నాని రెండు జడల గెటప్ పై డైరెక్టర్ ఏమంటున్నాడంటే!
నేచురల్ స్టార్ నాని చేస్తున్న సినిమాల్లో ప్రస్తుతం మోస్ట్ అవెయిటెడ్ మూవీ అంటే ది ప్యారడైజ్.
By: Tupaki Desk | 6 March 2025 1:30 PM ISTనేచురల్ స్టార్ నాని చేస్తున్న సినిమాల్లో ప్రస్తుతం మోస్ట్ అవెయిటెడ్ మూవీ అంటే ది ప్యారడైజ్. రీసెంట్ గా రిలీజైన టీజర్ తో అందరి దృష్టిని ఒక్కసారిగా ఆకర్షించింది ఈ మూవీ. టీజర్ రిలీజవక ముందు నుంచి దాని గురించి ఎంతో మంది చాలా గొప్పగా హైప్ ఇచ్చి చెప్తుంటే ఎందుకింత ఓవర్ హైప్ అనుకున్నారు కానీ టీజర్ వచ్చాక ఇదొక సంచలన టాపిక్ అయిపోయింది.
నాని లాంటి ఫ్యామిలీ హీరో సినిమాలో ల** కొడుకు అనే పదాన్ని వాడటం గురించి నెట్టింట చాలా పెద్ద డిస్కషన్సే జరుగుతున్నాయి. సినిమా రిలీజయ్యాక ఆ పదం వాడటం తప్పు కానే కాదంటారని ఓ వైపు చిత్ర యూనిట్ చెప్తుంటే, కొంతమంది మాత్రం అలాంటి పదాన్ని సెన్సార్ కూడా లేకుండా ఎలా వాడారని కామెంట్ చేస్తున్నారు.
ఇక అది కాకుండా ప్యారడైజ్ టీజర్ లో ఆడియన్స్ ను ఎక్కువ ఎట్రాక్ట్ చేసింది రెండు జడలతో నాని గెటప్. టీజర్ లో నాని ఫేస్ ను రివీల్ చేయకపోయినా వెనుక నుంచి రెండు పొడుగు జడలతో అమ్మాయిలా నానిని చూపించిన విధానం అందరినీ ఆశ్చర్యపరించింది. అసలు నానిని ఆ గెటప్ లో చూపించడానికి కారణమేంటనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
రీసెంట్ గా డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల ఓ ఇంటర్వ్యూలో దాని గురించి ఇంట్రెస్టింగ్ విషయాన్ని వెల్లడించాడు. ఈ రెండు జడల గెటప్‌కు, తన బాల్యానికి చిన్న కనెక్షన్ ఉందని, తనకు ఐదేళ్ల వయసు వరకు తన తల్లి తనను అలానే పెంచిందని, దాన్ని మనసులో పెట్టుకునే ఈ సినిమాలో నాని క్యారెక్టర్ ను డిజైన్ చేసినట్టు శ్రీకాంత్ తెలిపాడు.
ఇంతకంటే ఆ గెటప్ గురించి ఇప్పుడేం చెప్పలేనని, షూటింగ్ స్టార్ట్ అయ్యాక అవసరాన్ని బట్టి మిగిలిన విషయాలను వెల్లడిస్తామని శ్రీకాంత్ అన్నాడు. అతను చెప్పినదాన్ని బట్టి ఈ రెండు జడల గెటప్ వెనుక మూవీలో ఏదో పెద్ద కథే ఉన్నట్టు అర్థమవుతోంది. ఈ సినిమా కంటెంట్ పై నాని ఎంతో కాన్ఫిడెంట్ గా ఉన్నాడు.
గతంలో నాని- శ్రీకాంత్ కలయికలో దసరా సినిమా వచ్చి బ్లాక్ బస్టర్ అయిన విషయం తెలిసిందే. ప్యారడైజ్ మూవీ దసరాను మించి ఉంటుందని, ఈ సినిమాలో మ్యాడ్ మ్యాక్స్ చూస్తారని నాని ఇప్పటికే ప్యారడైజ్ గురించి ఓ రేంజ్ ఎలివేషన్స్ ఇచ్చాడు. ది ప్యారడైజ్ సినిమా తర్వాత శ్రీకాంత్, మెగాస్టార్ చిరంజీవిని డైరెక్ట్ చేయనున్న విషయం తెలిసిందే.