ప్రభాస్- వార్సీ ఇష్యూ.. నాని కూడా బాధితుడయ్యాడా?
నా వ్యాఖ్యలు కూడా ప్రజల్లోకి వేరే విధంగా చేరాయి" అని నాని చెప్పారు. ఇప్పుడు నాని వ్యాఖ్యలు మళ్లీ వైరల్ గా మారాయి.
By: Tupaki Desk | 23 Aug 2024 11:28 AM GMTటాలీవుడ్ స్టార్ హీరో ప్రభాస్ పై బాలీవుడ్ నటుడు అర్షద్ వార్సీ చేసిన కామెంట్స్ ఇష్యూ.. ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద చర్చనీయాంశంగా మారింది. అనేక మంది నటీనటులు స్పందిస్తున్నారు. ప్రభాస్ కు మద్దతుగా నిలుస్తున్నారు. తమదైన శైలిలో కౌంటర్స్ ఇస్తున్నారు. ఫ్యాన్స్ అయితే ఓ రేంజ్ లో ట్రోల్స్ చేస్తున్నారు. వార్సీపై తీవ్రంగా ఫైర్ అవుతున్నారు. జోకర్ కామెంట్ వెనక్కి తీసుకోవాల్సిందేనని డిమాండ్ చేస్తున్నారు. అలా ఎక్కడా చూసినా వార్సీ ఇష్యూ పోస్టులే.
అయితే హీరో నాని.. ఈ విషయంపై రీసెంట్ గా తన అప్ కమింగ్ మూవీ సరిపోదా శనివారం ప్రెస్ మీట్ లో స్పందించారు. బహుశా ఆయనకు ఇదే అతి పెద్ద పబ్లిసిటీ అయ్యి ఉంటుందని నవ్వూతూ వార్సీ పేరు ఎత్తకుండా కౌంటర్ ఇచ్చారు. ఆయన కామెంట్స్ ను మీడియా హైలెట్ చేస్తున్నట్లు అనిపిస్తుందని అన్నారు. దీంతో నాని కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. నార్త్ కు చెందిన నెటిజన్లు నానిని దారుణంగా ట్రోల్స్ చేశారు. అవమానకరంగా ట్వీట్స్ చేశారు.
అదే సమయంలో సరిపోదా శనివారం మూవీ ప్రమోషన్స్ లో భాగంగా తాజాగా ముంబైకు వెళ్లారు నాని. తన కామెంట్స్ పై ట్రోల్స్ వస్తున్నా.. ప్రెస్ మీట్స్ లో పాల్గొన్నారు. ప్రముఖ మీడియా సంస్థలతో ఇంటరాక్ట్ అయ్యారు. అదే సమయంలో తనపై వచ్చిన ట్రోల్స్ పై రెస్పాండ్ అయ్యారు. అర్షద్ వార్సీపై తన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ మాట్లాడారు. పదాల ఎంపికలో తాను జాగ్రత్త వహించాల్సి ఉంటే బాగుండేదని తెలిపారు. అలా చేయకపోవడం తానూ బాధితుడినయ్యానని చెప్పారు నాని.
"ప్రభాస్ పెద్ద సినిమాలు చేస్తున్నాడు కనుక హీరో అవ్వలేదు. ఆయన బిహేవియర్ తోపాటు అన్ని అంశాల వల్ల బిగ్ హీరో అయ్యారు. అందుకే ఆయనపై విమర్శ వస్తే ఎవరైనా స్పందిస్తారు. అందుకే నేను కూడా స్పందించా. అయితే నటులుగా ఉన్నప్పుడు.. మాటల విషయంలో జాగ్రత్తగా ఉండాలని అర్థమైంది. వర్డ్స్ సెలక్షన్ లో కచ్చితంగా జాగ్రత్తగా వ్యవహరించాలి. అర్షద్ కూడా ప్రముఖ నటుడు. ఇండియా వైడ్ గా మంచి ఫ్యాన్స్ ఉన్నారు" అని తెలిపారు.
"ప్రభాస్ పై ప్రేమతో నా రెస్పాన్స్ నార్మల్ గానే ఉంది. అనవసరమైన విషయానికి మనం ఎందుకంత ప్రాధాన్యత ఇవ్వాలని మనం ఇష్టపడే వారి టాపిక్ లో అంటుంటాం. నేను కూడా అలాగే అన్నా. కానీ నా కామెంట్స్ పై రియాక్షన్స్ వచ్చిన తర్వాత నేను కొత్త కోణంలో అర్షద్ ఇంటర్వ్యూను మొత్తం చూశా. అప్పుడు మీడియా, సోషల్ మీడియా ద్వారా మొత్తం విషయం తప్పుదోవ పట్టిందని అర్థమైంది. నా వ్యాఖ్యలు కూడా ప్రజల్లోకి వేరే విధంగా చేరాయి" అని నాని చెప్పారు. ఇప్పుడు నాని వ్యాఖ్యలు మళ్లీ వైరల్ గా మారాయి.