Begin typing your search above and press return to search.

న్యాచురల్ స్టార్ సర్టిఫికెట్ ఇచ్చాడంటే..?

అందుకే కెప్టెన్ ఆఫ్ ది షిప్ నిర్మాత అయితే అసలు ఆ షిప్ నడిపించేది నిర్మాత అంటారు.

By:  Tupaki Desk   |   25 Aug 2024 6:09 AM GMT
న్యాచురల్ స్టార్ సర్టిఫికెట్ ఇచ్చాడంటే..?
X

సినిమా అనేది ఒక దర్శకుడి కల. తాను రాసుకున్న కథను తెర మీద చూపించాలనే దర్శకుడి ఆలోచనకు నటులు, సాంకేతిక నిపుణులు ఇలా అందరు కలిసి పనిచేసేలా చేస్తుంది. ఐతే ఇవన్నీ జరగాలంటే మాత్రం ఒకరు డబ్బులు పెట్టాల్సిందే. అతనే నిర్మాత సినిమా మీద దర్శకులు, నటులు, టెక్నిషియన్స్ వీరంతా తమ టైం, ఇంకా శ్రమ పెడతారు కానీ దానికి మించింది ఇదంతా సాధ్యమయ్యేలా చేసేది డబ్బు పెట్టడమే. అందుకే కెప్టెన్ ఆఫ్ ది షిప్ నిర్మాత అయితే అసలు ఆ షిప్ నడిపించేది నిర్మాత అంటారు.

ఈ నిర్మాతల్లో ఒక్కొక్కరు ఒక్కోలా ఉంటారు. కొంత తాము నిర్మిస్తున్న సినిమాకు అన్నీ తామై నడిపిస్తుంటారు. అంటే సినిమా షూటింగ్ జరుగుతుంటే సెట్ లోనే ఉంటూ అంతా పర్యవేక్షిస్తూ ఉంటారు. కానీ కొందరు మాత్రం అలా కాదు కేవలం సినిమాకు డబ్బులు పెట్టేసి యూనిట్ పై నమ్మకంతో అలా వదిలేస్తారు. అలాంటి అతికొద్దిమంది నిర్మాతల్లో ఒకరు డివివి దానయ్య. నిర్మాతగా దానయ్య కూడా తన ప్రొడక్షన్ స్పెషాలిటీ ప్రూవ్ చేస్తూ వస్తున్నారు.

లేటెస్ట్ గా దానయ్య డివివి నానితో సరిపోదా శనివారం సినిమా నిర్మించారు. ఈ నెల 29న రిలీజ్ అవుతున్న ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో నిర్మాత దానయ్య గురించి నాని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. దానయ్య గారికి ఆయన నిర్మిస్తున్న సినిమా కథ కూడా పూర్తిగా తెలియదు. పూర్తిగా మా మీద నమ్మకంతో సినిమాను మాకు వదిలేస్తారని అన్నాడు నాని. సినిమా మీద ఆయనకున్న ఆ పాజిటివ్ నెస్ తోనే ఆయనకు మంచి సినిమాలు పడుతున్నాయి. నిన్ను కోరి, ఆర్.ఆర్.ఆర్, సరిపోదా శనివారం లాంటి సినిమాలు ఆయన నిర్మాణంలో వచ్చాయి అంటే ఆయన సినిమా పాజిటివ్ నెస్ వల్లే అని చెప్పొచ్చు.

కథ తెలియకుండానే నిర్మించే నిర్మాత డివివి దానయ్య అయినా కూడా ఆయనకు ఎక్కడో ఒకచోట మచ్చ ఉంది. అందుకే వరుస సక్సెస్ లు అందుకుంటున్నారని నాని అన్నారు. ఇక ఇదే ఈవెంట్ లో నిర్మాత దానయ్య కూడా సినిమాతో హిట్ కొడుతున్నామని కాన్ఫిడెంట్ గా చెప్పారు. నాని సినిమా అంటే నిర్మాతలు రిలాక్స్ గా ఉండొచ్చని సినిమాకు సంబందించిన అన్ని బాధ్యతలు ఆయనే చూసుకుంటారని అన్నారు దానయ్య డివివి. సరిపోదా శనివారం సినిమా ప్రీ రిలీజ్ బజ్ అయితే భారీగా ఉంది. సినిమా అనుకున్న రేంజ్ లో ఉంటే మాత్రం కచ్చితంగా భారీ సక్సెస్ అందుకునే ఛాన్స్ ఉందని చెప్పొచ్చు.