అక్కను రీలాంఛ్ చేయనున్న నాని?
సినిమాల మీద అవగాహనతో మంచి కథలను ఎంపిక చేసుకుని నేచురల్ స్టార్ ట్యాగ్ ను కూడా సొంతం చేసుకున్నాడు నాని.
By: Tupaki Desk | 8 March 2025 7:34 PM ISTఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టిన నాని ముందు అసిస్టెంట్ డైరెక్టర్ గా తన కెరీర్ ను స్టార్ట్ చేశాడు. ఆ తర్వాత అష్టాచెమ్మా సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చి మంచి హిట్ అందుకున్నాడు. సినిమాల మీద అవగాహనతో మంచి కథలను ఎంపిక చేసుకుని నేచురల్ స్టార్ ట్యాగ్ ను కూడా సొంతం చేసుకున్నాడు నాని.
ఇప్పుడు నానితో సినిమా అంటే మినిమం గ్యారెంటీ అనేస్తున్నారు దర్శకనిర్మాతలు. ప్రస్తుతం నాని హిట్3, ది ప్యారడైజ్ సినిమాలతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ఓ వైపు హీరోగా సినిమాలు చేస్తూనే నాని సొంతంగా వాల్ పోస్టర్ సినిమాస్ అనే బ్యానర్ ను స్థాపించి, అందులో కొత్త టాలెంట్ ను ఎంకరేజ్ చేస్తూ సినిమాలు నిర్మిస్తున్నాడు.
ఆల్రెడీ నాని తన బ్యానర్ ద్వారా ప్రశాంత్ వర్మ, శైలేష్ కొలను లాంటి టాలెంటెడ్ డైరక్టర్లను పరిచయం చేశాడు. ఇప్పుడు మరో కొత్త టాలెంట్ రామ్ జగదీష్ ను పరిచయం చేస్తూ కోర్టు అనే సినిమాను నిర్మించాడు నాని. ప్రియదర్శి ప్రధానపాత్రలో నటించిన ఈ సినిమా మార్చి 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా సక్సెస్‌పై నాని చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు.
అయితే కొన్ని రోజులుగా నాని సొంత బ్యానర్ లో నిర్మిస్తున్న సినిమాలకు సంబంధించిన బాధ్యతలను తన అక్క దీప్తి దగ్గరుండి మరీ చూసుకుంటుంది. ప్రతీ విషయంలో ఇన్వాల్వ్ అవుతూ ఆయా సినిమాల టీమ్ తో చాలా క్లోజ్ గా అసోసియేట్ అవుతున్నట్టు తెలుస్తోంది. గతంలో దీప్తి మీట్ క్యూట్ అనే సిరీస్ తో డైరెక్టర్ గా డెబ్యూ చేసిన విషయం తెలిసిందే. మీట్ క్యూట్ సోనీ లివ్ లో స్ట్రీమింగ్ కు అందుబాటులో ఉంది.
మీట్ క్యూట్ వచ్చి కూడా చాలా రోజులవుతుంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు నాని తన అక్క దీప్తిని డైరెక్టర్ గా తిరిగి రీలాంచ్ చేయనున్నట్టు తెలుస్తోంది. రీసెంట్ గా దీప్తి చెప్పిన కథకు నాని గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని, ప్రస్తుతం దానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయని తెలుస్తోంది. వాల్ పోస్టర్ సినిమాస్ బ్యానర్ లో నాని నిర్మించనున్న ఈ సినిమా కోసం ప్రస్తుతం నటీనటులను ఎంపిక చేసే పనిలో దీప్తి బిజీగా ఉన్నట్టు సమాచారం. ఈ సమ్మర్ లో సినిమా గురించి అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చే వీలుంది. అయితే తన అక్కను రీలాంఛ్ చేయడం విషయంలో నాని కూడా చాలా ఎగ్జైటింగ్ గా ఉన్నట్టు తెలుస్తోంది.