కోలీవుడ్ వర్సెస్ టాలీవుడ్ కొట్టేదెవరు?
ఇంతవరకూ ఆ హీరోలిద్దరి మధ్య ఎప్పుడూ ఇలాంటి పోటీ తలెత్తలేదు. తొలిసారి అందుకే మే 1వ తేదీ వేదిక అయింది. ఇంతకీ ఎవరా హీరోలు? అంటే వివరాల్లోకి వెళ్లాల్సిందే.
By: Tupaki Desk | 25 Feb 2025 6:54 AM GMTపాన్ ఇండియాలో ఇద్దరు హీరోలు ఢీ అంటే ఢీ అంటూ బాక్సాఫీస్ బరిలోకి దిగుతున్నారు. ఒకరు రెట్టించిన ఉత్సాహంతో ఎంటర్ అవుతుంటే? మరోకరు సక్సెస్ అనే పోరు దశలో ఎంటర్ అవుతున్నారు. ఇంతవరకూ ఆ హీరోలిద్దరి మధ్య ఎప్పుడూ ఇలాంటి పోటీ తలెత్తలేదు. తొలిసారి అందుకే మే 1వ తేదీ వేదిక అయింది. ఇంతకీ ఎవరా హీరోలు? అంటే వివరాల్లోకి వెళ్లాల్సిందే.
నేచురల్ స్టార్ నాని హీరోగా నటిస్తోన్న `హిట్ ది థర్డ్ కేస్` పై ఎలాంటి అంచనాలున్నాయో చెప్పాల్సిన పనిలేదు. ఇప్పటికే రిలీజ్ అయిన ప్రచార చిత్రాలతో అంచనాలు పీక్స్ కి చేరాయి. అసలే సక్వెస్ పుల్ ప్రాంచైజీ నుంచి వస్తోన్న చిత్రం కావడంతో అంచనాలు తారా స్థాయిలో నెలకొన్నాయి. బజ్ ఎక్కడా తగ్గలేదు. పాన్ ఇండియాలో భారీ ఎత్తున రిలీజ్ అవుతున్న చిత్రమిది. నాని గత సినిమా `దసరా` పాన్ ఇండియాలో రిలీజ్ అయినా నార్త్ బెల్ట్ వర్కౌట్ అవ్వలేదు.
ఈ నేపథ్యంలో క్రైమ్ థ్రిల్లర్ తో మెప్పించడం ఖాయమనే ధీమాతో ఉన్నాడు నాని. నాని పాత్ర కూడా గత చిత్రాలకు పూర్తి భిన్నంగా ఉంటుంది. ఇలాంటి పవర్ పుల్ పోలీస్ రోల్ ఇంత వరకూ నాని పోషించలేదు. ప్రచార చిత్రాలతో నాని తెలుగు ఆడియన్స్ కే చాలా కొత్తగా కనిపిస్తున్నాడు. అయితే సరిగ్గా మే 1న సూర్య హీరోగా నటిస్తోన్న `రెట్రో` కూడా రిలీజ్ అవుతుంది. ప్రియురాలి ప్రేమ కోసం హింసను వదిలేసిన హీరోను హైలైట్ చేస్తున్నారు.
ఇందులో సూర్య ఇంట్రడక్షన్ అంతా మాస్ కోణంలోనే సాగుతుంది. సూర్య మాస్ లుక్...ప్రచార చిత్రాలు అన్ని హైప్ తీసుకొచ్చాయి. ఈ చిత్రాన్ని కార్తీక్ సుబ్బరాజ్ తెరకెక్కిస్తున్నాడు. సూర్యికి జోడీగా పూజాహెగ్డే నటిస్తోంది. ఇది పాన్ ఇండియా లో రిలీజ్ అవుతుంది. దీంతో బాక్సాఫీస్ వద్ద ఏ హీరో హైలైట్ అవుతాడు? అన్నది ఆసక్తికరంగా మారింది.