేశారో మరోసారి ప్యారడైజ్ తో అదరగొట్టేందుకు వస్తున్నారు. నాని మాత్రం ప్యారడైజ్ ని వేరే లెవెల్ లో ఉండేలా చేస్తున్నాడు. సినిమా బడ్జెట్ కూడా నాని కెరీర్ లో హైయెస్ట్ గా ఉండబోతుందని తెలుస్తుంది.
ప్యారడైజ్ సినిమా విషయంలో శ్రీకాంత్ ఓదెల కూడా పెద్ద ప్లానింగ్ తోనే ఉన్నాడు. తప్పకుండా ఈ కాంబో సినిమా ఆడియన్స్ కి ఒక మంచి మాస్ ట్రీట్ ఇవ్వబోతుందని తెలుస్తుంది. హిట్ 3 లో కూడా నాని పవర్ ఫుల్ ఎరగెంట్ పోలీస్ ఆఫీసర్ గా కనిపిస్తుండగా దాన్ని కొనసాగిస్తూ ప్యారడైజ్ లో మరింత బీభత్సం సృష్టిస్తాడని తెలుస్తుంది.