నాని-సుజీత్: గోల్డెన్ ఛాన్స్ మిస్సయ్యిందా?
అయితే, నాని తన కెరీర్‌లో సరికొత్త యాక్షన్ ఎంటర్‌టైనర్ గా చేయాలనుకున్న సుజిత్ ప్రాజెక్టు అనుకోని మార్పులకు గురవుతోంది.
By: Tupaki Desk | 12 March 2025 7:00 AM ISTనేచురల్ స్టార్ నాని మార్కెట్ వాల్యూ కూడా ఇప్పుడు 100కోట్లకు చేరుకుంది. దసరా సినిమా అతని మార్కెట్ స్థాయిని పెంచగా సరిపోదా శనివారం కూడా స్ట్రాంగ్ కలెక్షన్స్ రాబట్టింది. ఇక నెక్స్ట్ రాబోయే హిట్ 3 కూడా అదే రేంజ్ లో క్లిక్ అవుతుంది అని నాని నమ్మకంతో ఉన్నాడు. అలాగే మరో క్రేజీ ప్రాజెక్టు ది ప్యారడైజ్ కూడా ఏదో మ్యాజిక్ క్రియేట్ చేసేలా ఉంది. నాని రొటీన్ గా వెళ్లకుండా విభిన్న జోనర్లలో నటిస్తూ కమర్షియల్ విజయాలను అందుకుంటూ ముందుకు సాగుతున్నారు.
అయితే, నాని తన కెరీర్‌లో సరికొత్త యాక్షన్ ఎంటర్‌టైనర్ గా చేయాలనుకున్న సుజిత్ ప్రాజెక్టు అనుకోని మార్పులకు గురవుతోంది. మొదట డీవీవీ దానయ్య నిర్మించాల్సి ఉండగా, ఇప్పుడు నిర్మాత మారాడు అనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ ప్రాజెక్ట్‌కు సుజీత్ దర్శకుడిగా ఎంపిక కావడం ఆసక్తికరం. 'సాహో' తర్వాత తన ప్రత్యేకమైన టేకింగ్‌తో మరో భారీ సినిమా చేయాలని చూస్తున్న సుజీత్, నానితో స్టైలిష్ యాక్షన్ థ్రిల్లర్ ప్లాన్ చేశాడు. అయితే, ప్రస్తుతం పవన్ కళ్యాణ్‌తో 'OG' ప్రాజెక్ట్‌ను పూర్తి చేయాల్సిన బాధ్యతలో ఉన్నాడు.
పవన్ ప్రస్తుతం 'హరిహర వీరమల్లు' పూర్తి చేయాల్సి ఉండటంతో 'OG' వాయిదా పడుతోంది. దాంతో, సుజీత్ నాని ప్రాజెక్ట్ ప్రారంభించడానికి మరింత ఆలస్యం కావాల్సి ఉంటుంది. ఈ టైమింగ్ కారణంగా డీవీవీ దానయ్య ఈ ప్రాజెక్ట్‌ను నిర్మించేందుకు వెనుకడుగు వేశారన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. నిర్మాతగా దానయ్యకు భారీ పాన్ ఇండియా సినిమాలపై దృష్టి ఉండటం, వెంటనే షూటింగ్ ప్రారంభించలేని పరిస్థితుల వల్ల ఈ నిర్ణయం తీసుకున్నారనే అభిప్రాయం ఉంది.
కానీ, ఇదే సమయంలో నాని కూడా 'ది పారడైస్' షూటింగ్‌ను వేగంగా పూర్తి చేయాలని భావిస్తున్నాడు. దానయ్య కాస్త సమయం ఇచ్చి, 'OG' విడుదల తర్వాత ఈ సినిమాను ప్రారంభించివుంటే మరింత హైప్ వచ్చేది. ఈ ప్రాజెక్ట్‌ను ఇప్పుడు వెంకట్ బొల్లినేని నిర్మించనున్నట్లు తెలుస్తోంది. గతంలో నానితో 'శ్యామ్ సింగరాయ్' నిర్మించిన వెంకట్, ఇప్పుడు మరోసారి నానితో కలిసి సక్సెస్ సాధించాలనే ఉద్దేశంతో ఈ సినిమాను హ్యాండిల్ చేయబోతున్నట్లు సమాచారం.
వెంకట్ ఇటీవల 'సైంధవ్'తో నిరాశ ఎదుర్కొన్నా, ఈ ప్రాజెక్ట్‌తో తిరిగి హిట్ కొట్టాలని ఆశిస్తున్నారు. నాని వెంకట్ బంధం బలంగా ఉండటంతో, ఈ మార్పు ప్రాజెక్ట్‌పై ప్రభావం చూపదని భావిస్తున్నారు. దీంతో డీవీవీ దానయ్య సరైన టైమింగ్‌లో సరైన నిర్ణయం తీసుకున్నారా? లేదా ఈ ప్రాజెక్ట్‌ను మిస్సవడం పొరపాటా? అనేదానిపై చర్చ జరుగుతోంది. 'OG' హిట్ అయితే, సుజీత్ దర్శకత్వంలో నాని సినిమా పట్ల మరింత ఆసక్తి పెరుగుతుందన్నది స్పష్టమే. తప్పకుండా సినిమా 100కోట్లకు పైగానే బిజినెస్ చేసే అవకాశం ఉండేది.
అయితే, దానయ్య సుజీత్ నాని కాంబినేషన్ ను వదిలేయడంతో గోల్డెన్ ఛాన్స్ మిస్ చేసుకున్నాడు అనేలా కామెంట్స్ వస్తున్నాయి. ఇంకాస్త టైమ్ తీసుకోని ఆలోచించుకుంటే బెటర్ గా ఉండేదేమో. మొత్తానికి, నాని-సుజీత్ ప్రాజెక్ట్ ఇప్పుడు కొత్త నిర్మాతతో ముందుకు సాగుతున్నప్పటికీ, ఇది ఎలాంటి మార్పులకు గురవుతుందో వేచి చూడాలి. డీవీవీ దానయ్య ముందుగా నిర్ణయించిన టైమ్‌ను వదులుకోవడం నిజంగా సరైనదేనా? లేక ఇది భవిష్యత్తులో ఒక మిస్ అవుట్ ప్రాజెక్ట్‌గా మిగిలిపోతుందా? అనేది చూడాలి.