Begin typing your search above and press return to search.

నాని-ద‌ర్శి కాంబినేష‌న్‌లో వాల్ పోస్ట‌ర్ సినిమా

ఇదే వేదిక‌పై నాని మాట్లాడుతూ.. త‌న‌కు ద‌ర్శి అంటే ఇష్ట‌మ‌ని, త‌న న‌ట‌న‌ను అమితంగా ఇష్ట‌ప‌డ‌తాన‌ని కూడా అన్నాడు.

By:  Tupaki Desk   |   15 July 2024 5:35 PM GMT
నాని-ద‌ర్శి కాంబినేష‌న్‌లో వాల్ పోస్ట‌ర్ సినిమా
X

టాలీవుడ్‌లో హాస్య‌న‌టుడిగా త‌న‌దైన మార్క్ వేస్తూ ఎదిగాడు ప్రియ‌ద‌ర్శి. ఇప్పుడు అత‌డు హీరోగా న‌టించాడు. డార్లింగ్ అనేది సినిమా టైటిల్. అశ్విన్ రామ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. నేడు ఈ సినిమా రిలీజ్ ట్రైల‌ర్ ను నేచుర‌ల్ స్టార్ నాని రిలీజ్ చేసారు. ట్రైల‌ర్ ఆద్యంతం ఫ‌న్ ఎలిమెంట్ తో ర‌క్తి క‌ట్టించింది. టీజ‌ర్, ట్రైల‌ర్ త‌ర్వాత రెండో ట్రైల‌ర్ మ‌రింత ఉత్కంఠ‌ను పెంచింది. ఈనెల 19న సినిమా రిలీజ్ కానున్న సంగ‌తి తెలిసిందే.

ఇదే వేదిక‌పై నాని మాట్లాడుతూ.. త‌న‌కు ద‌ర్శి అంటే ఇష్ట‌మ‌ని, త‌న న‌ట‌న‌ను అమితంగా ఇష్ట‌ప‌డ‌తాన‌ని కూడా అన్నాడు. అంతేకాదు.. ద‌ర్శి త‌న‌కు మంచి స్నేహితుడు.. కంపానియ‌న్ అని కూడా నాని వెల్ల‌డించారు. అంతేకాదు ఇదే వేదిక‌పై ద‌ర్శి హీరోగా త‌న 'వాల్ పోస్ట‌ర్ సినిమా' బ్యాన‌ర్ లో త‌దుప‌రి సినిమాని నిర్మిస్తున్నాన‌ని నాని ప్ర‌క‌టించారు. వాల్ పోస్ట‌ర్ సినిమా బ్యాన‌ర్ లో మ‌రో ప్ర‌తిభావంతుడైన ద‌ర్శ‌కుడిని ప‌రిచ‌యం చేయ‌బోతున్నాం.. అంటూ జ‌గ‌దీష్ అనే న‌వ‌త‌రం ద‌ర్శ‌కుడిని ప‌రిచ‌యం చేసారు. జ‌గదీష్ పేరు మ‌ళ్లీ మ‌ళ్లీ వినిపిస్తుంది.. అని నాని ఈ సంద‌ర్భంగా అన్నారు. ద‌ర్శి అద్భుత‌మైన ప్ర‌తిభ‌ను గుర్తిస్తాడు. అత‌డు ఫ‌లానా వ్య‌క్తి ప్ర‌తిభావంతుడు అని చెబితే నేను వెంట‌నే అది వింటాను.. నమ్ముతాను.. అని కూడా అన్నారు. అద్భుతంగా న‌వ్వుకునే సినిమా ఇది. ఎమోష‌న్స్ ఆక‌ట్టుకుంటాయి. ప్ర‌తి ఒక్క‌రూ న‌ట‌న ప‌రంగా అద‌ర‌గొట్టేశారు.. అని ఈ వేదిక‌పై నిర్మాత‌లు తెలిపారు.

అలాగే కామెడీ జాన‌ర్ లో వ‌స్తున్న డార్లింగ్ సినిమాని ఆద‌రించాల‌ని ప్రేక్ష‌కుల‌ను నాని కోరారు. చిన్న‌ప్పుడు అన్ని జాన‌ర్ సినిమాల‌ను ఆస్వాధించేవాళ్లం. కానీ ఇటీవ‌ల ఒకే త‌ర‌హా జాన‌ర్ సినిమాలు చూడాల్సొస్తోంది. ఇప్పుడు కూడా కామెడీ, రొమాన్స్, యాక్ష‌న్ ఇలా అన్ని ర‌కాల సినిమాల‌ను చూడాలి. ద‌ర్శి ఆ త‌ర‌హాలో ప్ర‌యోగం చేయ‌డం ఆస‌క్తిని క‌లిగిస్తోంది. ద‌ర్శి పెద్ద విజ‌యం సాధిస్తాడు..అని అన్నారు. ఈ కార్య‌క్ర‌మంలో న‌భా న‌టేష్ స‌హా చిత్ర‌బృందం పాల్గొంది. ప్రైమ్ షో ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై కె నిరంజన్‌రెడ్డి డార్లింగ్ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.