హిట్ 3 - నాని న్యూ లుక్ కేక
ఈ పోస్టర్‌లో నాని హిమాలయాల్లో మంచుతో కప్పబడిన ప్రాంతంలో గుర్రంపై స్వారీ చేసేందుకు రెడీ అవుతున్న లుక్ లో కనిపించాడు.
By: Tupaki Desk | 25 Dec 2024 3:47 PM GMTన్యాచురల్ స్టార్ నాని తన కెరీర్ లో వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ ప్రేక్షకులను అలరిస్తున్నాడు. ఇప్పుడు ఆయన భారీ యాక్షన్ థ్రిల్లర్ హిట్ 3 లో భాగమవుతున్నారు. శైలేష్ కొలను దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం పవర్ఫుల్ యాక్షన్ తో కూడిన బ్రూటల్ థ్రిల్లర్ గా రూపొందుతోంది. హిట్ సిరీస్ లో ఇది మూడో భాగం కావడంతో భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే హిట్ ఫ్రాంచైజ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ గా ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు సంపాదించుకుంది.
మూడో భాగాన్ని మరింత గ్రాండ్ గా తీర్చిదిద్దేందుకు మేకర్స్ కసరత్తు చేస్తున్నారు. ఈ చిత్రాన్ని అత్యంత భారీ బడ్జెట్ తో హై టెక్నికల్ వాల్యూస్ తో రూపొందిస్తున్నారు. ప్రముఖ నిర్మాత ప్రశాంతి తిరుపనేని ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ టీజర్ కూడా పాజిటివ్ వైబ్రేషన్స్ క్రియేట్ చేసింది. అలాగే విడుదలైన పోస్టర్స్ కూడా హై వోల్టేజ్ తరహాలో ఉన్నాయి.
ఇక క్రిస్టమస్ పండుగను పురస్కరించుకుని చిత్రబృందం తాజాగా మరో పోస్టర్‌ను విడుదల చేసింది. ఈ పోస్టర్‌లో నాని హిమాలయాల్లో మంచుతో కప్పబడిన ప్రాంతంలో గుర్రంపై స్వారీ చేసేందుకు రెడీ అవుతున్న లుక్ లో కనిపించాడు. ట్రెండీ గానే కాకుండా, స్టైలిష్ లుక్ తో నాని ఈ పోస్టర్‌లో దుమ్ము రేపాడు. ఈ లుక్ సినిమాపై ప్రేక్షకుల అంచనాలను మరింత పెంచింది.
ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ కాశ్మీర్‌లో జరుగుతోంది. మంచు కప్పుకున్న భూభాగాల మధ్య భారీ యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందుతున్న ఈ చిత్రం థియేటర్లలో ఇప్పటివరకు చూడని వైవిధమైన వైలెంట్ థ్రిల్లింగ్ అనుభూతిని అందించబోతోందని చిత్ర యూనిట్ చెబుతోంది. మేకర్స్ ఈ సినిమాను నెవ్వర్ బిఫోర్ అనేలా భిన్నంగా, మరింత గ్రాండ్ గా తెరకెక్కించేందుకు విశేషంగా శ్రమిస్తున్నారు.
2025 మే 1, ఈ సినిమా థియేటర్లలో గ్రాండ్ గా విడుదల కానుంది. నాని నటన, శైలేష్ కొలను కథనానికి జోడీగా ఈ సినిమా ప్రేక్షకులను కొత్త అనుభూతికి గురిచేయడం ఖాయం అని ట్రేడ్ విశ్లేషకులు భావిస్తున్నారు. మొత్తానికి, హిట్ 3 తో నాని తన కెరీర్ లో మరో విభిన్నమైన పాత్రలో కనిపించబోతున్నాడు. ఈ సినిమా నానికి బిగ్గెస్ట్ రికార్డ్గా నిలిచే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. థ్రిల్లర్ సినిమాలకు ప్రాధాన్యత ఉన్న ఈ రోజుల్లో హిట్ 3 భారీ విజయాన్ని అందుకోవడం ఖాయం అని భావిస్తున్నారు.