Begin typing your search above and press return to search.

నాని ది ప్యార‌డైజ్ స్పెయిన్ లో కూడానా?

నేచుర‌ల్ స్టార్ నాని ప్ర‌స్తుతం శైలేష్ కొల‌ను ద‌ర్శ‌క‌త్వంలో హిట్3తో పాటూ శ్రీకాంత్ ఓదెల ద‌ర్శ‌క‌త్వంలో ది ప్యార‌డైజ్ సినిమా కూడా చేస్తున్న విష‌యం తెలిసిందే.

By:  Tupaki Desk   |   27 Feb 2025 11:42 AM GMT
నాని ది ప్యార‌డైజ్ స్పెయిన్ లో కూడానా?
X

నేచుర‌ల్ స్టార్ నాని ప్ర‌స్తుతం శైలేష్ కొల‌ను ద‌ర్శ‌క‌త్వంలో హిట్3తో పాటూ శ్రీకాంత్ ఓదెల ద‌ర్శ‌క‌త్వంలో ది ప్యార‌డైజ్ సినిమా కూడా చేస్తున్న విష‌యం తెలిసిందే. నాని- శ్రీకాంత్ కల‌యిక‌లో వ‌స్తోన్న రెండో సినిమా ది ప్యార‌డైజ్. వీరిద్ద‌రూ క‌లిసి గ‌తంలో చేసిన ద‌స‌రా సినిమా బ్లాక్ బ‌స్ట‌ర్ గా నిల‌వ‌డంతో ఈ సినిమాపై అంద‌రికీ భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి.

ప్ర‌స్తుతం షూటింగ్ లో ఉన్న ఈ సినిమాకు అనిరుధ్ ర‌విచంద‌ర్ సంగీతం అందించ‌నున్నాడు. ఇదిలా ఉంటే చిత్ర మేక‌ర్స్ ప్ర‌స్తుతం ది ప్యార‌డైజ్ ఫ‌స్ట్ గ్లింప్స్ ను రెడీ చేసే ప‌నిలో బిజీగా ఉన్న‌ట్టు తెలుస్తోంది. రా స్టేట్‌మెంట్ పేరుతో మేక‌ర్స్ ఈ ఫ‌స్ట్ గ్లింప్స్ ను రిలీజ్ చేయ‌నున్నార‌ట‌. మార్చి 3న ఈ రా స్టేట్‌మెంట్ ను రిలీజ్ చేయ‌నున్న‌ట్టు ఇప్ప‌టికే చిత్ర బృందం అనౌన్స్ చేసింది.

ఇందులో ఇంట్రెస్టింగ్ విష‌యం ఏంటంటే, ది ప్యార‌డైజ్ కు సంబంధించి మార్చి 3న రిలీజ్ కాబోతున్న ఈ రా స్టేట్‌మెంట్ ను మేక‌ర్స్ ఏకంగా 8 భాష‌ల్లో రిలీజ్ చేయ‌నున్నార‌ట‌. ఇంగ్లీష్‌, స్పానిష్, హిందీ, బెంగాలీ భాష‌లతో పాటూ మ‌రో నాలుగు సౌత్ ఇండియ‌న్ భాష‌ల్లో ఇది రిలీజ్ కానుంది. ఒక తెలుగు సినిమా స్పెయిన్ లో రిలీజ్ కానుండ‌టం ఇదే మొద‌టిసారి.

స్పెయిన్ లో రిలీజ్ కానున్న మొద‌టి తెలుగు సినిమా నానిదే అవ‌డం విశేషం. అంతేకాదు, ఈ సినిమా కోసం నానినే స్వ‌యంగా స్పానిష్ లో డ‌బ్బింగ్ చెప్ప‌నున్నాడ‌ట‌. త‌న సినిమాల‌ను వేరే భాష‌ల్లో కూడా మార్కెటింగ్ చేసే విష‌యంలో నాని ఎప్పుడూ ముందుంటాడు. రీసెంట్ గా స‌రిపోదా శ‌నివారం సినిమా ప్ర‌మోష‌న్స్ లో అంద‌రూ ఈ విష‌యాన్ని గ‌మ‌నించారు.

ఏదో రిలీజ‌వుతున్నాయంటే అవుతున్నాయ‌ని కాకుండా, తన సినిమా రిలీజ‌వుతున్న ప్ర‌తీ భాష‌లోనూ నాని ఆ సినిమాను ప్ర‌మోట్ చేస్తాడు. అంతేకాదు, ఈ క‌థ అంద‌రికీ తెలియాల్సింది అని తాను న‌మ్మితే మాత్రం నాని దాని కోసం ఏమైనా చేస్తాడు. కెరీర్ మొద‌టి నుంచి నాని ఇదే సూత్రాన్ని ఫాలో అవుతూ వ‌స్తున్నాడు. ఇప్ప‌టికే ది ప్యార‌డైజ్ మూవీ చాలా వ‌యొలెంట్ గా ఉంటుంద‌ని అంద‌రూ అంటున్న టైమ్ లో మేక‌ర్స్ ఈ రా స్టేట్‌మెంట్ తో ఎలాంటి ఇంపాక్ట్ క్రియేట్ చేస్తారో చూడాలి మ‌రి.